Skip to main content

భారతీయ రైల్వేతో అమెజాన్ ఒప్పందం

భారతీయ రైల్వేతో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా భాగస్వామ్య ఒప్పందం కుదర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం తమ కస్టమర్లకు ప్యాకేజీలను అందించడం కోసం రైల్వే సేవలను అమెజాన్ వినియోగించుకోనుంది. ఈ ఒప్పంద విషయాన్ని అమెజాన్ ఇండియా డెరైక్టర్ (మిడిల్ మైల్ ట్రాన్స్ పోర్టేషన్) అభినవ్ సింగ్ అక్టోబర్ 22న వెల్లడించారు. ఈ విధంగా ఒక ఈ-కామర్స్ సంస్థ రైల్వే సేవలను అందిపుచ్చుకోవడం దేశంలోనే తొలిసారని అభినవ్ చెప్పారు. తొలుత న్యూఢిల్లీ నుండి ముంబై, ముంబై నుండి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుండి కోల్‌కతాకు ఈసేవలు ఉండనున్నట్లు పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారతీయ రైల్వేతో భాగస్వామ్య ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : అమెజాన్ ఇండియా
ఎందుకు : కస్టమర్లకు ప్యాకేజీలను అందించడం కోసం రైల్వే సేవలను వినియోగించుకోవడానికి
Published date : 24 Oct 2019 05:34PM

Photo Stories