Champions of the Earth: అస్సాం పర్యావరణవేత్త పూర్ణిమకు ఐరాస అవార్డు
Sakshi Education
అస్సాంకు చెందిన పూర్ణిమా దేవి బర్మన్‌కు 2022 సంవత్సరానికి గాను ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ వరించింది.
అంతరించిపోతున్న హర్గిలా అనే పక్షి జాతిని కాపాడేందుకు ఈమె ‘హర్గిలా ఆర్మీ’ పేరుతో మహిళా గ్రూపును తయారు చేశారు. అటవీ జీవశాస్త్రవేత్త అయిన బర్మన్ రెండు దశాబ్దాలుగా చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రాం(యూఎన్‌ఈపీ) మంగళవారం తెలిపింది. గ్రీన్ ఆస్కార్‌గా పిలుచుకునే ఈ అవార్డును బర్మన్, యూకేకు చెందిన సర్ పార్థా దాస్‌గుప్తా, పెరూ, లెబనాన్, కామెరూన్ దేశాల ఉద్యమకారులకు ఐరాస ప్రకటించింది.
అస్సామీ కవి నీలమణి ఫూకాన్‌కు 56వ Jnanpith Award
Published date : 23 Nov 2022 01:52PM