ఏప్రిల్ 2020 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
చైనా ర్యాపిడ్ కిట్లు వెనక్కి పంపండి: ఐసీఎంఆర్
కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం చైనా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను ఉపయోగించవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలిపింది. వాటికి వెనక్కి పంపించాలని ఏప్రిల్ 27న సూచించింది. వాటిని తాము చైనాకు తిరిగి పంపుతామని పేర్కొంది. చైనాలోని గాంగ్‌జౌ వోండ్‌ఫో బయోటెక్, ఝూజై లివ్‌సన్ డయాగ్నోస్టిక్స్ అనే రెండు సంస్థల నుంచి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను భారత్ కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటి నాణ్యత, పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కిట్లు కచ్చితమైన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కిట్ల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. వాటిని వెనక్కి పంపాలని రాష్ట్రాలను ఆదేశించింది.
ఇండోనేసియా అధ్యక్షుడితో మోదీ చర్చలు
కరోనా ఉత్పాతంపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చించినట్టు ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 28న ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉత్పన్నమవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్, ఇండోనేషియా మధ్య సన్నిహిత సహకారం అవసరమని మోదీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభ సమయంలో ఇరుదేశాల మధ్య ఔషధ ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం కలగకుండా భారత్ తనవంతు కృషి చేస్తుందని ఇండోనేషియా అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఉపయోగపడతాయని ప్రధాని వ్యాఖ్యానించారు.
వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ ఏప్రిల్ 28న తెలిపారు. అందుకు రూ.2,600 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చలు
ఎప్పుడు: ఏప్రిల్ 28
ఎవరు: ప్రధాని నరేంద్రమోదీ
ఎందుకు: కరోనా ఉత్పాతంపై చర్చించేందుకు
భారత పీఎంవోను అన్‌ఫాలో చేసిన వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్విట్టర్’లో భారత ప్రధాని మోదీతో స్నేహానికి ముగింపు పలికారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్ ట్విట్టర్‌లో మోదీని అన్‌ఫాలో చేసింది. రాష్ట్రపతి కోవింద్‌ను, ప్రధాని కార్యాలయం(పీఎంవో), అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని అనుసరించడం మానేసింది. కొన్ని రోజుల క్రితం వరకు మోదీసహా 19 మంది భారతీయులను ట్విట్టర్‌లో ఫాలో అయ్యేది. తాజాగా ఆ సంఖ్య 13కు పడిపోయింది. ఈ 13 మంది అమెరికా పరిపాలనతో సంబంధం ఉన్న భారతీయులు. వైట్‌హౌస్ ట్విట్టర్ ఖాతాను 2.1కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. మూడు వారాల క్రితం మోదీ వైట్‌హౌస్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న తొలి ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి వైట్‌హౌస్ మోదీ ట్విట్టర్ ఖాతాను అనుసరించడం ప్రారంభించింది.
వైట్‌హౌస్ వివరణ
ట్విటర్ ఖాతా ఆన్‌ఫాలోకు సంబంధించి ఏప్రిల్ 30న వైట్‌హౌస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు పర్యటించే దేశాలకు చెందిన దేశాధినేతల అధికారిక ట్విటర్ ఖాతాలను వైట్‌హౌస్ అనుసరించడం సాధారణంగా జరుగుతుంటుందని తెలిపాయి. అధ్యక్షుడి పర్యటనకు మద్దతుగా.. వారి ట్విట్స్ ను రీట్విట్ చేసేందుకు కొద్దికాలం పాటు మాత్రమే ఆ ఖాతాలను ఫాలో అవనున్నట్టు వెల్లడించాయి.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2020, ఫిబ్రవరి చివరి వారంలో భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.
హాలీవుడ్ సంస్థ ఎస్‌టీఎక్స్‌తో ఏరోస్ విలీనం
కోవిడ్ -19 మహమ్మారి విస్తరణతో ప్రపంచ మార్కెట్లలో మొత్తం సినిమా నిర్మాణ రంగం సంక్షోభంలో వుండగా హాలీవుడ్‌కు చెందిన ఎస్‌టీఎక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీనం అవుతున్నట్టు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ ఏప్రిల్ 18న ప్రకటించింది. మొత్తం షేర్ల రూపంలో ఈ విలీనం జరగనుంది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఎస్‌టిఎక్స్ సంస్థ ఇప్పటికే హాలీవుడ్‌లో 34 సినిమాలు నిర్మించింది. ఇందులో హస్లర్స్, బాడ్ మామ్స్ సినిమాలు రెండూ కలిసి 1.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.10,500 కోట్లు) గ్రాస్‌ను వసూలు చేశాయి.
సీఈఓగా రాబర్ట్..
