Sundar Pichai: సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్ పురస్కారం ప్రదానం
ఈ సందర్భంగా పిచాయ్ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. ‘‘అత్యంత గౌరవప్రద పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇందుకు భారత ప్రభుత్వానికి, భారతీయులకు సదా రుణపడి ఉంటా. నన్నింతవాడిని చేసిన దేశమే మళ్లీ నన్నిలా గౌరవించింది. తద్వారా నా కృషికి సంపూర్ణతను తెచ్చింది. భారతదేశం ఎల్లప్పుడూ నాలోనే ఉంటుంది. నా మాతృదేశం నాలో అంతర్భాగం. భారతీయతను శాశ్వతంగా కొనసాగిస్తా. ఇంతటి అమూల్యమైన అవార్డును బయటెక్కడా దాచుకోను. ఎక్కడికెళ్లినా ఎప్పుడూ నాతోనే తీసుకెళ్తా. నా తల్లిదండ్రులు నన్ను ఉన్నతమైన విలువలను రంగరించి పెంచారు. నా ఇష్టాయిష్టాలను పట్టించుకున్నారు. జ్ఞానసముపార్జనకు అవకాశమున్న కుటుంబంలో పెరగడం నా అదృష్టం’’ అని చెప్పారు. ‘‘ప్రధాని మోదీ అభిలబించిన 3ఎస్ (స్పీడ్, సింప్లిసిటీ, సర్వీస్– వేగం, నిరాడంబరత, సేవలు) అందేలా భారత్‌లో ఆవిష్కృతమవుతోన్న డిజిటల్ పరివర్తనను మరింత పరుగులు పెట్టించేందుకు పిచాయ్ కృషిచేయాలని ఇండియా కౌన్సిల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ అభిలషించారు.