2021లో చంద్రయాన్-3 ప్రయోగం : శివన్
Sakshi Education
2021లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ కె.శివన్ ప్రకటించారు.
చంద్రయాన్-2లో మాదిరిగానే చంద్రయాన్-3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయని అన్నారు. ఈ మేరకు జనవరి 1న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివన్ వెల్లడించారు.
శివన్ వెల్లడించిన వివరాల ప్రకారం...
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021లో చంద్రయాన్-3 ప్రయోగం
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఇస్రో చైర్మన్ కె.శివన్
మాదిరి ప్రశ్నలు
శివన్ వెల్లడించిన వివరాల ప్రకారం...
- చంద్రయాన్-2లో ఆర్బిటర్ మిషన్ జీవితకాలం 7 సంవత్సరాలు. చంద్రయాన్-3లోనూ దీనిని ఉపయోగిస్తారు.
- చంద్రయాన్-2 కంటే చంద్రయాన్-3 ప్రయోగానికి తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ప్రయోగానికి రూ.250 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా.
- - వేగాన్ని నియంత్రించే వ్యవస్థ విఫలమవడం వల్లనే చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయింది.
- ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందడానికి భారత వాయు సేనకు చెందిన నలుగురు సిబ్బంది ఎంపికయ్యారు. జనవరి మూడో వారంలో వీరికి రష్యాలో శిక్షణ ప్రారంభంకానుంది.
- 2020 ఏడాదిలో ఇస్రో సుమారు 25 వరకు ప్రయోగాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.
- త్వరలోనే ఇస్రో టెలివిజన్ చానెల్ ఆవిష్కరణ ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021లో చంద్రయాన్-3 ప్రయోగం
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఇస్రో చైర్మన్ కె.శివన్
మాదిరి ప్రశ్నలు
1. జాతీయ సైన్స్ దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1. ఫిబ్రవరి 10
2. ఏప్రిల్ 15
3. ఫిబ్రవరి 28
4. మార్చి 22
- View Answer
- సమాధానం: 3
2. నరోరా అణువిద్యుత్ కేంద్రం ఏక్కడ ఉంది?
1. నరోరా (ఉత్తరప్రదేశ్)
2. నరోరా (ఒడిశా)
3. రావత్భాట(రాజస్థాన్)
4. కైగ (కర్టాటక)
- View Answer
- సమాధానం: 1
Published date : 02 Jan 2020 06:20PM