Skip to main content

400 మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రీడాకారుడు?

పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో నూతన ప్రపంచ రికార్డు నమోదైంది.
Current Affairs
400 మీటర్ల హర్డిల్స్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన కార్‌స్టెన్‌ వార్‌హోమ్‌ (నార్వే) ఈ కొత్త రికార్డును నమోదు చేశాడు. నార్వే రాజధాని ఓస్లోలో జరుగుతున్న డైమండ్‌ లీగ్‌ మీట్‌లో భాగంగా జూలై 1న జరిగిన పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కార్‌స్టెన్‌ పోటీని అందరికంటే ముందుగా 46.70 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్‌ కెవిన్‌ యంగ్‌ (46.79 సె.) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది.

25 ఏళ్ల కార్‌స్టెన్‌ 2017 నుంచి ట్రాక్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 2017లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ 400 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచాడు. పోలండ్‌ ఆతిథ్యమిచ్చిన యూరోపియన్‌ అండర్‌– 23 చాంపియన్‌షిప్‌లో 400 మీ.హర్డిల్స్‌తో పాటు 400 మీ. పరుగులో సత్తాచాటుకున్నాడు. హర్డిల్స్‌లో స్వర్ణం సాధించిన కార్‌స్టెన్, పరుగులో రజతం నెగ్గాడు. మళ్లీ దోహా (2019) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హర్డిల్స్‌ టైటిల్‌ నిలబెట్టుకున్నాడు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో నూతన ప్రపంచ రికార్డు
ఎప్పుడు : జూలై 2
ఎవరు : కార్‌స్టెన్‌ వార్‌హోమ్‌ (నార్వే)
ఎక్కడ : ఓస్లో, నార్వే
Published date : 03 Jul 2021 06:03PM

Photo Stories