Skip to main content

కుప్పకూలిన ఫిలిప్పీన్స్‌ సైనిక విమానం పేరు?

ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వైమానిక దళానికి చెందిన లాక్‌హీడ్‌ సి–130 హెర్క్యూలస్‌ విమానం జూలై 4న ల్యాండింగ్‌ అవుతుండగా నేలకూలింది.
Current Affairs
సులూ ప్రావిన్స్‌లోని జోలో ఎయిర్‌పోర్టు సమీపంలోనే బాంగ్‌కల్‌ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కారణంగా విమానంలో ఉన్నవారిలో 45 మంది సైనికులు, నేలపై ఉన్న ముగ్గురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది, 89 మంది సైనికులు ఉన్నారు.

అమెరికా ఇచ్చిన విమానం
సైనిక సహాయంలో భాగంగా అమెరికా వైమానిక దళం 2021 ఏడాది రెండు లాక్‌హీడ్‌ సి–130 హెర్క్యూలస్‌ విమానాలను ఫిలిప్పీన్స్‌ ఎయిర్‌ఫోర్సుకు అందజేసింది. వీటిలో ఒకటి జూలై 4న ప్రమాదవశాత్తూ నేలకూలింది.

ఫిలిప్పీన్స్‌...
రాజధాని : మనీలా
కరెన్సీ : ఫిలిప్పైన్‌ పెసో
ప్రస్తుత అధ్యక్షుడు : రోడ్రిగో డ్యూటెర్టే

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : కుప్పకూలిన ఫిలిప్పీన్స్‌ సైనిక విమానం
ఎప్పుడు : జూలై 4
ఎవరు : లాక్‌హీడ్‌ సి–130 హెర్క్యూలస్‌
ఎక్కడ : బాంగ్‌కల్‌ గ్రామం, జోలో ఎయిర్‌పోర్టు సమీపం, సులూ ప్రావిన్స్, ఫిలిప్పీన్స్‌
ఎందుకు : ల్యాండింగ్‌ సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా...
Published date : 05 Jul 2021 05:28PM

Photo Stories