Daily Current Affairs in Telugu: ఏప్రిల్ 13, 2023 కరెంట్ అఫైర్స్
Google: చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు గూగుల్‌కు రూ.260 కోట్లు ఫైన్
టెక్ దిగ్గజం గూగుల్‌కు దక్షిణ కొరియాకు చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ రూ.260 కోట్ల భారీ జరిమానా విధించింది. కొరియన్ మొబైల్ గేమింగ్ యాప్ (Gaming APP) మార్కెట్‌లో ఆధిపత్యం కోసం గూగుల్, దాని ప్రాంతీయ అనుబంధ సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన నియంత్రణ సంస్థ 42.1 బిలియన్ల వాన్‌లు అంటే భారతీయ కరెన్సీలో రూ.260 కోట్లకు పైగా జరిమానా విధించింది. ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (FTC) ప్రకారం.. గూగుల్ జూన్ 2016 నుంచి ఏప్రిల్ 2018 మధ్య కాలంలో దక్షిణ కొరియా మొబైల్ గేమ్ కంపెనీలతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ మేరకు వన్ స్టోర్‌లో వారి కంటెంట్‌ను విడుదల చేయకుండా అడ్డుకుంది.
Income Tax: ఆకర్షణీయంగా కొత్త ఆదాయపన్ను విధానం.. ఇకపై జీవిత బీమా పాలసీలపైనా పన్ను..!
వన్ స్టోర్ అనేది నేవర్ కార్ప్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన మరో రెండు మొబైల్ క్యారియర్లు 2016 జనవరిలో ప్రారంభించిన ఆ దేశ ప్రధాన స్వదేశీ యాప్ మార్కెట్. ఈ వన్ స్టోర్ ఏర్పాటు దక్షిణ కొరియాలో తమ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని భావించిన గూగుల్ యూఎస్ బెహెమోత్ గేమ్ కంపెనీలను తమ గూగుల్ ప్లే (Google Play)లో ప్రత్యేకంగా విడుదల చేసేలా ఒప్పందం చేసుకుంది. పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి
Indian students: వైద్య విద్యార్థులకు శుభవార్త.. కీలక పరీక్ష ఆన్‌లైన్‌లో రాసేందుకు ఉక్రెయిన్ అనుమతి
ఉక్రెయిన్-రష్యా యుద్దంతో స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు ఉక్రెయిన్ దేశం శుభవార్త చెప్పింది. ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భారతదేశం నుంచే కీలక పరీక్ష రాసుకునేందుకు అనుమతివ్వనున్నట్లు మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆ దేశ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా హామీ ఇచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
2022 ఫిబ్రవరిలో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 19 వేల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లిన 2 వేల మంది విద్యార్థులు యుద్ధ ప్రభావం అంతగా లేని పశ్చిమ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మిగతా వారందరూ ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరయ్యారు. ఇప్పుడు వారంతా కీలకమైన ఏకీకృత రాష్ట్ర అర్హత పరీక్ష(యూనిఫైడ్ స్టేట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్)కు ఆన్‌లైన్‌లోనే హాజరయ్యేందుకు ఉక్రెయిన్ అనుమతించనుంది.
Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
Asian Wrestling Championships 2023: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారతకు ఎనిమిది పతకాలు
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. ఏప్రిల్ 12న ముగిసిన మహిళా ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో భారత్‌కు ఒక రజతం, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు లభించాయి. గత ఏడాది అండర్–20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అంతిమ్ పంఘాల్ (53 కేజీలు) రజత పతకం నెగ్గగా.. అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు), మనీషా (65 కేజీలు), రీతిక (72 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు కేవలం ఒక పాయింట్ సమర్పించుకున్న అంతిమ్ తుది పోరులో మాత్రం పోరాడినా ఫలితం లేకపోయింది. 2021 ప్రపంచ చాంపియన్ అకారి ఫుజినామి (జపాన్) 10–0తో మూడు నిమిషాల వ్యవధిలో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అంతిమ్‌పై గెలిచి స్వర్ణ పతకం దక్కించుకుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (05-11 మార్చి 2023)
అంతకుముందు అంతిమ్ తొలి రౌండ్‌లో 10–0తో అల్వినా లిమ్ (సింగపూర్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–0తో లి డెంగ్ (చైనా)పై, సెమీఫైనల్లో 8–1తో అక్టెంగె కెనిమ్‌జయేవా (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందింది. కాంస్య పతక బౌట్‌లలో అన్షు 10–0తో ఎర్డెన్‌సుడ్ బట్ ఎర్డెన్ (మంగోలియా)పై, సోనమ్ 5–1తో జియోజువాన్ లు (చైనా)పై, మనీషా 8–0తో అల్బీనా కైర్‌జెల్డినోవా (కజకిస్తాన్)పై, రీతిక 5–1తో స్వెత్లానా (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించారు. రెండు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు నెగ్గిన భారత్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచింది.
