Skip to main content

భారత 68వ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డులకెక్కిన ఆటగాడు?

భారత 68వ గ్రాండ్‌మాస్టర్‌(జీఎం)గా తమిళనాడుకి చెందిన యువ చెస్‌ ఆటగాడు అర్జున్‌ కల్యాణ్‌ రికార్డులకు ఎక్కాడు.
Current Affairs జీఎంగా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అర్జున్‌ ఏప్రిల్‌ 21న అధిగమించాడు. దీంతో గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించిన 68వ భారతీయుడిగా అర్జున్‌ గుర్తింపు పొందాడు. సెర్బియాలో జరుగుతున్న రుజ్నా జోరా–3 జీఎం రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ అయిదో రౌండ్లో డ్రాగన్‌ కోసిక్‌పై పైచేయి సాధించడంతో అర్జున్‌కు విలువైన రేటింగ్‌ పాయింట్లు లభించాయి.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : భారత 68వ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డులకెక్కిన ఆటగాడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : అర్జున్‌ కల్యాణ్‌
ఎందుకు : జీఎంగా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను సాధించినందున...
Published date : 22 Apr 2021 07:48PM

Photo Stories