Skip to main content

మార్చి 2017 ద్వైపాక్షిక సంబంధాలు

రక్షణ రంగంలో భాగస్వామ్య బలోపేతానికి భారత్-అమెరికా నిర్ణయం
రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. సముద్ర భద్రత, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాల్లో కలిసి పనిచేయాలని సంకల్పించాయి. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్, అంతర్గత భద్రత మంత్రి జాన్‌కెల్లీతోపాటు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌మెక్‌మాస్టర్‌లతో మార్చి 25న వాషింగ్టన్‌లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

జకార్తాలో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సమావేశం
Current Affairs ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్‌ఏ) 2017 సమావేశం మార్చి 5 - 7 వరకూ ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగింది. ఈ భేటికి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు హాజరయ్యారు. ఉగ్రవాదంపై పోరుకు ఐక్య కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే సముద్ర ప్రాంత రక్షణ, భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, విపత్తు నిర్వహణ, టూరిజం, సంస్కృతి తదితర అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించారు.
ఐఓఆర్‌ఏలో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇరాన్, కెన్యా, మలేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ తదితర 21 దేశాలకు సభ్యత్వం ఉంది. ఐఓఆర్‌ఏ కేంద్ర కార్యాలయం మారిషస్‌లో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ 2017 సమావేశం
ఎప్పుడు : మార్చి 5 - 7
ఎక్కడ :జకార్తా (ఇండోనేషియా)
ఎందుకు : అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో పరస్పర సహకారం కోసం

బిమ్‌స్టెక్ దేశాల భద్రతా సమావేశం
భారత జాతీయ భద్రత సలహాదారు.. అజిత్ ధోవల్ అధ్యక్షతన బిమ్‌స్టెక్ దేశాల జాతీయ భద్రత విభాగాధిపతుల సమావేశం మార్చి 21న న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదంపై సమష్టి పోరు జరపాల్సిందిగా బిమ్‌స్టెక్ సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా, విపత్తులపై కలిసికట్టుగా పోరాడాలన్నారు. సైబర్ భద్రత, సముద్ర భద్రతపై పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.

ఢిల్లీలో ప్రపంచ పర్యావరణ సదస్సు - 2017
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మార్చి 25 నుంచి 26 వరకూ ప్రపంచ పర్యావరణ సదస్సు 2017 జరిగింది. జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రపంచం ఎదుర్కొంటున్న వ్యాధుల్లో 24 శాతం, మరణాల్లో 23 శాతం వాతావరణ కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ చట్టాలపై సదస్సులో చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ప్రపంచ పర్యావరణ సదస్సు - 2017
ఎప్పుడు : మార్చి 25-26
ఎవరు : జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్
ఎక్కడ : న్యూఢిల్లీ

ఉత్తరాఖండ్‌లో వైద్య సేవలకు ప్రపంచ బ్యాంక్ సహాయం
ఉత్తరాఖండ్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రపంచ బ్యాంకు 100 మిలియన్ డాలర్ల సహాయం చేయనుంది. ఈ మేరకు భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో మార్చి 25న ఒప్పందం చేసుకుంది. ఈ నిధులతో ముఖ్యంగా కొండ ప్రాంత జిల్లాల్లో వైద్య సేవలను అభివృద్ధి చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఉత్తరాఖండ్‌లో వైద్య సేవలకు ప్రపంచ బ్యాంక్ వంద మిలియన్ డాలర్ల సహాయం
ఎప్పుడు : మార్చి 25
ఎందుకు : ఉత్తరాఖండ్‌లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు
Published date : 10 Apr 2017 02:27PM

Photo Stories