Skip to main content

నాలుగో ఎడిషన్ స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆగస్టు 1న స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్ నాలుగో ఎడిషన్ ను నిర్వహించింది.
Edu newsప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమే దీని ఉద్దేశం. 2020 ఏడాది 243 సమస్యల పరిష్కారానికి 10 వేల మందికిపైగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు. హ్యాకథాన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.... ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిందన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను  ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకంల్పించిందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
  స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్ నాలుగో ఎడిషన్ నిర్వహణ
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ
ఎందుకు :ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమేల‌క్ష్యంగా
Published date : 04 Aug 2020 11:38AM

Photo Stories