Daily Current Affairs in Telugu: ఏప్రిల్ 12, 2023 కరెంట్ అఫైర్స్
TOEFL Exam: ‘టోఫెల్’ పరీక్ష కాల వ్యవధి గంట తగ్గింపు..
విదేశీ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఉపకరించే ‘టోఫెల్’ పరీక్ష ఇకపై రెండు గంటలలోపే ముగియనుంది. ప్రస్తుతం ఈ పరీక్షను మూడు గంటలపాటు నిర్వహిస్తున్నారు. అధికారిక స్కోర్ను విడుదల చేసే తేదీని టోఫెల్ పూర్తికాగానే అభ్యర్థులు తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఈటీఎస్) వెల్లడించింది. టోఫెల్ ఒక గంట 56 నిమిషాల పాటు ఉంటుందని పేర్కొంది. టోఫెల్లో చేస్తున్న మార్పులు ఈ ఏడాది జూలై 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. టోఫెల్ స్కోర్ను 160కి పైగా దేశాల్లో 11,500కిపైగా యూనివర్సిటీలు అంగీకరిస్తున్నాయి.
VISA: దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా
ఇందులో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని వర్సిటీలు ఉన్నాయి. టోఫెల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ తెలిపారు. టెస్టు ఫీజును భారతీయ రూపాయల్లో చెల్లించవచ్చని సూచించారు. టోఫెల్ ప్రక్రియలో తీసుకొస్తున్న మార్పులతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అసోసియేషన ఆఫ్ ఆ్రస్టేలియన్ ఎడ్యుకేషన్ రిప్రజంటేటివ్స్ ఇన్ ఇండియా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి బొర్రా వివరించారు.
Study Abroad: విదేశీ విద్యకు.. ముందస్తు ప్రణాళిక!
అమెరికా రాయబారి రాక
భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన ఎరిక్ గార్సెట్టి ఏప్రిల్ 11న ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌కు అత్యంత సన్నిహితుడైన గార్సెట్టి రెండేళ్ల క్రితమే భారత రాయబారిగా నియమితులయ్యారు. సెనేట్ మాత్రం నెల క్రితమే ఆమోద ముద్ర వేసింది. ‘నమస్తే ఎరిక్ గార్సెట్టి: మీకు సాదర స్వాగతం. భారత్–అమెరికా మధ్య మరింత బలమైన బంధాలను నిర్మించడానికి మీతో కలిసి పనిచేస్తాం’ అని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. రెండేళ్లుగా అమెరికా రాయబారి పదవి ఖాళీగానే ఉంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (05-11 మార్చి 2023)
Nirmala Sitharaman: ప్రపంచీకరణలో మరింత పారదర్శకత అవసరం..
గ్లోబలైజేషన్ ప్రయోజనాలను తక్కువ చేసి చూపాలని భారత్ కోరుకోవడం లేదని కేంద్ర లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే దానిని మరింత పారదర్శకంగా మార్చాలని కోరుతోందని పేర్కొన్నారు. ప్రముఖ అమెరికన్ పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ మేరకు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మరింత ప్రగతిశీలంగా ఉండాలని, ఇతర దేశాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని భారత్ కోరుతోందన్నారు. ‘వినడానికి మాత్రమే కాకుండా చెప్పడానికి భిన్నమైన దేశాలకు డబ్ల్యూటీఓ మరింత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని’ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా..
భారత్ చాలా కాలంలో తన తయారీ రంగం వృద్ధి చెందేలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. తను ఉత్పత్తి చేయగల వినియోగ వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడం లేదని తెలిపారు. అయితే ధర వ్యత్యాసాలు, పోటీతత్వం వంటి అంశాలు అంతర్జాతీయంగా కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఇలాంటి సమస్యల విషయంలో ఆయా దేశాల మధ్య పరస్పర ప్రయోజనకర అవగాహనలు అవసరమని అన్నారు. పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి
Income Tax: ఆకర్షణీయంగా కొత్త ఆదాయపన్ను విధానం.. ఇకపై జీవిత బీమా పాలసీలపైనా పన్ను..!
Asian Wrestling Championships: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో నిషాకి రజతం, ప్రియాకి కాంస్యం
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఏప్రిల్ 11న మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్కు రెండు పతకాలు లభించాయి. నిషా (68 కేజీలు) రజత పతకం.. ప్రియా (76 కేజీలు) కాంస్య పతకం సాధించారు. నీలమ్ (50 కేజీలు) కాంస్య పతక బౌట్లో ఓడిపోగా.. సీతో (55 కేజీలు), సరిత మోర్ (59 కేజీలు) నిరాశపరిచారు. 68 కేజీల విభాగంలో ఫైనల్లో నిషా 0–10తో గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన అమీ ఇషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. ప్రియా 2–1తో మిజుకి నాగషిమ (జపాన్)పై గెలుపొంది కాంస్య పతకాన్ని దక్కించుకుంది. నీలమ్ 0–10తో జికి ఫెంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (05-11 మార్చి 2023)
డబ్ల్యూటీటీ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిన మనిక బత్రా
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చాంపియన్స్ టోర్నీలో భారత నంబర్వన్ మనిక బత్రా పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. చైనాలోని జిన్జియాంగ్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ 39వ ర్యాంకర్ మనిక 4–11, 9–11, 1–11తో ప్రపంచ 24వ ర్యాంకర్ జియోనా షాన్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. కేవలం సింగిల్స్ విభాగాల్లో మాత్రమే నిర్వహిస్తున్న ఈ టోరీ్నలో భారత్ నుంచి మనిక మాత్రమే పోటీపడింది.
