FIBAC 2022: ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకున్నాం : RBI గవర్నర్ శక్తికాంతదాస్
ద్రవ్యోల్బణం విషయంలో విరుద్ధమైన అంశాలను కూడా చూడాల్సి ఉంటుందని, ముందస్తుగానే రేట్లను కట్టడి చేయడం వృద్ధికి విఘాతాన్ని కలిగిస్తుందన్న వాస్తవాన్ని గుర్తించాలని దాస్ సూచించారు. ‘‘అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ, దేశ పౌరులకు భారంగా మారి ఉండేది. భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది’’అని దాస్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను సురక్షిత స్థానానికి చేర్చాల్సి ఉందంటూ, అటువంటి తరుణంలో కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు అవరోధం కలిగించరాదన్నారు. ‘‘కరోనా సమయంలో ద్రవ్యోల్బణం నిర్ధేశిత లక్ష్యం 2–6 శాతం పరిధిలో కొంచెం పెరిగినా పర్వాలేదనే విధంగా ఆర్‌బీఐ సులభతర మానిటరీ పాలసీ చర్యలను అనుసరించింది. ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఇలా చేసింది. దీంతో 2021–22, 2022–23లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంది’’అని వివరించారు.
Also read: Indian Exim Bank : ఆఫ్రికాకు ఆశాకిరణం భారత్
ప్రభుత్వానికి నివేదిక
ఆర్‌బీఐ ఎంపీసీ గురువారం (ఈ నెల 3న) నాటి సమావేశం ఎజెండాను శక్తికాంతదాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంలో ఎందుకు విఫలమైందనే, కారణాలపై చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. వరుసగా తొమ్మిది నెలల పాటు ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే కొనసాగడానికి దారితీసిన కారణాలను వివరించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగ రుణాల ప్రయోగాత్మక డిజిటైజేషన్‌పై దాస్ స్పందిస్తూ.. చిన్న వ్యాపార రుణాలకు సైతం 2023 నుంచి ఇదే విధానాన్ని అనుసరించాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
Also read: 2022 డిసెంబర్ లో IHW - 22 సదస్సు