జూన్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
‘ఛాగోస్’పై మారిషస్‌కు భారత్ మద్దతు
ఛాగోస్ ఆర్చిపెలాగో ద్వీపంపై మారిషస్-బ్రిటన్ మధ్య ఏర్పడిన వివాదాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి తీసుకెళ్లాలనే నిర్ణయానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. దీనిపై ఐరాస సర్వప్రతినిధుల సభలో జూన్ 22న ప్రవేశపెట్టిన తీర్మానం 94-15 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.
యూన్ ఆర్థిక, సామాజిక కౌన్సిల్‌కు మళ్లీ ఎన్నికైన భారత్
ఐరాస ఆధ్వర్యంలోని ఆర్థిక, సామాజిక కౌన్సిల్ (ECOSOC)కు భారత్ మళ్లీ ఎన్నికైంది. ఈ మేరకు జూన్ 15న జరిగిన ఓటింగ్‌లో భారత్‌కు 183 ఓట్లు వచ్చాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జపాన్ తర్వాత భారత్‌కు అత్యధిక ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలో భారత్‌తో కలిపి మొత్తం 18 దేశాలు ఎన్నికయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈసీఓఎస్‌ఓసీకు ఎన్నికైన 18 దేశాలు
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : మరోసారి ఎన్నికైన భారత్
ఎక్కడ : ఐరాస అనుబంధ సంస్థ
భారత్ - పోర్చుగల్ మధ్య 11 ఒప్పందాలు
మూడు దేశాల(పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్)పర్యటనలో భాగంగా జూన్ 24న పోర్చుగల్ చేరుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టాతో అంతరిక్షం, పర్యావరణంతో పాటుగా ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై విసృ్తతంగా చర్చలు జరిపారు. అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలు జరిపేందుకు 4 మిలియన్ యూరోల (దాదాపు రూ.28.8 కోట్లు)తో సంయుక్త నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ఇరుదేశాల మధ్య 11 ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐరాసలో భారత శాశ్వత సభ్యత్వానికి సంపూర్ణ మద్దతుంటుందని ఆంటోనియో వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - పోర్చుగల్ మధ్య 11 ఒప్పందాలు
ఎప్పుడు : జూన్ 24
ఎవరు: మోదీ - ఆంటోనియో కోస్టా
ఎక్కడ : పోర్చుగల్
ఎందుకు : మోదీ పోర్చుగల్ పర్యటనలో భాగంగా
ఉగ్రవాదంపై అమెరికా-భారత్ సంయుక్త పోరాటం
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జూన్ 26న ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మానవాళికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని అంతం చేయటంతోపాటు పలు ద్వైపాక్షిక అంశాల్లో మరింత పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు.
ఉగ్రవాదంపై పోరులో..
