Daily Current Affairs in Telugu: జనవరి 9th, 2023 కరెంట్ అఫైర్స్
Veer Guardian: ఇండియా జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు
భారత్, జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు జనవరి 12 నుంచి 26 వరకు జపాన్లోని హైకురి ఎయిర్బేస్లో జరగనున్నాయి. ‘వీర్ గార్డియన్-2023’ పేరుతో రెండు దేశాల వైమానిక సేనలు ఈ సంయుక్త విన్యాసాలు చేయనున్నాయి. ఈ విన్యాసాలు ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మెరుగయ్యేందుకు దోహదం చేస్తాయని భారత రక్షణ శాఖ పేర్కొంది. భారతదేశం నుంచి నాలుగు ఎస్యూ-30ఎంకేఐ, రెండు సీ-17, ఒక ఐఎల్-78 యుద్ధవిమానాలు, జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి నాలుగు ఎఫ్-2, నాలుగు ఎఫ్-15 యుద్ధవిమానాలు పాల్గొననున్నాయి. కాగా 2022 ఫిబ్రవరి-మార్చిలో భారత్, జపాన్ తొలిసారిగా ‘ధర్మ గార్డియన్-2022’ పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)
BCCI Selection Committee: బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా మళ్లీ చేతన్ శర్మ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదుగురు సభ్యుల కొత్త సీనియర్ సెలక్షన్ కమిటీని ప్రకటించింది. చేతన్ శర్మ (నార్త్జోన్) చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో సలీల్ అంకోలా (వెస్ట్), సుబ్రతో బెనర్జీ (ఈస్ట్), శివ్ సుందర్ దాస్ (సెంట్రల్), ఎస్.శరత్ (సౌత్జోన్) సభ్యులుగా ఉంటారు. టి20 ప్రపంచకప్లో భారత జట్టు వైఫల్యం అనంతరం బోర్డు రద్దు చేసిన కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన చేతన్ శర్మనే మరోసారి చైర్మన్ అయ్యారు. అయితే పేరుకు కమిటీ రద్దయినా.. ఇదే బృందం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు, శ్రీలంకతో జరిగిన సిరీస్కు కూడా జట్లను ఎంపిక చేసింది.
రూ.1 కోటి వేతనం..
సెలక్టర్ పదవి కోసం సుమారు 600 దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణా నాయక్ సభ్యులుగా ఉన్న బోర్డు క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇందులో అన్ని అర్హతలు ఉన్న 11 మందిని పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Asia Cup 2023 : ఆసియా క్రికెట్ కప్ 2023-24 క్యాలెండర్ ఇదే.. ఒకే గ్రూపులో భారత్- పాక్.. కానీ
Chand Basha: సంగీత దర్శకుడు చాంద్ బాషా మృతి
నృత్యదర్శకురాలు సుచిత్ర తండ్రి, గేయ రచయిత చంద్రబోస్ మామ, సంగీత దర్శకుడు చాంద్ బాషా (92) జనవరి 6వ తేదీ హైదరాబాద్లో మృతి చెందారు. చాంద్ బాషా దక్షిణాదిలో పలు సినిమాలకు సంగీత దర్శకునిగా చేశారు. తెలుగులో ‘ఖడ్గ తిక్కన, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు’, కన్నడంలో ‘అమర భారతి, చేడిన కిడికి’ వంటి పలు చిత్రాలకు స్వరాలందించారు. చాంద్ బాషాకి ముగ్గురు అమ్మాయిలు, ఒక కొడుకు ఉన్నారు. వారిలో సుచిత్ర కొరియోగ్రాఫర్గా, డైరెక్టర్గా 2004లో ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమా తెరకెక్కించారు.
Senior Actor Kaikala Satyanarayana : ప్రముఖ సినీనటుడు సీనియర్ నటుడు కైకాల కన్నుమూత.. ఈయన జీవిత ప్రస్థానం ఇలా..
