జూన్ 2021 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
అమెరికా రక్షణ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ
అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సమావేశయ్యారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో మే 28న జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. భారత్–అమెరికా మధ్య వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయానికొచ్చారు. రెండు దేశాలకు రక్షణపరంగా ఎదురవుతున్న సవాళ్ల గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
జాతీయ భద్రత సలహాదారుతో భేటీ
విదేశాంగ మంత్రి జైశంకర్ మే 27న అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సాలివన్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు చర్చించారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దేశం సందర్శించిన తొలి విదేశీ విదేశాంగ మంత్రి జైశంకర్ కావడం విశేషం. అమెరికాకు భారత్ 9వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ, 2021 జనవరి నుంచి మార్చి వరకు 24.8 బిలియన్ డాలర్లు ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో సమావేశం
ఎప్పుడు : మే 28
ఎవరు : భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యంపై చర్చలు జరిపేందుకు...
పట్టణాభివృద్ధిలో భారత్కు సహకారం అందించనున్న దేశం?
పట్టణాభివృద్ధిలో జపాన్ సహకారం పొందేందుకు భారత్ ముందడుగు వేసింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం (ఎంఓసీ) కుదుర్చుకునేందుకు జూన్ 2న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం... భారత్ తరఫున గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, అలాగే జపాన్ తరఫున భూ, మౌలిక, రవాణా, పర్యాటక మంత్రిత్వశాఖల ప్రతినిధులు ఎంఓసీపై సంతకాలు చేయనున్నారు. వాస్తవానికి పట్టణాభివృద్ధికి సంబంధించి రెండు దేశాలూ 2007లో ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. దీని స్థానంలో తాజాగా ఎంఓసీ రానుంది. ఒకసారి సంతకాలు పూర్తయిన తర్వాత ఐదేళ్లు ఎంఓసీ అమల్లో ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్టణాభివృద్ధిలో భారత్కు సహకారం అందించనున్న దేశం?
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : జపాన్
ఎందుకు : రెండు దేశాలు సహకార ఒప్పందం (ఎంఓసీ) కుదుర్చుకోనున్నందున...

Published date : 03 Jul 2021 01:25PM