Skip to main content

ఆన్‌లైన్‌లో చట్టసభ్యుల నేర చరిత్ర: సుప్రీంకోర్టు

దేశంలోని అన్ని ప్రాంతీయ, జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు తమతమ అభ్యర్థులపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తమ వెబ్‌సైట్లలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Current Affairsఅలాగే క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎందుకు నిర్ణయించారో రాజకీయ పక్షాలన్నీ వివరణ ఇవ్వాలని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ రవీంద్రభట్‌ల బెంచ్ స్పష్టం చేసింది. రాజకీయాలు నేరపూరితం కావడంపై కోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు(అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ నేరాల వివరాలు బహిర్గతం చేయాలి) అమలు కావడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఫిబ్రవరి 13న విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా లేదా నామినేషన్ల దాఖలు ప్రారంభమయ్యే తేదీకి కనీసం రెండు వారాల ముందు వారి నేర చరిత్రను ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి అన్ని సోషల్ మీడియా వేదికలపై వెల్లడించాలని, జాతీయ, స్థానిక వార్తా పత్రికల్లోనూ ప్రకటనలు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది.

పార్లమెంట్‌లో నేరచరిత్ర కలిగిన ఎంపీల సంఖ్య

సంవత్సరం

ఎంతమంది(శాతాల్లో..)

2004

24

2009

30

2014

34

2019

43

Published date : 14 Feb 2020 05:54PM

Photo Stories