Skip to main content

AP News: బిగ్ బ్రేకింగ్‌... జులైలో విశాఖ‌కు.. ఇక అక్క‌డి నుంచే పాల‌న‌

అసెంబ్లీ బడ్జెట్‌ సమాశాల నేపథ్యంలో జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జులైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రుల వద్ద వ్యాఖ్యానించారాయన.
YS Jagan

దీంతో.. అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. విశాఖ పాలనా రాజధాని అని గతంలో సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. తానూ విశాఖకు షిఫ్ట్‌ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు కూడా. దీంతో విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికలపైనా కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులకు అప్పగించిన సీఎం జగన్‌.. మంత్రులు సక్రమంగా పని చేయించకపోతే పదవులకు ముప్పు వస్తుందని హెచ్చరించిన‌ట్లు తెలుస్తోంది.

Published date : 14 Mar 2023 04:42PM

Photo Stories