11 సంవత్సరాల క్రితం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ కరోనా వైరస్ కాలంలో కొత్త అవతారాన్ని దాల్చింది. బద్లాపూర్, బజరంగీ భైజాన్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలను నిర్మించిన ఏరోస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో హాలీవుడ్ కంపెనీతో కలిసి ఈరోస్ ఎస్టీఎక్స్ గ్లోబల్ కార్పొరేషన్ పేరుతో గ్లోబల్ సంస్థగా అవతరించింది. అలాగే రెండు కంపెనీల విలీనం తరువాత కంపెనీ ఫౌండర్ ప్రస్తుత సీఈఓ కిషోర్ లుల్లా ఎగ్జిక్యూటివ్ కో-చైర్మన్‌గా, ఎస్‌టిఎక్స్ సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ సిమండ్‌స కొత్త కంపెనీకి సీఈఓగా వ్యవహరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హాలీవుడ్ సంస్థ ఎస్‌టీఎక్స్‌తో విలీనం
ఎప్పుడు: ఏప్రిల్ 18
ఎవరు : బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్
ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లో భారత జాతీయ పతాకం
కరోనాపై పోరులో భారత్‌కు స్విట్జర్లాండ్ వినూత్న రీతిలో సంఘీభావం తెలిపింది. భారతీయుల్లో విశ్వాసం పాదుకొల్పి, నైతిక స్థైర్యం అందించేందుకు ప్రఖ్యాత
ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లో ఒకటైన మాటర్‌హార్న్ పర్వతంపై ఇలా మువ్వన్నెల కాంతులను ప్రసరింపజేసింది. స్విస్ కళాకారుడు గెర్రీ హాఫ్స్‌టెటర్ 4,478 మీటర్ల ఎత్తైన మాటర్‌హార్న్ పర్వత శిఖరంపై భారత జాతీయ పతాకంతో కూడిన కాంతులను ప్రసరింపజేశారు. స్విస్ సంఘీభావంపై ప్రధాని మోదీ ఏప్రిల్ 18న ట్విట్టర్‌లో స్పందించారు. కరోనాపై యావత్ ప్రపంచం కలసికట్టుగా పోరాడుతోందని, ఈ మహమ్మారిపై మానవజాతి విజయం సాధించి తీరుతుందని ట్వీట్ చేశారు.
అక్టోబర్ నాటికి వ్యాక్సిన్: ఆక్స్‌ఫర్డ్
2020, మే నెలలోపు 500 మందిపై కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు. 18- 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షించనున్నారు. 2020 అక్టోబర్ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యాన్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో 1994 నుంచి గిల్బర్ట్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. నావెల్ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ పరిశోధనకు గిల్బర్ట్‌కి, బ్రిటన్‌కి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్, యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సంస్థలు మార్చిలో 28 లక్షల డాలర్ల గ్రాంటుగా ఇచ్చాయి. ఇమ్యునైజేషన్ దశ నుంచి క్లినికల్ ట్రయల్స్ దశకు వచ్చిన ప్రయోగాల్లో గిల్బర్ట్ బృందం ప్రయోగం మొదటిది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లో భారత జాతీయ పతాకం
ఎప్పుడు:ఏప్రిల్ 18
ఎవరు : స్విస్ కళాకారుడు గెర్రీ హాఫ్స్‌టెటర్
ఎక్కడ:మాటర్‌హార్న్ పర్వతం, ఆల్‌పస్ పర్వతశ్రేణులు
ఎందుకు: కరోనాపై పోరులో భారత్‌కు వినూత్న రీతిలో సంఘీభావం
చైనా తాజా మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్
భారత్‌లో భాగమైన అరుణాచల్‌ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమని పదే పదే వివాదాస్పద ప్రకటనలు చేస్తున్న చైనా తాజాగా విడుదల చేసిన మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను టిబెట్‌లో భాగంగా చూపింది. ఈ మేరకు డిజిటల్ మ్యాప్‌లకు సంబంధించి చైనా అధికారిక సంస్థ స్కై మ్యాప్ నవీకరించిన మ్యాప్‌ను విడుదలచేసింది. స్కై మ్యాప్ బీజింగ్ నేషనల్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ జియోగ్రఫిక్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 1951లో టిబెట్‌ను ఆక్రమించిన చైనా.. అరుణాచల్‌ప్రదేశ్ కూడా అందులో భాగమని వాదిస్తూ వస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనా తాజా మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : చైనా అధికారిక సంస్థ స్కై మ్యాప్
అధునాతన మిస్సైళ్ల విక్రయానికి అమెరికా ఆమోదం
