Skip to main content

zaporizhzhia nuclear power station: ఉక్రెయిన్‌ విద్యుత్‌.. ‘రష్యా’ ప్రాంతాలకు !

కీవ్‌: యూరప్‌లోనే పెద్దదైన ఉక్రెయిన్‌లోని జపోరిజియా అణు విద్యుత్‌ కేంద్రం నుంచి దేశీయ పవర్‌ గ్రిడ్‌కు అనుసంధానంగా ఉన్న విద్యుత్‌ లైన్లు రష్యా దాడుల్లో ధ్వంసమయ్యాయి.
Russia hits power grid in central regions of Ukraine
Russia hits power grid in central regions of Ukraine

దాడుల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో పెద్దస్థాయిలో నష్టం జరిగిందని ఉక్రెయిన్‌ అణువిద్యుత్‌ అధీకృత సంస్థ ఎనర్గోటామ్‌ నవంబర్ 3న వెల్లడించింది. ‘అణు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి ఉక్రెయిన్‌ పవర్‌ గ్రిడ్‌కు వెళ్లే లైన్లను క్షిపణులతో ధ్వంసంచేశారు. రష్యా గ్రిడ్‌తో అనుసంధానించేందుకు కుట్రకు తెరలేపారు. భవిష్యత్‌లో ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రష్యా ఆక్రమిత క్రిమియా, డోన్బాస్‌ ప్రాంతాలకు తరలించేందుకు ఆ వైపు లైన్లను పునరుద్ధరిస్తున్నారు’ అని ఎనర్గోటామ్‌ టెలిగ్రామ్‌ చానెల్‌లో ఆరోపించింది.

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 04 Nov 2022 01:59PM

Photo Stories