Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 16th కరెంట్ అఫైర్స్
Agni-5 Missile: అగ్ని5 క్షిపణి పరీక్ష సక్సెస్
అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని–5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ డిసెంబర్ 15న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. అగ్ని–2 క్షిపణి సామర్థ్యం 2 వేల కిలోమీటర్లు కాగా తాజాగా అభివృద్ధి పరిచిన అగ్ని–5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో చేపట్టిన ఈ ప్రయోగం.. దేశ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని చాటుతుందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. జూన్‌లో రాత్రివేళ చేపట్టిన అగ్ని–4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.
Vikram S Rocket: భారత అంతరిక్షయాన రంగంలో చారిత్రక ఘట్టం తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం సక్సెస్
Indian Air Force: ఈశాన్యంలో వైమానిక విన్యాసాలు
ఈశాన్య ప్రాంతంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విన్యాసాలు డిసెంబర్ 15న ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ జెట్లతో సహా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలోఉన్న సుఖోయ్–30 యుద్ధవిమానం, ఇతర అత్యాధునిక యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవాదీన రేఖ వద్ద చైనా సైనికుల చొరబాటు యత్నం నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఇవి జరుగుతున్నాయని, సైనికుల ఘర్షణతో వీటికి సంబంధం లేదని భారత వైమానిక దళం స్పష్టం చేసింది. ఈ విన్యాసాలు రెండు రోజుల పాటు జరిగాయి. 36 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరుకున్నాయని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.
Same Sex Marriage: అమెరికాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం
Supreme Court: లంచగొండి అధికారులకు శిక్షలు పడాల్సిందే.. సుప్రీంకోర్టు
అవినీతిమయ, లంచగొండి ప్రభుత్వ అధికారులను చట్టం ముందు బోనులో నిలబెట్టేందుకు మరింత కృషి జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. లంచగొండి అధికారికి వ్యతిరేకంగా నేరుగా సాక్ష్యాలు లేని సందర్భాల్లో ఇతరత్రా సాక్ష్యాధారాలతో శిక్ష ఎలా ఖరారుచేయాలనే వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పై విధంగా స్పందించింది. లంచం తీసుకున్న కేసులో అవినీతి ప్రభుత్వ అధికారి అక్రమంగా లబ్ధి పొందాడనే బలమైన సాక్ష్యాలు, డాక్యుమెంట్లు లేకున్నా ఆ నేరంలో అతడికి ప్రమేయముందని తెలిపే నమ్మదగ్గ సాక్ష్యాలుంటే సరిపోతుందని, అతనిని దోషిగా నిర్ధారిస్తామని జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బీఎస్ నాగరత్నల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Servers Hacked: ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ చైనా ముఠాల పనే!
అవినీతి అధికారులకు శిక్ష పడేలా చేసేందుకు ఫిర్యాదుదారులు, ప్రభుత్వ లాయర్లు అంకితభావంతో కృషిచేయాలని కోర్టు సూచించింది. ‘ప్రాథమిక, బలమైన సాక్ష్యాలు, ఆధారాల లేని పక్షంలో, ఫిర్యాదుదారులు, బాధితుడు మరణించినా లేదా భయంతో ఫిర్యాదుదారు విచారణ సమయంలో సాక్ష్యం చెప్పలేకపోయినా నిందితుడికి లినేరంలో ప్రమేయముందని తెపే మౌఖిక, నమ్మదగ్గ ఇతరత్రా సాక్ష్యాలు ఉన్న సరిపోతుంది. ఆ అధికారిని దోషిగా తేలుస్తాం. కేసు విచారణలో ప్రభుత్వ అధికారిని శిక్షించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఆ అధికారి లంచం అడగడానికి, లబ్ధి పొందడానికి పూర్తి అవకాశం ఉందనేది మొదట నిరూపించగలిగితే చాలు’ అని కోర్టు పేర్కొంది.
Bapu Award: కార్టూనిస్ట్ శంకర్‌కు బాపూ పురస్కారం
హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో బాపూరమణ అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న బాపూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌కు బాపూ పురస్కారం, రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మికి రమణ పురస్కారాలను ప్రదానం చేశారు. అదేవిధంగా ముళ్లపూడి వెంకటరమణ రచించిన కథా పుస్తకాలు, కార్టూనిస్ట్ రామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన కార్టూన్ల సంకలనాలను ఆవిష్కరించారు. బాపూ చిత్రాలు అపురూపమైనవని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు.
Eco Oscar: తెలంగాణ స్టార్టప్‌కు ఎకో ఆస్కార్
New Zealand: టెస్టు కెప్టెన్సీకి విలియమ్సన్ గుడ్‌బై
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు టెస్టు ఫార్మాట్‌లో సారథ్య బాధ్యతల నుంచి కేన్ విలియమ్సన్ తప్పుకున్నాడు. రానున్న రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో వన్డే, టి20 కెప్టెన్‌గా మాత్రం అతను కొనసాగుతాడు. పని ఒత్తిడి కారణంగానే టెస్టు కెప్టెన్సీని వదులుకున్నట్లు విలియమ్సన్ తెలిపాడు. 2016లో బ్రెండన్ మెకల్లమ్ రిటైర్మెంట్ తర్వాత నాయకుడిగా ఎంపికైన కేన్.. 40 టెస్టుల్లో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో జట్టు 22 మ్యాచ్‌లు గెలిచి, 10 ఓడింది. మరో 8 ‘డ్రా’గా ముగిశాయి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరడంతో పాటు తొలి టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ను విజేతగా నిలపడం విలియమ్సన్ కెప్టెన్సీలో అత్యుత్తమ క్షణం. డిసెంబర్ 26 నుంచి పాకిస్తాన్‌తో కరాచీలో జరిగే తొలి టెస్టు నుంచి సౌతీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. కెరీర్‌లో 88 టెస్టులు ఆడి 347 వికెట్లు పడగొట్టిన సౌతీ.. 1,855 పరుగులు చేశాడు. అతను ఇప్పటికే 22 టి20లు, ఒక వన్డే మ్యాచ్‌లో కివీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ICC ODI Rankings: డబుల్ సెంచరీతో 117 స్థానాలు ఎగబాకిన ఇషాన్ కిషన్..!
ICC Ranking: ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మృతికి మూడో స్థానం
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 741 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాతో రెండో టీ20లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకుంది స్మృతి. ఆ మ్యాచ్ ద్వారా లభించిన 11 రేటింగ్ పాయింట్లతో ఈ మైలురాయిని చేరుకుంది. ఆసీస్ బ్యాటర్లు తహ్లియా మెక్‌గ్రాత్ (827 పాయింట్లు), బెత్ మూనీ (773 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తిశర్మ (732) మూడు, రేణుక సింగ్ (712) నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.
Bhupendra Patel: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం
Vijay Diwas: ఘనంగా విజయ్ దివస్ వేడుకలు
ఢిల్లీలోని ఆర్మీ హౌస్‌లో 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారతదేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ విజయ్ దివస్ పేరుతో డిసెంబర్16న విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యవేక్షణలో జరిగాయి. ఎట్ హోమ్‌పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సైనికాధికారులు పాల్గొన్నారు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత దేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివస్ పేరుతో వేడుకలు జరుపుకుంటాం. దీంతో పాటు 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటాం. అలాగే విశాఖ సాగర తీరంలో తూర్పు నౌకాదళం ఘనంగా విజయ్ దివస్‌ను నిర్వహించింది.
Nuclear Fusion Energy: అనంత శక్తిని ఒడిసిపట్టే.. దారి దొరికింది!