భారత్‌కు 155 మిలియన్ డాలర్ల విలువైన హార్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్‌డ్ మిసైళ్లు, తేలికపాటి టోర్పిడోలు విక్రయించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిస్సైళ్ల విక్రయానికి ఏప్రిల్ 13న అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే 10 ఏజీఎం -84ఎల్ హార్పూన్ బ్లాక్-2 ఎయిర్ లాంచ్ మిస్సైల్స్, 16 ఎంకేఈ 54 లైట్‌వెయిట్ టోర్పిడోలు, మూడు ఎంకే 54 ఎక్సర్‌సైజ్ టార్పిడోలు భారత్ కు రానున్నాయి. భారత్‌కు ప్రాంతీయంగా తలెత్తే ముప్పును తిప్పికొట్టడానికి ఈ ఆయుధాలు ఉపయోగపడనున్నాయి. విమానాల నుంచి ప్రయోగించే హార్పూన్ క్షిపణులను శత్రు నౌకల విధ్వంసానికి ఉపయోగిస్తారు. వీటిని భారత నౌకాదళంలోని పి-8ఐ విమానాల్లో అమరుస్తారు. శత్రు జలాంతర్గాముల విధ్వంసానికి ఉపయోగపడే ఎంకే 54 టోర్పిడోలను రేథియాన్ కంపెనీ తయారుచేస్తోంది. హార్పూన్ క్షిపణులను బోయింగ్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్‌కు అధునాతన మిస్సైళ్ల విక్రయానికి ఆమోదం
ఎప్పుడు: ఏప్రిల్ 13
ఎవరు: అమెరికా ప్రభుత్వం

చైనా నుంచి భారత్‌కు 6.5లక్షల మెడికల్ కిట్లు
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా చైనా నుంచి భారత్‌కు 6.5లక్షల మెడికల్ కిట్లు, వైద్య సామగ్రి ఏప్రిల్ 16న బయలుదేరిందని బీజింగ్‌లోని భారత రాయభారి విక్రమ్ మిశ్రీ పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో మరో 20 లక్షల వైద్యసామగ్రి భారత్‌కు చేరుకోనుందని తెలిపారు. రాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లు, ఆర్‌ఎన్‌ఏ టెస్టింగ్ కిట్లు గ్వాన్‌గ్జూ విమానాశ్రయం నుంచి భారత్‌కు బయలుదేరాయని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత్‌లో ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో హాట్ స్పాట్లలో ప్రత్యేకంగా పరీక్షలను వేగవంతం చేయడానికి చైనా నుంచి దిగుమతి చేసుకున్న వైద్యసామగ్రి ఉపయోగపడనుంది.
అదొక్కటే మార్గం: యూఎన్ చీఫ్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. 2020 ఏడాది చివరి నాటికి కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలైన పలు ఆఫ్రికా దేశాల ప్రతినిధులతో ఏప్రిల్ 15న ఆయన వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుటెరస్ పై వ్యాఖ్యలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనా నుంచి 6.5లక్షల మెడికల్ కిట్లు దిగుమతి
ఎప్పుడు: ఏప్రిల్ 16
ఎవరు: భారత్
ఎందుకు: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు
ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ కట్టడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 4న ఫోన్ లో చర్చించారు. కరోనాపై యుద్ధం చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు సహకరించుకోవాలని మోదీ, ట్రంప్ నిర్ణయించారు. ప్రపంచ దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న ఈ సమయంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగ, ఆయుర్వేద వైద్య విధానం ప్రాముఖ్యతపైన కూడా ఇద్దరు నేతలు చర్చించారు. కోవిడ్-19 రోగులకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల్ని అమెరికా పంపించాలని మోదీని ట్రంప్ కోరారు.
క్లోరోక్విన్‌పై నిషేధం
మలేరియా వ్యాధిని అరికట్టే క్లోరోక్విన్ టాబ్లెట్లు కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో సత్ఫలితాలు చూపిస్తున్నాయని భావిస్తూ ఉండడంతో అమెరికా కొన్నాళ్ల క్రితమే భారత్‌కి ఆర్డర్ పెట్టుకుంది. భారత్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువ కావడంతో క్లోరోక్విన్ ఎగుమతుల్ని ఏప్రిల్ 4న భారత్ నిషేధించింది. దీంతో ట్రంప్ ఫోన్ చేసి మోదీతో మాట్లాడారు. తమ కంపెనీలు ఆర్డర్ చేసిన క్లోరోక్విన్ మాత్రల్ని పంపాలని విజ్ఞప్తి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ లో చర్చలు
ఎప్పుడు: ఏప్రిల్ 4
ఎవరు: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు: కరోనా వైరస్ కట్టడిపై చర్చించేందుకు
భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోసులు
కోవిడ్-19 పేషెంట్లకు వినియోగించేందుకు భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోస్‌లను కొనుగోలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ‘భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపగలరా? అని అడిగాను. ఆయన చాలా గొప్పవాడు. చాలా మంచివాడు’ అని ఫాక్స్ న్యూస్‌తో ఏప్రిల్ 8న ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేసేందుకు భారత్ ఏప్రిల్ 7న అంగీకరించిన విషయం తెలిసిందే.

Published date : 06 May 2020 10:29PM