IT industry: ఐటీలో నియామకాలకు 6 నెలలు బ్రేక్.. ఇచ్చిన ఆఫర్లను రద్దు చేసే అవకాశం
IPL 2023: ఐపీఎల్‌లో ధోనీ రికార్డు.. సీఎస్కే కెప్టెన్‌గా 200వ మ్యాచ్
ఏప్రిల్ 12న రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ధోని మరో మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై జట్టు కెప్టెన్ హోదాలో అతను 200వ మ్యాచ్ ఆడాడు. అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో 238 మ్యాచ్‌లతో ధోని తొలి స్థానంలో ఉన్నాడు. చెన్నై జట్టుపై రెండేళ్లపాటు నిషేధం విధించిన సమయంలో ధోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు తరఫున రెండు సీజన్‌లు (2016, 2017) ఆడాడు. ఓవరాల్‌గా ధోని ఇప్పటి వరకు 214 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోనిని చెన్నై ఫ్రాంచైజీ యజమాని శ్రీనివాసన్ సన్మానించారు. కాగా రాజస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ మూడు పరుగుల తేడాతో ఓడిపోమయింది.
IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచలనం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే..
Keshub Mahindra: ఆటోమొబైల్ కింగ్ కేశుబ్ మహీంద్రా కన్నుమూత
భారత్ ఆటో పరిశ్రమకు మార్గదర్శకులు, మహీంద్రా అండ్ మహీంద్రా గౌరవ చైర్మన్ కేశుబ్ మహీంద్రా(99) ఏప్రిల్ 12న తుది శ్వాస విడిచారు. కేశుబ్ మహీంద్రా గ్రూప్‌నకు 48 ఏళ్ల పాటు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి ఐటీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆతిథ్యం వంటి ఇతర వ్యాపార విభాగాలకు గ్రూప్ కార్యకలాపాలను విస్తరించారు. విల్లీస్ కార్పొరేషన్, మిత్సుబిషి, ఇంటర్నేషనల్ హార్వెస్టర్, యునైటెడ్ టెక్నాలజీస్, బ్రిటీష్ టెలికం తదితర అనేక ఇతర ప్రపంచ దిగ్గజ సంస్థలతో వ్యాపార సంబంధాలను ఏర్పరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అక్టోబరు 9, 1923న సిమ్లాలో జన్మించిన కేశుబ్, అమెరికా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్‌లో గ్రాడ్యుయేట్ చేసి, 1947లో మహీంద్రా అండ్ మహీంద్రాలో చేరారు. 1963లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. స్టీల్ ట్రేడింగ్ కంపెనీ నుంచి 15.4 బిలియన్ డాలర్ల వరకూ ఆయన పర్యవేక్షణలో గ్రూప్ వివిధ రంగాలకు విస్తరించింది. మహీంద్రా బోర్డులో డైరెక్టర్లలో ఒకరిగా 64 సంవత్సరాలు కొనసాగిన కేశుబ్ మహీంద్రా 2012లో గ్రూప్ పగ్గాలను అయన మేనల్లుడు, అప్పటి వైస్ చైర్మన్, ఎండీ ఆనంద్ మహీంద్రాకు అప్పగించారు.
Mukesh Ambani: ఆసియా కుబేరుడిగా ముకేశ్ అంబానీ
Jallianwala Bagh Massacre: జలియన్ వాలాబాగ్ ఊచకోతకు 104 ఏళ్లు..
భారత జాతీయోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టమైన సంఘటన. నాటి వలస పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు పోయాయి. జలియన్ వాలాబాగ్ ఊచకోత ఉదంతం జరిగి నేటికి 104 ఏళ్లు పూర్తయింది. ప్రజలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే బ్రిటిషర్లు రౌలత్ చట్టాన్ని(21 మార్చి 1919న) తీసుకురావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. జలియన్ వాలాబాగ్ అనేది అమృత్‌సర్ నగరంలోని ఓ తోట. 1919 ఏప్రిల్ 13న పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ పండగ సందర్భంగా వేలాది మంది జలియన్ వాలాబాగ్‌కు చేరుకున్నారు. ఈ వేడుకల్లోనే స్వాతంత్య్ర పోరాట యోధుడు సైఫుద్దీన్ కిచ్లేవ్, సత్యపాల్‌ను బ్రిటిష్ అధికారులు అరెస్టు చేసినందుకు నిరసనగా పలువురు జాతీయోద్యమ నేతలు సమావేశమై శాంతియుతంగా నిరసన తెలిపారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ, అక్కడక్కడ చిన్నచిన్న ద్వారాలు ఉన్నాయి.
Potti Sriramulu: ఆధునిక శిబిచక్రవర్తి అమరజీవి..
ఇదే సమయంలో జనరల్ రెజినాల్డ్ ఓ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్లు కాల్పులు జరిపి నరమేధానికి పాల్పడ్డారు. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై కాల్పుల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో అధికారిక లెక్కల ప్రకారం 379 మంది మరణించినట్లు నాటి పాలకులు తెలిపారు. పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి
Babu Jagjivan Ram: బాబూ జగ్జీవన్‌రామ్.. సమతావాది.. సంస్కరణవాది..