జమ్మూకశ్మీర్ ఎల్‌జీగా మనోజ్ సిన్హా
Sakshi Education
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మనోజ్ సిన్హా (61)ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.వికాస్ పురుష్ గా పేరున్న మనోజ్ సిన్హా మూడుసార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు.
ఇప్పటివరకూ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామా చేయగా, ఆయన్ను నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2019 అక్టోబర్ 31న జమ్మూకశ్మీర్ ఎల్జీగా జీసీ ముర్ము బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : మనోజ్ సిన్హా
Published date : 09 Aug 2020 12:25PM