AP govt MOU with ETS: సర్కారు బడిలో ‘టోఫెల్’ ట్రైనింగ్
సీఎం జగన్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఈటీఎస్’ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ లెజో సామ్ ఊమెన్, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఒప్పందంలో ముఖ్యాంశాలు:
♦ టోఫెల్ పరీక్షలు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌తో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకోవడం ఇదే ప్రథమం.
♦ ఈ ఒప్పందం ద్వారా అమెరికన్, యూరోపియన్ ఉచ్ఛారణలో పిల్లల నైపుణ్యాలను పెంపొందిస్తారు.
♦ విదేశీ యాసను అర్థం చేసుకోవడమే కాకుండా విద్యార్థులు చక్కగా మాట్లాడేలా శిక్షణ ఇస్తారు.
♦ 3, 4వ తరగతి పిల్లలకు విద్యా సంవత్సరం చివరలో మార్చిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు.
♦ 5వ తరగతి పిల్లలకు అక్టోబరులో మరో సన్నాహక పరీక్ష అనంతరం మార్చిలో తుది పరీక్ష టోఫెల్ ప్రైమరీని నిర్వహిస్తారు.
Daily Current Affairs in Telugu: 24 జూన్ 2023 కరెంట్ అఫైర్స్...
♦ 6 – 8వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష ఉంటుంది.
♦ 9వ తరగతి విద్యార్థులకు అక్టోబరులో మరో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. తుది పరీక్ష టోఫెల్ జూనియర్ విద్యా సంవత్సరం చివరిలో జరుగుతుంది.
♦ 10వ తరగతి విద్యార్థులకు టోఫెల్ జూనియర్ స్పీకింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
♦పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో భాగంగా 3 – 5 తరగతుల వారికి వారానికి మూడుసార్లు గంట సేపు స్మార్ట్ టీవీల ద్వారా ఆడియో, వీడియో కంటెంట్‌ను వినిపిస్తారు.
♦ 6 – 10వ తరగతి పిల్లలకు ఐఎఫ్‌పీల ద్వారా వారానికి మూడుసార్లు వీడియోలు ప్రదర్శిస్తారు.
♦ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు.
♦ అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు చదివే స్కూళ్లలో ఇంగ్లిష్ టీచర్లను మెరుగైన శిక్షణ, అవగాహన కోసం అమెరికాలోని ప్రిన్స్టన్కు మూడు రోజులపాటు పంపిస్తారు.
♦ ఒప్పందంలో భాగంగా టోఫెల్ పరీక్షలను సీనియర్ లెవెల్‌కూ (ప్లస్ –1, ప్లస్ –2) విస్తరించాలని సీఎం ఆదేశించారు.
Daily Current Affairs In Telugu: 23 జూన్ 2023 కరెంట్ అఫైర్స్...