ROBO Lawyer: ప్రపంచంలో మొట్టమొదటి రోబో లాయర్
ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్ త్వరలో కోర్టు కేసును వాదించబోతోంది. ఈ రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ లీగల్ అసిస్టెంట్గా మారింది. ఈ AI రోబోట్ను డునాట్పే(DoNotPay) అనే కంపెనీ తయారు చేసిన ఈ రోబో వచ్చే ఫిబ్రవరిలో ఒకే కేసులో తన కక్షిదారుకు సహకరించనుంది. కోర్టులో వాదనలు జరిగినంతసేపూ సలహాలు సూచనలు అందించనుంది. స్మార్ట్ ఫోన్ సాయంతో వాదనలు వింటూ, ఏం చెప్పాలో, ఎలా స్పందించాలో తన కక్షిదారుకు ఎప్పటికప్పుడు ఇయర్ ఫోన్లో చెబుతుందట. అయితే కక్షిదారు పేరు, వాదనలు జరిగే కోర్టు తదితర వివరాలను సదరు కంపెనీ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతోంది. స్టాన్ఫర్డ్ వర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ జోషువా బ్రౌడర్ దీని వ్యవస్థాపకుడు. తన యాప్ ఆధారిత రోబో లాయర్లు మున్ముందు లాయర్ల వ్యవస్థ మొత్తాన్నీ భర్తీ చేయాలన్నది ఆయన ఆకాంక్ష.. అదెంత మేరకు నెరవేరుతుందో చూడాలి.
Eating Organism: వైరస్‌లను భోంచేస్తుంది.. వింత సూక్ష్మజీవి ఉనికిని గుర్తించిన సైంటిస్టులు
NASA Satellite: భూమ్మీద పడనున్న నాసా పాత ఉపగ్రహం
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన 38 ఏళ్ల నాటి పాత ఉపగ్రహం ఒకటి అంతరిక్షం నుంచి భూమ్మీద పడబోతోంది. అయితే దీనివల్ల వచ్చే ముప్పు అత్యంత తక్కువని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 2,450 కేజీలున్న ఈ ఉపగ్రహం సేవా కాలం ముగిసింది. దీనిని అంతరిక్షంలో మండిస్తారు. అయినప్పటికీ ఆ ఉపగ్రహం శిథిలాలు చిన్న చిన్నవి భూమిపై పడే అవకాశాలున్నాయి. 9,400 శిథిలాల ముక్కల్లో ఒక్క దాని ద్వారా మాత్రమే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 8 రాత్రి ది ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్ (ఈఆర్బీఎస్) భూమిపైకి పడనుంది. 1984లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం రెండేళ్లు సేవలు అందించింది. సూర్యుడి నుంచి రేడియో ధార్మిక శక్తిని భూమి ఎలా గ్రహిస్తుందన్న దానిపై ఈ ఉపగ్రహం సేవలు చేసింది. 2005 నుంచి దీని సేవలు నిలిచిపోయాయి.
ITTF World Rankings: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక బత్రా
US House Speaker: ప్రతినిధుల సభ స్పీకర్గా మెక్కార్తీ
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా రిపబ్లికన్ నేత కెవిన్ మెక్కార్తీ (57) ఎన్నికయ్యారు. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఆయనకు 216 ఓట్లు రాగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హకీం సెకూ జెఫ్రీస్కు 212 ఓట్లొచ్చాయి. అధికార డెమొక్రటిక్ పార్టీకి చెందిన 82 ఏళ్ల నాన్సీ పెలోసీ స్థానంలో ఆయన స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబర్ 2022లో జరిగిన మిడ్టర్మ్ ఎన్నికల్లో ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ 222 స్థానాలు గెలుచుకోగా డెమొక్రటిక్ పార్టీ 212 సీట్లకు పరిమితమై మెజారిటీ కోల్పోవడం తెలిసిందే.
ఐదో సుదీర్ఘ పోటీ
తాజా ఎన్నిక అమెరికా చరిత్రలో ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నికకు జరిగిన ఐదో సుదీర్ఘ పోటీగా నిలిచింది. 1855లో జరిగిన ఎన్నిక ఏకంగా రెండు నెలల పాటు ఏకంగా 133 రౌండ్లు కొనసాగి చరిత్ర సృష్టించింది! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Rishi Sunak: 2024లో రిషి గెలుపు కష్టమే!
భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో పాటు ఆయన కేబినెట్లోని 15 మంది మంత్రులు 2024 ఎన్నికల్లో గెలవడం కష్టమేనని ది ఇండిపెండెంట్ తాజా సర్వేలో తేలింది. రిషి, డిప్యూటీ పీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లేతో పాటు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని సీనియర్ సభ్యులకు ఓటమి గండముందని ఒక్కో సీటుకు వేర్వేరుగా చేపట్టిన ఫోకల్డేటా పోలింగ్లో వెల్లడైంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
రిషి కేబినెట్లో జెరెమీ హంట్, సుయెల్లా బ్రేవర్మన్, మైకేల్ గోవ్, నదీమ్ జహావీ, కేమీ బడెనోక్ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోమి స్మిత్ చెప్పారు. అయితే తమ సర్వేలో ఓటెవరికో చెప్పలేని వారు ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఫలితం వేరుగా ఉంటుందని తెలిపారు.
Free Foodgrains: 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు
Milky Way: విశ్వంలోకెల్లా అత్యంత పురాతన నక్షత్ర మండలం గుర్తింపు
అచ్చం మన పాలపుంత మాదిరిగా ఉండే నక్షత్ర మండలాలను నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. ఇవన్నీ విశ్వం ప్రస్తుత వయసులో కేవలం మూడో వంతు ఉన్నప్పుడు, అంటే దాదాపు 1,100 కోట్ల ఏళ్ల కింద ఏర్పడ్డాయట! ఈ క్రమంలో విశ్వంలోకెల్లా అత్యంత పురాతన నక్షత్ర మండలాన్ని కూడా జేమ్స్ వెబ్ గుర్తించింది. అది ఏకంగా 1,350 కోట్ల ఏళ్లనాటిదట. అప్పటికి విశ్వం ఆవిర్భవించి కేవలం 30 కోట్ల ఏళ్లేనట! ఈ నక్షత్ర మండలాల కేంద్ర స్థానం నుంచి ఇతర నక్షత్ర రాశుల దాకా విస్తరించి ఉన్న స్టెల్లర్ బార్స్‌ను కూడా వీటిలో గమనించడం విశేషం. ఈ బార్స్ మన పాలపుంతలోనూ ఉన్నాయి. అయితే విశ్వపు తొలి యుగాల నాటి నక్షత్ర మండలాల్లో ఇవి కనిపించడం ఇదే తొలిసారని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆ్రస్టానమీ ప్రొఫెసర్ శ్రద్ధా జోగీ అన్నారు.
ఈ నేపథ్యంలో నక్షత్ర మండలాల పుట్టుక, వికాసాలను గురించిన సిద్ధాంతాలను సరిచూసుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నక్షత్ర మండలాలను గతంలో హబుల్ టెలిస్కోప్ కూడా గుర్తించినా వాటిలో ఈ బార్స్ కనిపించలేదన్నారు. ‘‘ఇవి నక్షత్రాలతో పాటు అంతరిక్ష ధూళి, వాయువుల కదలికలను ప్రభావితం చేయడంతో పాటు తారల పుట్టుక ప్రక్రియను వేగవంతం చేయడంలోనూ సాయపడతాయి. అంతేగాక నక్షత్ర మండలాల కేంద్ర స్థానాల్లో అతి భారీ కృష్ణబిలాల పుట్టుకకూ దోహదం చేస్తుంటాయి. ఒకవిధంగా ఇవి నక్షత్ర మండలాల్లో సరఫరా వ్యవస్థ పాత్ర పోషిస్తుంటాయి. విశ్వపు తొలి యుగాల నాటి నక్షత్ర మండలాల్లోని స్టెల్లర్ బార్స్‌పై తొలిసారిగా పరిశోధన చేస్తున్నది మేమే. ఇది ఇప్పటిదాకా ఎవరూ చూడని కీకారణ్యంలోకి తొలిసారి అడుగు పెట్టడం వంటిదే’’ అంటూ శ్రద్ధా ముక్తాయించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)
Russia Ukraine War: రష్యా రాకెట్ దాడుల్లో.. 600 మంది సైనికులు మృతి!
తూర్పు ఉక్రెయిన్‌లో సైనికుల తాత్కాలిక నివాసాలపై తాము జరిపిన రాకెట్ దాడుల్లో 600 మంది మరణించారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా అధీనంలో ఉన్న డాన్‌టెస్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ దాడుల్లో 89 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకార చర్యగానే తాము క్రమటోర్క్‌స్‌పై ప్రాంతంలో సైనికుల ఇళ్లపై దాడులు చేసినట్టు పేర్కొంది. సైనికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందడంతో తాము రాకెట్ దాడులు చేశామని ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ఇంట్లో 700 మంది సైనికులు ఉంటే, మరొక ఇంట్లో 600 మంది ఉన్నారని తాము చేసిన రాకెట్ దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇదే నిజమైతే గత ఫిబ్రవరి 24న యుద్ధం మొదలు పెట్టినప్పట్నుంచి ఉక్రెయిన్‌కు భారీగా ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే.
