Skip to main content

Rozgar Mela: బిగ్ బ్రేకింగ్‌... 71 వేల మందికి నియామ‌క‌ప‌త్రాలు... ఎప్పుడంటే..!

వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా మే 16(మంగ‌ళారం)న మరో విడత రోజ్‌గార్‌ మేళాను నిర్వహించనుంది.
PM Narendra Modi
PM Narendra Modi

22 రాష్ట్రాల్లోని 45 కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 71వేల మందికిపైగా ఉద్యోగులకు ప్రధాని న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నియామక పత్రాలను అందజేయ‌నున్నారు.

modi

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల్లో నియామకాల కోసం ఈ రోజ్‌గార్ మేళాను నిర్వహిస్తారు. ఎంపికైనవారిని గ్రామీణ తపాలా సేవకులు, తపాలా శాఖ ఇన్‌స్పెక్టర్, కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, సబ్ డివిజినల్ ఆఫీసర్, ట్యాక్స్ అసిస్టెంట్స్ వంటి ఉద్యోగాల్లో నియమిస్తారు.

☛ షెడ్యూల్ ప్ర‌కార‌మే ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్ 1 ప‌రీక్ష‌... పూర్తి వివ‌రాలు ఇవే..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగాల సృష్టికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్ర‌ ప్రభుత్వం సోమ‌వారం విడుదల చేసిన ఒక‌ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగానే రోజ్‌గార్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. యువత సాధికారతకు ఈ మేళా ఒక వేదిక‌గా నిలుస్తుంద‌ని తెలిపింది. కొత్తగా నియమితులైనవారి కోసం ఆన్‌లైన్‌లో కర్మయోగి ప్రారంభ్ కోర్సును అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఈ కోర్సు ద్వారా వీరు తమంతట తామే శిక్షణ పొందవచ్చునని తెలిపింది.

modi

 విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌... ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఎంబీబీఎస్ సీటు

రోజ్‌గార్‌ మేళా పథకాన్ని ప్రధాని మోదీ 2022 అక్టోబరు 22న ప్రారంభించారు. అప్పుడు 75వేల మందికిపైగా ఉద్యోగులకు నియామక పత్రాలు అందించారు. రెండో విడత మేళాను 2022 నవంబరు 22న, మూడో విడత మేళా 2023 జనవరి 20న, నాలుగో విడత ఏప్రిల్‌ 13న నిర్వహించారు. రోజ్‌గార్‌ మేళాల్లో ఇప్పటివరకూ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన వాటిలో కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాలకు చెందిన వివిధ పోస్టులతో పాటు ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్లు, లోకోపైలట్లు వంటి పోస్టులున్నాయి.

Published date : 15 May 2023 06:23PM

Photo Stories