Military Talks: భారత్, చైనా 14వ కమాండర్ స్థాయి చర్చలు ఎక్కడ జరిగాయి?
తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో భారీగా మోహరించిన ఇరు దేశాల బలగాల ఉపసంహరణపై భారత్, చైనా కమాండర్ స్థాయి అధికారుల 14వ రౌండ్ చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ వెంట చైనా వైపు ఉన్న చుషుల్–మోల్డో సమావేశ ప్రాంతంలో జనవరి 12న ఈ చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి (పెట్రోలింగ్ పాయింట్ 15) సాధ్యమైనంత త్వరగా చైనా బలగాలు వెనక్కి మళ్లాలని ఈ సందర్భంగా భారత్ గట్టిగా డిమాండ్ చేసింది.
రవి దహియా చేతుల మీదుగా క్వీన్స్ బ్యాటన్ రిలే
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, స్టార్ రెజ్లర్ రవి దహియాకు చక్కని గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్–2022కు ముందు జరిగే క్వీన్స్ బ్యాటన్ రిలేను జనవరి 12న భారత్‌లో రవి ప్రారంభించాడు. 2022, జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి.
చదవండి: ప్యాంగాంగ్ త్సో సరస్సులో వంతెనను నిర్మించిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, చైనా 14వ కమాండర్ స్థాయి చర్చలు ఎక్కడ జరిగాయి?
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : భారత్, చైనా సైన్యధికారులు
ఎక్కడ : వాస్తవాధీన రేఖ వెంట చైనా వైపు ఉన్న చుషుల్–మోల్డో సమావేశ ప్రాంతం
ఎందుకు : తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో భారీగా మోహరించిన ఇరు దేశాల బలగాల ఉపసంహరణపై చర్చించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్