Skip to main content

డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తున్నాం: ట్రంప్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా అందిస్తున్న నిధులు నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు.
Current Affairs
కరోనా వైరస్‌(కోవిడ్‌-19 )సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 15న వెల్లడించారు. ‘‘కరోనా విషయంలో చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌ఓ వ్యవహరించిన తీరు సరైంది కాదు. అమెరికా పన్ను చెల్లింపుదారులు ఏడాదికి 400 నుంచి 500 మిలియన్‌ డాలర్లు డబ్ల్యూహెచ్‌ఓకు సమకూరుస్తున్నారు. చైనా కేవలం 40 మిలియన్‌ డాలర్లు లేదా అంతకన్నా తక్కువే అందిస్తోంది. భారీ మొత్తంలో నిధులు సమకూరుస్తున్న అమెరికాకు.. సంస్థను జవాబుదారీగా ఉండాలని పట్టుబట్టడం అనేది తన కర్తవ్యంలో భాగమే’’అని ట్రంప్‌ పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తున్నాం
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌
ఎందుకు : కరోనా వైరస్‌(కోవిడ్‌-19 )సంక్షోభం గురించి అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైంద‌ని
Published date : 15 Apr 2020 06:57PM

Photo Stories