Skip to main content

ఖాదీ ప్రాకృతిక్ పెయింట్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి (కేవీఐసీ).. ఆవు పేడతో పెయింట్‌ను అభివృద్ధి చేసింది.
Current Affairs
ఈ వాల్ పెయింట్‌కు ‘‘ఖాదీ ప్రాకృతిక్ పెయింట్’’గా నామకరణం చేశారు. కేంద్ర జాతీయ రవాణా, ఖాదీ, పరిశ్రమల మండలి, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ జనవరి 12న న్యూఢిల్లీలో ఈ పెయింట్‌ను ఆవిష్కరించారు.

పర్యావరణ అనుకూలం...
పర్యావరణ అనుకూల, హాని చేయని, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఖాదీ ప్రాకృతిక్ రంగుల తయారీలో గోవుల పేడను ప్రధాన పదార్థంగా ఉపయోగించారు. భారతీయ ప్రమాణాల మండలి ధ్రువీకరణను కూడా ఈ ఉత్పత్తి పొందింది.

రూ.6,000 కోట్లు...
కార్యక్రమంలో మంత్రి గడ్కరీ మాట్లాడుతూ... ప్రాకృతిక్ పెయింట్ రూ.6,000 కోట్ల స్థాయి పరిశ్రమగా అవతరిస్తుందన్నారు. అలాగే కేవీఐసీ ఆదాయాన్ని ప్రస్తుత రూ.80,000 కోట్ల నుంచి రానున్న ఐదేళ్లలో రూ.5లక్షల కోట్లకు చేర్చాలనుకుంటున్నట్టు చెప్పారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : కేంద్ర జాతీయ రవాణా, ఖాదీ, పరిశ్రమల మండలి, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 13 Jan 2021 05:46PM

Photo Stories