Skip to main content

Swachh Survekshan Awards: తెలంగాణ‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌ అవార్డుల పంట!

జాతీయస్థాయిలో తెలంగాణ సత్తా చాటింది. నాలుగు స్టార్‌ రేటింగుల్లో తెలంగాణ మొదటి మూడు స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ (ఎస్‌ఎస్‌జీ) అవార్డులు సాధించింది.

దీనికి సంబంధించి రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఈ అవార్డులు లభించాయి. వీటితోపాటు 3 స్టార్, 2 స్టార్‌ రేటింగ్స్‌లోనూ తెలంగాణ పల్లెలు టాప్ ర్యాంక్‌లలో నిలిచాయి. అచీవర్స్‌ 3 స్టార్‌ రేటింగ్‌లో సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో నిలువగా జగిత్యాల జిల్లా రెండోస్థానాన్ని, పెర్ఫార్మర్స్‌ 2 స్టార్‌ రేటింగ్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటిస్థానాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లోని స్వచ్ఛత అంశాలను పరిగణన లోకి తీసుకొని జిల్లాలకు ర్యాంకులను స్టార్‌ రేటింగ్‌లవారీగా విడుదల చేసింది.  

Telangana Farmers: దేశంలో తెలంగాణ‌ రైతుల స్థానం.. అప్పుల్లో 5, ఆదాయంలో 25

Published date : 06 Jan 2023 12:35PM

Photo Stories