Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 8th కరెంట్ అఫైర్స్
Supreme Court: ‘నోట్ల రద్దు’పై రికార్డులు సమర్పించండి
పెద్ద నోట్లను రద్దు చేస్తూ(డిమానిటైజేషన్) 2016లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 58 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎస్‌ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కొంతకాలంగా విచారణ కొనసాగిస్తోంది. ఆర్‌బీఐ తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్లు పి.చిదంబరం, శ్యామ్ దివాన్ డిసెంబర్ 7న వాదనలు వినిపించారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి లిఖితపూర్వకంగా వాదనలు తెలియజేయాలని ధర్మాసనం సూచించింది. తీర్పును రిజర్వు చేసింది.
Supreme Court: సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభం
ఆండ్రాయిడ్ వెర్షన్ 2.0 మొబైల్ అప్లికేషన్‌ను సుప్రీంకోర్టు డిసెంబర్ 7న ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా కోర్టు కార్యకలాపాలను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కేంద్ర శాఖల నోడల్ అధికారులు రియల్ టైమ్‌లో వీక్షించవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. ఐఓఎస్ వెర్షన్ మరో వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. యాప్‌లో లాగిన్ కావడం ద్వారా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు. కేసులు, ఉత్తర్వులు, తీర్పులు, పెండింగ్ కేసుల స్థితిగతులను తెలుసుకొనేందుకు వీలవుతుందని చెప్పారు.
Nirmala Sitharaman: ‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్
అమెరికా బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల’ వార్షిక జాబితాలో ఆరుగురు భారతీయులకు స్థానం దక్కింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(36), బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా(ర్యాంకు 72), నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్(ర్యాంకు 89), హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా (ర్యాంకు 53), సెబీ చైర్‌పర్సన్ మాధవీ పూరి (ర్యాంకు 54), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సోమా మోండాల్ (ర్యాంకు 67) ఈ జాబితాలో చోటు సాధించారు.
Sundar Pichai: సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్ పురస్కారం ప్రదానం
Volodymyr Zelensky: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్‌స్కీ
‘పర్సన్ ఆఫ్ ది ఇయర్-2022’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelensky)ని ఎంపికచేస్తూ ఆయన ముఖచిత్రంతో టైమ్ మేగజీన్ తాజా సంచిక ప్రచురించింది. ‘ఉక్రెయిన్ సహా విదేశాల్లో చాలా మంది వొలొదిమిర్ జెలెన్‌స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారు. 2022లో ఏడాదిగా ప్రజాస్వామ్యం, ధిక్కారానికి ఓ చిహ్నంగా నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే రష్యా దాడులను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.’ అని పేర్కొంది. ప్రతీ సంవత్సరం వార్తల్లో నిలిచిన ఓ వ్యక్తిని టైమ్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఈయర్ గా ప్రకటించి, పత్రికలో ఆ వ్యక్తిపై ప్రత్యేక కథనాలను ప్రచురిస్తుంది.
22nd law commission of india: లా కమిషన్ చైర్‌పర్సన్ గా జస్టిస్ రితురాజ్ అవస్థి
World Championships 2022: ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మెరిసిన మీరాబాయి చాను
భారత స్టార్ మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సొంతం చేసుకుంది. డిసెంబర్ 7న బొగోటా (కొలంబియా)లో జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెండో స్థానంలో నిలిచింది. 28 ఏళ్ల మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కేజీలు కలిపి మొత్తం 200 కేజీలు బరువెత్తింది. జియాంగ్ హుయ్‌హువా (చైనా; 206 కేజీలు) స్వర్ణం సాధించగా... జిహువా (చైనా; 198 కేజీలు) కాంస్యం దక్కించుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మీరాబాయికిది రెండో పతకం. 2017లో ఆమె 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది.
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన నాలుగో భారత మహిళా లిఫ్టర్‌గా మీరాబాయి గుర్తింపు పొందింది. గతంలో కుంజరాణి దేవి (7 రజత పతకాలు), కరణం మల్లీశ్వరి (2 స్వర్ణాలు, 2 కాంస్యాలు), నీలంశెట్టి లక్ష్మీ (1 రజతం, 1 కాంస్యం) ఈ ఘనత సాధించారు.