ముంబై దాడులు, పఠాన్‌కోట్ ఘటనలో దోషులపై పాకిస్తాన్ కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటాన్ని మానుకోవాలని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు. దీంతో పాటుగా వాణిజ్యం,ఆర్థికాభివృద్ధితోపాటు రక్షణ, భద్రత రంగాల్లో వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంతోపాటు ఎన్‌ఎస్‌జీ, వాసెనార్, ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత సభ్యత్వానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకై
ఉగ్రవాదం వల్ల అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న అస్థిరతపైనా మోదీ, ట్రంప్ చర్చించారు. ఆ దేశంలో శాంతి, స్థిరత్వం వచ్చేందుకు కలిసి కృషి చేయాలని నిర్ణయించారు. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం, స్థిరత్వం, భద్రతను పరిరక్షించేందుకు భారత్ తీసుకుంటున్న చొరవనూ ట్రంప్ ప్రశంసించారు. భారత ‘థింక్ వెస్ట్’ విధానానికి అనుగుణంగా మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన చర్చలు జరిపి ఆయా దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇటీవల ఉత్తరకొరియా చేపడుతున్న విధ్వంసక క్షిపణుల ప్రయోగాలు సవాలుగా మారాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉ.కొరియాపై ఆంక్షలు విధించే విషయంలో అమెరికాకు మద్దతు తెలిపిన భారత్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
వ్యూహాత్మక భాగస్వామ్యాలు
భారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తింపు దిశగా మరింత సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. అత్యాధునిక రక్షణ పరికరాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉన్న దేశాలతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగానే సముద్రనిఘా కోసం 20 మానవరహిత వాయు భద్రత వ్యవస్థ (గార్డియన్ డ్రోన్‌స) ను భారత్‌కు అమ్మాలని నిర్ణయించింది. సముద్రతీరంలో భద్రత కోసం ‘వైట్ షిప్పింగ్’డేటాను మార్పిడి చేసుకోవాలని కూడా మోదీ-ట్రంప్ నిర్ణయించారు. దీని ద్వారా సముద్రతీరంలో సంయుక్తంగా భద్రతను పర్యవేక్షించేందుకు వీలుంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు
ఎప్పుడు : జూన్ 26
ఎక్కడ : వాషింగ్టన్
ఎందుకు : ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా
భారత్ - నెదర్లాండ్స్ మధ్య 3 ఒప్పందాలు
అమెరికా పర్యటన తర్వాత జూన్ 27న ఐరోపా దేశం నెదర్లాండ్స్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని మార్క్ రూట్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక భద్రత, నీటి సహకారం, సంస్కృతీ సహకారాలకు సంబంధించిన 3 అవగాహనా ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. భారత్‌కు క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో సభ్యత్వం దక్కడంలో మద్దతు ఇచ్చినందుకు నెదర్లాండ్‌సకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మోదీ డచ్ కంపెనీల సీఈవోలతో సమావేశమై తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్‌లో వ్యాపారం చేయడం సులభమైందన్నారు. భారత్‌లో వాణిజ్య ప్రమాణాలు ప్రపంచ దేశాలతో సమానంగా ఉన్నాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - నెదర్లాండ్స్ మధ్య 3 ఒప్పందాలు
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: ప్రధాని మోదీ - నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్
ఎక్కడ : నెదర్లాండ్స్
నల్లధనం వెల్లడికి స్విట్జర్లాండ్ ఆమోదం
నల్లధనం వివరాల్ని భారత్‌తో పంచుకునేలా ఆటోమెటిక్ సమాచార మార్పిడి ఒప్పందాన్ని (Automatic Exchange Financial Account) జూన్ 16న స్విట్జర్లాండ్ ఖరారు చేసింది. ఈ ఒప్పందంతో ఎటువంటి వివరాలనైనా భారత్ సులువుగా పొందనుంది. 2018 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా తొలి దశ వివరాల్ని 2019లో భారత్‌తో పంచుకునే అవకాశం ఉంది. దీంతో.. స్విస్ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలు బహిర్గతం కానున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏఈఓఐ ఒప్పందానికి ఆమోదం
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : స్విట్జర్లాండ్
ఎందుకు : నల్లధనం వివరాలను భారత్‌తో పంచుకునేందుకు
భారత్-మయన్మార్ సరిహద్దు పరిశీలనకు కమిటీ
భారత్ - మయన్మార్‌ల సరిహద్దు ద్వారా జరుగుతోన్న స్వేచ్ఛాయుత రాకపోకల పరిశీలనకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుతం కేంద్ర అంతర్గత భద్రత శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రీనా మిత్రాను చైర్మన్‌గా నియమించింది.
