BCCI Selection Committee: బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మళ్లీ చేతన్ శర్మ
చేతన్ శర్మ (నార్త్‌జోన్) చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సలీల్ అంకోలా (వెస్ట్), సుబ్రతో బెనర్జీ (ఈస్ట్), శివ్ సుందర్ దాస్ (సెంట్రల్), ఎస్.శరత్ (సౌత్‌జోన్) సభ్యులుగా ఉంటారు. టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం అనంతరం బోర్డు రద్దు చేసిన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన చేతన్ శర్మనే మరోసారి చైర్మన్ అయ్యారు. అయితే పేరుకు కమిటీ రద్దయినా.. ఇదే బృందం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు, శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు కూడా జట్లను ఎంపిక చేసింది.
రూ.1 కోటి వేతనం..
సెలక్టర్ పదవి కోసం సుమారు 600 దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణా నాయక్ సభ్యులుగా ఉన్న బోర్డు క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇందులో అన్ని అర్హతలు ఉన్న 11 మందిని షార్ట్ లిస్ట్ చేసి జనవరి 1 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించింది. చైర్మన్‌గా గరిష్టంగా ఏడాదికి రూ.1 కోటి వేతనం కావడంతో.. ఇంతకంటే ఎక్కువగా ఆర్జిస్తున్న పలువురు మాజీ అగ్రశ్రేణి క్రికెటర్లు సెలక్టర్ కావడానికి ఇష్టపడటం లేదు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)
సభ్యుల అనుభవాలు..
చేతన్ భారత్ తరఫున 23 టెస్టులు, 65 వన్డేలు ఆడి 128 వికెట్లు పడగొట్టగా, సలీల్ అంకోలా 1 టెస్టు, 20 వన్డేలు ఆడి 15 వికెట్లు తీశాడు. 23 టెస్టులు, 4 వన్డేలు ఆడి 1375 పరుగులు చేసిన శివ్ సుందర్ దాస్ నేపథ్యం ఒడిషానే అయినా కెరీర్ చివర్లో విదర్భకు ఆడటంతో సెంట్రల్‌జోన్‌నుంచి అతని పేరు ను పరిగణలోకి తీసుకున్నారు. సుబ్రతో బెనర్జీ 1 టెస్టు, 6 వన్డేలు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. ఎస్.శరత్ ఒక్కడే అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అయితే దేశవాళీలో 139 మ్యాచ్‌ల ఘనమైన అనుభవంతో పాటు ఇటీవలి వరకు జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పని చేయడం కూడా కలిసొచ్చింది.