Skip to main content

NMDC: కొల్లాటరల్‌ అవార్డును కైవసం చేసుకున్న ప్రభుత్వం సంస్థ?

NMDC Award

అఖిల భారత కార్పొరేట్‌ కొల్లాటరల్‌ అవార్డు–2021ను జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) కైవసం చేసుకుంది. కమ్యూనికేషన్స్‌ రంగంలో చేసిన విశేషకృషిగాను ఈ అవార్డు దక్కింది. పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌సీఐ) గోవాలోని వెల్హా గోవాలో నిర్వహించిన గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ కాన్‌క్లేవ్‌లో ఈ అవార్డును గోవా సాంస్కృతిక శాఖమంత్రి గోవింద్‌గౌడ్‌ చేతుల మీదుగా ఎన్‌ఎండీసీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాధిపతి జయప్రకాశ్‌ సెప్టెంబర్‌ 20న అందుకున్నారు. మొత్తంగా ఎన్‌ఎండీసీకి 13 విభాగాల్లో అవార్డులు దక్కాయి.

ఏయూ విద్యార్థికి ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ పురస్కారం

ఆంధ్ర విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం విద్యార్థి ధనియాల సాయి జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) జాతీయ ఉత్తమ వలంటీర్‌గా ఎంపికయ్యాడు. 2019–20 సంవత్సరానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డుకు సాయి ఒక్కరే ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా 30 మందికి అవార్డులు ప్రకటించగా.. సాయి ద్వితీయ స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్‌ 24న జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సాయి ఈ అవార్డును అందుకోనున్నారు.

చ‌ద‌వండి: సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన రచయిత?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అఖిల భారత కార్పొరేట్‌ కొల్లాటరల్‌ అవార్డు–2021ను కైవసం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 18
ఎవరు    : జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)
ఎక్కడ    : వెల్హా గోవా, నార్త్‌ గోవా జిల్లా, గోవా రాష్ట్రం
ఎందుకు  : కమ్యూనికేషన్స్‌ రంగంలో చేసిన విశేషకృషిగాను... 

 

Published date : 21 Sep 2021 03:46PM

Photo Stories