Diplomacy: భారత్‌కు ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ నేతలు
Sakshi Education
రానున్న రెండు, మూడు నెలల్లో ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా సహా పలు దేశాల అధినేతలు భారత్‌కు విచ్చేయనున్నారు.
ప్రపంచదేశాలపై ఉక్రెయిన్ యుద్ధం, ఆహార, ఇంధన భద్రతలపై పడిన తీవ్ర ప్రభావంపై చర్చలే లక్ష్యంగా వీరి పర్యటనలు సాగనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ వచ్చే నెలలో భారత్‌కు రానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ మార్చిలో వస్తారని భావిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ కూడా మార్చి మొదటి వారంలోనే పర్యటించే అవకాశాలున్నాయి.
Veer Guardian: ఇండియా జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు
Published date : 11 Jan 2023 03:34PM