Skip to main content

ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న హాకీ జట్టు?

టోక్యో ఒలింపిక్స్‌–2020లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
మూడో స్థానం కోసం ఆగస్టు 5న జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5–4 గోల్స్‌ తేడాతో జర్మనీని ఓడించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించిన ఇన్నేళ్లకు మళ్లీ భారత్‌ ఖాతాలో మరో హాకీ పతకం చేరింది. భారత జట్టుకు మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యం వహించాడు. మన్‌ప్రీత్‌ బృందానికి గ్రాహం రీడ్‌ చీఫ్‌ కోచ్‌గా శిక్షణ ఇచ్చాడు.

భారత పురుషుల హాకీ జట్టు: పీఆర్‌ శ్రీజేష్, హర్మన్‌ప్రీత్‌ సింగ్, రూపిందర్‌ పాల్‌ సింగ్, సురేందర్, అమిత్‌ రోహిదాస్, బీరేంద్ర లక్రా, హార్దిక్‌ సింగ్, మన్‌ప్రీత్‌ సింగ్, వివేక్‌ సాగర్, నీలకంఠ శర్మ, సుమిత్, షంషేర్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్, లలిత్‌ ఉపాధ్యాయ్, మన్‌దీప్‌ సింగ్‌.

పంజాబ్, మధ్యప్రదేశ్‌ ఆటగాళ్లకు రూ. కోటీ చొప్పున నజరానా
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన భారత హాకీ జట్టులోని తమ రాష్ట్ర ప్లేయర్లకు మధ్యప్రదేశ్, పంజాబ్‌ ప్రభుత్వాలు భారీ నజరానాను ప్రకటించాయి. రూ. కోటి చొప్పున వారికి అందజేయనున్నట్లు ఇరు రాష్ట్రాలు తెలిపాయి. టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత హాకీ జట్టులో మధ్యప్రదేశ్‌ నుంచి ఇద్దరు ఆటగాళ్లు (వివేక్‌ సాగర్, నీలకంఠ శర్మ)... పంజాబ్‌ నుంచి ఎనిమిది మంది ప్లేయర్లు (కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్, హర్మన్‌ప్రీత్‌ సింగ్, రూపిందర్‌పాల్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, షంషేర్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్‌) ఉన్నారు.

ఒలింపిక్స్‌ హాకీ పోటీల్లో భారత్‌
1928 – స్వర్ణం
1932 – స్వర్ణం
1936 – స్వర్ణం
1948 – స్వర్ణం
1952 – స్వర్ణం
1956 – స్వర్ణం
1960 – రజతం
1964 – స్వర్ణం
1968 – కాంస్యం
1972 – కాంస్యం
1980 – స్వర్ణం
2020 – కాంస్యం

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పురుషుల హాకీ జట్టు?
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : భారత పురుషుల హాకీ జట్టు
ఎక్కడ : టోక్యో, జపాన్‌
ఎందుకు : మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్‌ 5–4 గోల్స్‌ తేడాతో జర్మనీని ఓడించినందున...
Published date : 08 Sep 2021 06:58PM

Photo Stories