Skip to main content

Ethiopia delegates visits AP : ఈ–క్రాప్‌ కోసం ఇథియోపియాకు ఏపీ స‌హాయం

ఆంధ్రప్రదేశ్‌లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను గుర్తించే ఎలక్ట్రానిక్‌ క్రాపింగ్‌ (ఈ–క్రాప్‌) అద్భుతంగా ఉందని, ఈ సాంకేతికతను ఇథియోపియా దేశంలో అమలు చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఇథియోపియా ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
 Ethiopia delegates visits AP for e crop
Ethiopia delegates visits AP for e crop

రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడో రోజు ఇథియోపియా ప్రతినిధి బృందం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ ఉన్నతాధికారులతో భేటీ అయింది.

 Daily Current Affairs In Telugu: 23 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

ఈ–పంట నమోదుతోపాటు యంత్రసేవా పథకం, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ రైతు భరోసా వంటి పథకాలను తమ రైతులకు అందించాలని ఇథియోపియా ప్రతినిధుల‌ బృందం విఙ్ఞ‌ప్తి చేసింది. వీటి అమలు కోసం అవసరమైన సాంకేతికతను అందించేందుకు చేయూతనివ్వాలని వ్యవసాయ ఉన్నతాధికారులను కోరారు. ఇథియోపియా దేశానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ వెల్లడించారు.

 Daily Current Affairs Short: 22 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్ ఇవే..
ఎరువులు, పురుగు మందులు, విత్తనాలపై ఆరా:
ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయాలను ఇథియోపియా ప్రతినిధి బృందం  వ్యవసాయ ఉన్నతాధికారులను ఆరా తీసింది. కాగా, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఇథియోపియా ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ–క్రాప్‌ నమోదు, ఉచిత పంటల బీమా, ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఇన్‌పుట్స్‌ పంపిణీ, ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు (కస్టమ్‌హైరింగ్‌ సెంటర్స్‌), డ్రోన్‌ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్, వైఎస్సార్‌ అప్లికేషన్‌ సాంకేతికతను, పొలం బడుల ద్వారా గ్యాప్‌ సర్టిఫికేషన్‌ జారీ అంశాలను వివరించారు. 

☛ Daily Current Affairs in short : 21 జూన్‌ 2023 కరెంట్‌ అఫైర్స్‌ ఇవే

Published date : 23 Jun 2023 04:57PM

Photo Stories