Free Trade Agreement: ఏ రెండు దేశాల మధ్య ఎఫ్‌టీఏ చర్చలు ప్రారంభమయ్యాయి?
ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారత్, బ్రిటన్ మధ్య చర్చలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జనవరి 13న న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్, బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి యానీ–మేరీ ట్రెవిల్యాన్ వీటిని ప్రారంభించారు. తొలి విడత చర్చలు పూర్తి స్థాయిలో 2022, జనవరి 17 నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ప్రతి అయిదు వారాలకోసారి ఇరు దేశాల బృందాలు సమావేశమవుతాయి. 2022 డిసెంబర్ నాటికి చర్చలను ముగించాల్సి ఉంటుంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు తోడ్పడటం ఈ ఒప్పంద లక్ష్యం.
8.15 బిలియన్ డాలర్ల ఎగుమతులు..
2020–21లో భారత్ నుంచి బ్రిటన్‌కు ఎగుమతులు 8.15 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 4.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రెడీమేడ్ గార్మెంట్స్, టెక్స్‌టైల్స్, రత్నాభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, రవాణా పరికరాలు, సుగంధ ద్రవ్యాలు, ఫార్మా మొదలైనవి భారత్ ఎగుమతి చేస్తోంది. బ్రిటన్ నుంచి రసాయనాలు, భారీ యంత్రాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు మొదలైనవి దిగుమతి చేసుకుంటోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారత్, బ్రిటన్ మధ్య చర్చలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్, బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి యానీ–మేరీ ట్రెవిల్యాన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్