సెప్టెంబర్ 2018 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
రష్యాతో భారత్ ‘గగన్‌యాన్’ ఒప్పందం
ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ప్రాజెక్టుకు సంబంధించి రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గగన్‌యాన్‌కు సంబంధించి ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న భారత్.. తాజాగా రష్యాతో చేతులు కలపనుందని సమాచారం. అక్టోబర్ నెలలో రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఒప్పందం జరగవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి. రష్యా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) వ్యవస్థ గ్లోనాస్, భారత్ జీపీఎస్ వ్యవస్థ నావిక్‌లకు సంబంధించి గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేసే విషయంపై కూడా చర్చలు జరగవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటీ : ‘గగన్‌యాన్’ప్రాజెక్టుకు సంబంధించి రష్యాతో భారత్ ఒప్పందం
ఎక్కడ : భారతదేశం
‘ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్’ ప్రారంభం
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య నిర్మించనున్న 130 కిలోమీటర్ల ‘ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్’ (మైత్రి పైప్‌లైన్) పనులను ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని ప్రధాని షేక్ హసీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెప్టెంబర్ 18న ప్రారంభించారు. రూ. 346 కోట్లతో నిర్మిస్తున్న ఈ పైప్‌లైన్ ద్వారా అస్సాం గోలాఘాట్‌లోని నుమాలిగఢ్ రిఫైనరీ నుంచి బంగ్లాదేశ్‌కు చమురును సరఫరా చేయనున్నారు. ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్‌ను సరఫరా చేసే సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిని, బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలోని పర్బతిపూర్‌ను మైత్రి పైప్‌లైన్ అనుసంధానం చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్’ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ఎక్కడ : పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి - బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలోని పర్బతిపూర్ మధ్య
భారత్, అమెరికాల మధ్య కామ్‌కాసా ఒప్పందం
భారత్, అమెరికాల మధ్య కీలకమైన కామ్‌కాసా(కమ్యూనికేషన్స్, కంపాటిబిలిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్) ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఢిల్లీలో సెప్టెంబర్ 6న సమావేశమైన ఇరు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల(2+2) మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు రక్షణ రంగంలో అత్యంత కీలకమైన, క్లిష్టమైన సాంకేతికతను అమెరికా అందించనుంది.
ఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత్ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మైకేల్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్‌లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఇరు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మధ్య హాట్‌లైన్ ఏర్పాటు, రష్యా నుంచి భారత్ కొనుగోలుచేయనున్న ఎస్-400 క్షిపణులు వంటి అంశాలపై చర్చలు జరిపారు. అలాగే హెచ్-1బీ వీసా, సీమాంతర ఉగ్రవాదం, ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి, ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న యత్నాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై కూడా చర్చించారు.
కామ్‌కాసా ఒప్పందంలోని అంశాలు....
పదేళ్లు అమలులో ఉండే ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి భారత్‌కు అత్యాధునిక మిలిటరీ కమ్యూనికేషన్ పరికరాలు అందుతాయి. ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కీలక సమాచారాన్ని సంకేత భాషలో పంచుకునేందుకు వీలు కలుగుతుంది. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను అమరుస్తారు. సి-17, సి-130జే, పి-81 విమానాలతో పాటు, అపాచె, చింకూర్ హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కామ్‌కాసా ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : అమెరికా, భారత్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : రక్షణ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు

Published date : 09 Oct 2018 05:25PM