Mission Bhageeratha కు జలజీవన్ పురస్కారం
Sakshi Education
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ పురస్కారం లభించింది.
గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ తాగునీరు అందిస్తున్నందుకుగాను కేంద్రం తెలంగాణను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అక్టోబర్ 2 ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావులు జలజీవన్ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణలోని 53,86,962 గృహాలకు 100% నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. కవరేజీ కనెక్షన్ల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ర్యాంక్–1గా నిలిచింది.
Published date : 03 Oct 2022 08:44PM