Russia-Ukraine War: ఒక్క క్షిపణితో 400 మంది హతం!
Rythu Bandhu: రైతుబంధుకు రూ.426 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుకు సంబంధించి జనవరి 8వ తేదీ మరిన్ని నిధులను విడుదల చేసింది. 8.53 లక్షల ఎకరాలకు చెందిన 1.87 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.426.69 కోట్లను జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. దీంతో ఇప్పటివరకు 56.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,754.64 కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు.
Anahat Singh: బ్రిటిష్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత అనాహత్ సింగ్
ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో భారత అమ్మాయి అనాహత్ సింగ్ విజేతగా నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో జనవరి 8వ తేదీ జరిగిన ఫైనల్లో అనాహత్ 11–8, 8–11, 11–7, 11–5తో సొహైలా హజీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. 14 ఏళ్ల అనాహత్ బ్రిటిష్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి. 2019లో ఆమె అండర్–11 విభాగంలో టైటిల్ సాధించింది. గతంలో భారత్ నుంచి జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ మాత్రమే బ్రిటిష్ ఓపెన్ జూనియర్ టోర్నీలో విజేతలుగా నిలిచారు.
Abhijit Katake: ‘హింద్ కేసరి’ అభిజీత్
ప్రతిష్టాత్మక ‘హింద్ కేసరి’ జాతీయ సీనియర్ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ అభిజీత్ కాట్కే చాంపియన్‌గా నిలిచాడు. జనవరి 8న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన పురుషుల ‘హింద్ కేసరి’ టైటిల్ బౌట్ ఫైనల్లో అభిజీత్ 5–0తో హరియాణాకు చెందిన సోమ్‌వీర్‌పై విజయం సాధించాడు. విజేత అభిజీత్ తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా మూడు కిలోల వెండి గదను అందుకున్నాడు.
‘మహిళా హింద్ కేసరి’ విజేత పుష్ప
‘మహిళా హింద్ కేసరి’ టైటిల్ హరియాణాకు చెందిన పుష్ప సొంతం చేసుకుంది. ఫైనల్లో పుష్ప ఢిల్లీకి చెందిన మోహినిపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. పుష్ప, మోహిని మధ్య జరిగిన టైటిల్ బౌట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీక్షించారు.
మెరిసిన తెలంగాణ రెజ్లర్లు..
‘హింద్ కేసరి’ టైటిల్ బౌట్స్ కాకుండా మిగతా వెయిట్ కేటగిరీలలో తెలంగాణ రెజ్లర్లు ఆకట్టుకున్నారు. మహిళల 62 కేజీల విభాగంలో సాహిర్ ఇబ్రహీమ్.. 48 కేజీల విభాగంలో బాలమణి.. 56 కేజీల విభాగంలో శ్రావణి తెలంగాణకు కాంస్య పతకాలు అందించారు. పురుషుల 60 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్లు నితీశ్, సయ్యద్ అబ్దుల్.. 65 కేజీల విభాగంలో విజయ్ కుమార్.. 70 కేజీల విభాగంలో దినేశ్, విజయ్.. 75 కేజీల విభాగంలో హంజా బామస్, సయ్యద్ బిన్ అబ్దుల్లా.. 80 కేజీల విభాగంలో సందీప్ యాదవ్ కాంస్య పతకాలు సాధించారు.
Swachh Survekshan Awards: తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల పంట!
Novak Djokovic: 16 ఏళ్ల తర్వాత.. అడిలైడ్ ఓపెన్ విజేత జొకోవిచ్
జనవరి 8వ తేదీ ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 9 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (8/10), 7–6 (7/3), 6–4తో ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై శ్రమించి గెలిచాడు. జొకోవిచ్ కెరీర్‌లో ఇది 92వ సింగిల్స్ టైటిల్. కాగా 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడిలైడ్ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ విజేతగా నిలిచాడు. 2007లో 19 ఏళ్ల ప్రాయంలో జొకోవిచ్ తొలిసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు.
పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జొకోవిచ్, రాఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిల్స్‌తో సమఉజ్జీగా నిలిచారు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా/చెకోస్లొవేకియా; 94 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.