Skip to main content

మార్కెట్ ఇంటెలిజెన్స్ వెబ్‌సైట్ ఆవిష్కరణ

టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఎంఐఈడబ్ల్యూఎస్)’ వెబ్‌సైట్‌ను కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ ఆవిష్కరించారు.
Current Affairsఢిల్లీలో ఫిబ్రవరి 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ఎంఐఈడబ్ల్యూఎస్ పోర్టల్ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది.

మంత్రి బాదల్ మాట్లాడుతూ.. ‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో ‘ఆపరేషన్స్ గ్రీన్’ పథకం కింద ప్రభుత్వం సకాలంలో స్పందించి.. అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్ స్టోరేజ్‌లకు తరలించేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది. లేదా మిగులు ఉత్పత్తిని డిమాండ్ ఉన్న చోటుకు తరలించేందుకు సాయమందిస్తుంది’ అని తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎంఐఈడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు
Published date : 27 Feb 2020 05:25PM

Photo Stories