ATP Rankings: ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
Badminton Rankings: బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో చోటు కోల్పోయిన పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు మళ్లీ టాప్–10లో చోటు కోల్పోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో సింధు రెండు స్థానాలు పడిపోయి తొమ్మిది నుంచి 11వ ర్యాంక్కు చేరుకుంది. గత నెలలో 2016 తర్వాత తొలిసారి టాప్–10లో స్థానం కోల్పోయిన సింధు ఈనెల తొలి వారంలో తొమ్మిదో స్థానానికి చేరుకొని మళ్లీ టాప్–10లోకి వచ్చింది. అయితే వారం వ్యవధిలో సింధు ర్యాంక్ మారిపోయింది. భారత్కే చెందిన సైనా 31వ ర్యాంక్లో, ఆకర్షి 40వ ర్యాంక్‌లో, మాళవిక 42వ ర్యాంక్లో, అష్మిత 48వ ర్యాంక్లో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్కు చేరుకున్నాడు. గతవారం ఫ్రాన్స్‌లో జరిగిన ఓర్లియాన్ మాస్టర్స్ టోర్నీలో మధ్యప్రదేశ్కు చెందిన ప్రియాన్షు విజేతగా నిలిచాడు. దాంతో ప్రియాన్షు 20 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్లో నిలిచాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons in News) క్విజ్ (05-11 మార్చి 2023)
YSR EBC Nestham: వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల
వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఏప్రిల్ 12న(బుధవారం) ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన బటన్నొక్కి నేరుగా వారి ఖాతాల్లో నగదును జమ చేశారు.
వైఎస్సార్ ఈబీసీ నేస్తం ముఖ్యాంశాలు..
☛ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ.15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్ళలో మొత్తం రూ.45,000 ఆర్ధిక సాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు అందిస్తుంది.
☛ ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుక – వైఎస్సార్ ఈబీసీ నేస్తం
☛ ఈ సారి అందిస్తున్న రూ.658.60 కోట్లతో కలిపి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ.30,000.
☛ వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో ప్రభుత్వం అందించిన లబ్ధి రూ.2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్ డీబీటీ).
Family Doctor: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రారంభం.. ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యమిదే..
Covid Cases In India: భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం..ఒక్కరోజులో 7 వేలకు పైగా కేసులు..
దేశంలో రోజువారీ కరోనా వైరస్ కేసుల పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాగా గత 24 గంటల్లో ఏకంగా 7 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం(ఏప్రిల్ 11) ఉదయం నుంచి బుధవారం(ఏప్రిల్ 12) ఉదయం వరకు 2,14,242 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 7,830 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,47,76,002కి చేరింది.
కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 40,215కు చేరింది. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,04,771 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,016కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 220.66 కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది.
Aam Aadmi Party: జాతీయ పార్టీగా ఆమ్ఆద్మీ.. హోదా కోల్పోయిన మూడు పార్టీలివే..
భారత్‌లో యాపిల్ స్టోర్లను ప్రారంభించనున్న టిమ్ కుక్!
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఏప్రిల్ 18న అధికారిక విక్రయ శాలను ముంబైలో ప్రారంభిస్తోంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఔట్లెట్ ఏప్రిల్ 20న తెరుచుకోనుంది. ఈ రెండు కేంద్రాల ప్రారంభోత్సవానికి సంస్థ సీఈవో టిమ్ కుక్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశమూ ఉంది. టిమ్ కుక్ 2016లో తొలిసారిగా భారత్లో పర్యటించారు. కంపెనీ భారత్లో 2020లో ఆన్లైన్ స్టోర్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రిటైల్లో ఎక్స్క్లూజివ్ యాపిల్ ప్రీమియం రీసెల్లర్ స్టోర్స్ (ఏపీఆర్), రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి భారీ చైన్స్, మల్టీ బ్రాండ్ రిటైల్ కేంద్రాలతోపాటు ఈ–కామర్స్ వేదికల ద్వారా యాపిల్ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా 100కుపైగా ఏపీఆర్ ఔట్లెట్లు ఉన్నాయి. భారత స్మార్ట్ఫోన్ విపణిలో 2022లో కంపెనీ 17 శాతం వృద్ధితో 4 శాతం వాటాను చేజిక్కించుకుంది.
రూ.49,200 కోట్ల విలువైన అమ్మకాలను సాధించింది. దేశంలో ప్రీమియం స్మార్ట్ఫోన్ల విభాగం రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది. చైనా వెలుపల భారత్ సహా ఇతర దేశాల్లో ఉత్పత్తిని పెంచడానికి యాపిల్ స్థిర ప్రయత్నాలు చేసింది. యాపిల్ ప్రొడక్టులను సరఫరా చేస్తున్న ఫాక్స్కాన్, పెగట్రాన్, విస్ట్రన్ కంపెనీలు ఐఫోన్ల తయారీని భారత్లో అధికం చేశాయి. భారత ప్రభుత్వం స్థానికంగా తయారీని ప్రోత్సహించడం, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం, చౌకగా కార్మికుల లభ్యత ఇందుకు దోహదం చేశాయి.