Skip to main content

ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్‌కుమార్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్‌కుమార్ నియమితులయ్యారు.
ఈ మేరకు అక్టోబర్ అక్టోబర్ 30న కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019, నవంబర్ 13వ తేదీలోపు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాలని పేర్కొంది. ఏపీ హైకోర్టులో జస్టిస్ రాకేష్‌కుమార్ రెండోస్థానంలో కొనసాగుతారు.

ఇదీ నేపథ్యం..
జస్టిస్ రాకేష్‌కుమార్ 1959 జనవరి 1న బిహార్ పాట్నాలో జన్మించారు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, 1983లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 6 ఏళ్ల పాటు ప్రాక్టీస్ సాగించిన ఆయన 12 ఏళ్ల పాటు సీబీఐకి స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా పనిచేశారు. 2009 డిసెంబర్ 25న పాట్నా హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులై 2011, అక్టోబర్ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : జస్టిస్ రాకేష్‌కుమార్
Published date : 31 Oct 2019 05:29PM

Photo Stories