Skip to main content

S Jaishankar: ప్రస్తుతం ఇజ్రాయెల్‌ అధ్యక్షునిగా ఎవరు ఉన్నారు?

S Jaishankar

భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇజ్రాయెల్‌లో తన ఐదు రోజుల పర్యటనను అక్టోబర్‌ 17న ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్, ప్రధాని నాఫ్తాలి బెన్నెట్‌తో చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు, దైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉన్న రంగాలను అన్వేషిస్తారు. అక్టోబర్‌ 17న ఆయన రక్షణ సహా వివిధ రంగాలకు చెందిన ఇజ్రాయెల్‌ వాణిజ్యవేత్తలతో సమావేశమై భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.

బంగ్లాదేశ్‌లో మత కలహాలు


దుర్గాపూజల సందర్భంగా దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి. అక్టోబర్‌ 16న దుండగులు మున్షిగంజ్‌లోని కాళీ మందిరంలోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారని వార్తా సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ అధ్యక్షునిగా అబ్దుల్‌ హమీద్, ప్రధానిగా షేక్‌ హసీనాఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇజ్రాయెల్‌ పర్యటన ప్రారంభం
ఎప్పుడు  : అక్టోబర్‌ 17
ఎవరు    : భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ 
ఎందుకు : వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్, ప్రధాని నాఫ్తాలి బెన్నెట్‌తో చర్చలు జరిపేందుకు...

చ‌ద‌వండి: అరుణాచల్‌లో ఉపరాష్ట్రపతి పర్యటనపై అభ్యంతరం తెలిపిన దేశం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Oct 2021 06:15PM

Photo Stories