Skip to main content

కోయెల్ కరో ప్రాజెక్టుకు శంకుస్థాపన

జార్ఖండ్‌లో నిర్మించనున్న కోయెల్ కరో మండల్ ప్రాజెక్టు సహా పలు నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 5న శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని 19.6 వేల హెక్టార్ల భూమికి సాగు నీరు అందించనున్నారు. కోయెల్ కరో ప్రాజెక్టును బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : కోయెల్ కరో మండల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జార్ఖండ్
Published date : 07 Jan 2019 04:03PM

Photo Stories