మయన్మార్‌తో భారత్‌కు 1,643 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. ఆ దేశంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో సరిహద్దు వెంట రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఈ స్వేచ్ఛాయుత నిబంధనలను కొందరు పౌరులు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత నియమ నిబంధనలను మరోసారి పరిశీలించేందుకు కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదే అంశానికి సంబంధించి 2015లో ఆర్. ఎన్. రవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన జాయింట్ ఇంటలిజెన్స్ కమిటీ.. మయన్మార్ వెంట ఉన్న సరిహద్దు నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదించింది. మొత్తం సరిహద్దు వెంట కాకుండా కేవలం కొన్ని గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పోలీసుల పర్యవేక్షణలో రాకపోకలను అనుమతించాలని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రీనా మిత్రా కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : భారత్ - మయన్మార్ సరిహద్దు అధ్యయనానికి
సియోల్‌లో 5వ భారత్- కొరియా ఆర్థిక సదస్సు
మౌలిక సదుపాయాల అభివృద్ధి, ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి సంబంధించి భారత్, దక్షిణ కొరియాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన భారత్-కొరియా 5వ ఆర్థిక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, దక్షిణ కొరియా ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి కిమ్ డాంగ్-యెన్‌ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అభివృద్ధికి 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతో పాటు 9 బిలియన్ డాలర్ల రాయితీతో కూడిన రుణాలను కొరియా అందించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-కొరియా 5వ ఆర్థిక సదస్సు
ఎప్పుడు : జూన్ 14
ఎక్కడ : సియోల్, కొరియా
ఎందుకు : భారత్‌కు 10 బిలియన్ డాలర్ల కొరియా సాయంపై ఒప్పందం
సోమాలియాతో ఖైదీల బదిలీ ఒప్పందానికి ఆమోదం
భారత్, సోమాలియా మధ్య జరిగిన శిక్ష పడ్డ ఖైదీల పరస్పర మార్పిడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ జూన్ 7న ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందానికి అంగీకారం తెలపడంతోపాటు ద్వైపాక్షిక ఆమోదానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖైదీల బదిలీ ఒప్పందం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : భారత్, సోమాలియా
భారత్ - స్పెయిన్ మధ్య 7 ఒప్పందాలు
ఉగ్రవాదంపై పోరాటంతో పాటు వివిధ రంగాల్లో భారత్ - స్పెయిన్ పరస్పర సహకారంతో ముందుకెళ్లనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ దేశ పర్యటనలో భాగంగా మే 31న స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల మధ్య 7 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి.
శిక్షపడ్డ ఖైదీల పరస్పర మార్పిడి, దౌత్యపరమైన పాస్‌పోర్ట్ ఉన్నవారికి వీసా రద్దు, అవయవ మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక శక్తి, పౌర విమానయాన, దౌత్య సేవల రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ స్పెయిన్ మధ్య 7 ఒప్పందాలు
ఎప్పుడు : మే 31
ఎక్కడ : మాడ్రిడ్, స్పెయిన్
ఎవరు : భారత ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్
భారత్‌లో ఎఫ్-16 జెట్స్ తయారీ ఒప్పందం
అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్‌సడ్ సిస్టమ్స్(టీఏఎస్‌ఎల్), అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు జూన్ 19న ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిస్ ఎయిర్‌షో సందర్భంగా కంపెనీలు ఈ విషయాన్ని వెల్లడించాయి. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చే ఈ డీల్ ప్రకారం లాక్‌హీడ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్ వర్త్‌లో ఉన్న ప్లాంటు కార్యకలాపాలను భారత్‌కు తరలించనుంది. టీఏఎస్‌ఎల్ ఇప్పటికే లాక్‌హీడ్‌కి చెందిన సీ-130 జే ఎయిర్‌లిఫ్టర్, ఎస్ - 92 హెలికాప్టర్‌లకు ఎయిర్‌ఫ్రేమ్ విడిభాగాలు అందజేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీఏఎస్‌ఎల్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థల ఒప్పందం
ఎప్పుడు : జూన్ 19
ఎక్కడ : పారిస్ ఎయిర్‌షోలో
ఎందుకు : భారత్‌లో ఎఫ్-16 జెట్స్ తయారీ కోసం

Published date : 16 Sep 2017 03:11PM