World Boxing Championships: బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 11 పతకాలు
ONGC Chief: ఓఎన్‌జీసీ చైర్మన్‌గా అరుణ్ కుమార్ సింగ్
ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ చైర్మన్‌గా అరుణ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఆయన గతంలో చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ సంస్థ బీపీసీఎల్ చైర్మన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. రిటైరైన వ్యక్తిని మహారత్న హోదా గల ప్రభుత్వ రంగ సంస్థకు హెడ్‌గా నియమించడం ఇదే తొలిసారి. సింగ్ మూడేళ్ల పాటు ఓఎన్‌జీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
Election Commissioner: ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్
RBI: నెలవారీ చెల్లింపులపై మరింత భారం.. రెపో రేటు పెంపు
వరుసగా ఐదో విడత ఆర్‌బీఐ కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 0.35 శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ఇది విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉంది. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు ఈ మేరకు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే గృహ రుణాలపై ఈఎంఐలు 23 శాతం వరకు పెరిగినట్టయింది. ఈ భారం ఎలా ఉంటుందంటే 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్న వారిపై ఈఎంఐ 17 శాతం, 30 ఏళ్ల కాలానికి తీసుకున్న వారిపై 23 శాతం మేర (8 నెలల్లో) ఈఎంఐ పెరిగినట్టయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందన్న గత అంచనాను ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 6.8 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఎంపీసీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. వృద్ధిని దృష్టిలో పెట్టుకుని తమ చర్యలు వేగంగా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చారు.
India GDP Growth:2022–23లో వృద్ధి 7 శాతమే!
వృద్ధి అంచనాలకు కోత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని తాజాగా ఆర్‌బీఐ అంచనా వేసింది. గత అంచనా 7 శాతంతో పోలిస్తే కొంత తగ్గించింది. అంతేకాదు ఇలా వృద్ధి అంచనాలను తగ్గించడం ఇది మూడోసారి. పలు అంతర్జాతీయ ఏజెన్సీలు, రేటింగ్ సంస్థలు సైతం భారత్ వృద్ధి అంచనాలను దిగువకు సవరించడం తెలిసిందే. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మాంద్యం, కఠినంగా మారుతున్న ద్రవ్య పరిస్థితులను వృద్ధికి ప్రతికూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపైనా వీటి రిస్క్ ఉంటుందన్నారు. అయినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును చూపిస్తోందంటూ, ప్రపంచంలో భారత్ చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మరోసారి గుర్తు చేశారు. డిసెంబర్‌తో (క్యూ3) ముగిసే త్రైమాసికంలో 4.4 శాతం, 2023 జనవరి–మార్చి (క్యూ4)లో 4.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 7.1 శాతం, క్యూ2లో 5.9 శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. రబీ సాగు బాగుండడం, అర్బన్ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగడం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ మెరుగుపడడం, తయారీ, సేవల రంగాల్లో పునరుద్ధానం సానుకూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు.
Part Time Jobs: చదువుతోపాటు సంపాదన!
పాలసీలోని ఇతర అంశాలు
☛ ఆరుగురు సభ్యుల ఎంపీసీలో 0.35 శాతం రేటు పెంపునకు ఐదుగురు ఆమోదం తెలిపారు.
☛ సర్దుబాటు విధాన ఉపసంహరణను ఆర్‌బీఐ కొనసాగిస్తున్నట్టు తెలిపింది.
☛ఆర్‌బీఐ రెండేళ్ల విరామం తర్వాత రేట్లను ఈ ఏడాది మే నెలలో తొలిసారి సవరించింది. మేలో 0.40 శాతం పెంచగా, జూన్ సమీక్షలో అర శాతం, ఆగస్ట్‌లో అర శాతం, సెప్టెంబర్ సమీక్షలోనూ అర శాతం చొప్పున పెంచుతూ వచి్చంది.
☛ యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ‘సింగిల్ బ్లాక్, మల్టీ డెబిట్స్’ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీంతో ఈ కామర్స్, సెక్యూరిటీల్లో పెట్టుబడుల చెల్లింపులు సులభతరం అవు తాయని పేర్కొంది. అంటే కస్టమర్ ఒక ఆర్డర్‌కు సంబంధించిన మొత్తాన్ని తన ఖాతాలో బ్లాక్ చేసుకుని, డెలివరీ తర్వాత చెల్లింపులు చేయడం.
☛ భారత నియంత్రణ సంస్థల విశ్వసనీయతను అభివృద్ధి చెందిన దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు.
ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుంది..
మార్చి త్రైమాసికంలో నిర్దేశిత 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగొస్తుంది. ద్రవ్యోల్బణానికి సంబంధించి గడ్డు పరిస్థితులు ఇక ముగిసినట్టే అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రేటు పెంపు తక్కువగా ఉండడం అన్నది ధరలపై పోరాటం విషయంలో మేము సంతృప్తి చెందినట్టు కాదు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుంది. ఇక ఆర్‌బీఐ ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లావాదేవీలను రిటైల్, హోల్‌సేల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నాయన్నారు.