Skip to main content

ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ రాజీనామా

ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మహ్తి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు నవంబర్ 29న ప్రకటించారు.
Current Affairsతన రాజీనామాను పార్లమెంటుకు సమర్పిస్తానని, దాంతో పార్లమెంటు ఇతర అవకాశాలను పరిశీలించుకుంటుందని చెప్పారు. ఇరాక్ ప్రధానికి మద్దతు ఉపసంహరించుకోవాలంటూ చట్టసభ సభ్యులకు అత్యున్నత షియా మతగురువు పిలుపునివ్వటంతో రెండు నెలలుగా అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లలో 400 మంది మృతి చెందగా, 15 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని అదెల్ రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇరాక్ ప్రధాని పదవికి రాజీనామా
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అదెల్ అబ్దుల్ మహ్తి
ఎందుకు : ఇరాన్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో
Published date : 30 Nov 2019 05:42PM

Photo Stories