మౌలిక రంగంలో రూ. 102 లక్షల కోట్ల పెట్టుబడులు
Sakshi Education
మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను ‘జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్ (నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్-ఎన్‌ఐపీ)’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 31న వెల్లడించారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (దాదాపు రూ.356 లక్షల కోట్లు) అవతరించేందుకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం..
క్విక్ రివ్యూ :
ఏమిటి : మౌలిక రంగంలో రూ. 102 లక్షల కోట్ల పెట్టుబడులు
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
మాదిరి ప్రశ్నలు
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం..
- ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ నాలుగు నెలల్లో 70 భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించి రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టులను విద్యుత్, రైల్వేస్, అర్బన్ ఇరిగేషన్, మొబిలిటీ, విద్య, ఆరోగ్య రంగాల్లో గుర్తించింది. మరో రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు కూడా వీటికి తోడవుతాయి.
- గత ఆరేళ్లలో కేంద్రం, రాష్ట్రాలు మౌలిక రంగంపై చేసిన రూ.51 లక్షల కోట్ల వ్యయానకి ఇది అదనం.
- ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టుల్లో కేంద్రం, రాష్ట్రాల నుంచి చెరో 39 శాతం, ప్రైవేటు రంగం నుంచి 22 శాతం ఉంటాయి.
- ఎన్‌ఐపీ ప్రాజెక్టుల్లో రూ.42.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. రూ.32.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు తయారీ దశలో, 19.1 లక్షల కోట్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.
- ఎన్‌ఐపీ ప్రాజెక్టులు ఇవి 22 శాఖలు, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అమలవుతాయి.
రంగం | ప్రాజెక్టుల విలువ (రూ.లక్షల కోట్లు) |
ఇంధనం | 24.54 |
రోడ్లు | 19.63 |
రైల్వే | 13.68 |
పోర్టులు | 1 |
విమానాశ్రయాలు | 1.43 |
టెలికం | 3.2 |
ఇరిగేషన్ | 7.7 |
పట్టణ మౌలిక సదుపాయాలు | 16.29 |
గ్రామీణ మౌలిక సదుపాయాలు | 7.7 |
పారిశ్రామిక మౌలిక సదుపాయాలు | 3.07 |
సోషల్ ఇన్‌ఫ్రా | 3.56 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : మౌలిక రంగంలో రూ. 102 లక్షల కోట్ల పెట్టుబడులు
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
మాదిరి ప్రశ్నలు
1. 1. 2025 నాటికి ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
1. 3
1. 3
2. 8
3. 6
3. 6
4. 5
- View Answer
- సమాధానం: 4
2. ఎన్‌ఐపీ ప్రాజెక్టుల్లో ప్రైవేటు రంగం వాటా ఎంత శాతం?
1. 42
2. 66
3. 22
4. 14
- View Answer
- సమాధానం: 3
Published date : 01 Jan 2020 07:04PM