ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి?
Sakshi Education
జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా జూన్ 2న బాధ్యతలు స్వీకరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గేలతో కూడిన కమిటీ ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ పదవికి జస్టిస్ అరుణ్ మిశ్రా పేరును సిఫార్సు చేసిన విషయం విదితమే. జస్టిస్ మిశ్రా 2020, సెప్టెంబరులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.1978లో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించిన జస్టిస్ అరుణ్ మిశ్రా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (1998–99)కు అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా పనిచేశారు. రాజస్థాన్, కలకత్తా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసిన ఆయన జులై 7, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి?
ఎప్పుడు :జూన్ 2
ఎవరు :సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి?
ఎప్పుడు :జూన్ 2
ఎవరు :సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా
Published date : 04 Jun 2021 02:37PM