Skip to main content

Major Radhika Sen: భారత ఆర్మీ అధికారిణికి యూఎన్‌ అవార్డు.. ఈమె ఎవ‌రో తెలుసా..?

భారత ఆర్మీ అధికారిణికి ఐక్యరాజ్యసమితికి చెందిన‌ అత్యున్నత గౌరవం లభించింది.
Indian Peacekeeper Major Radhika Receives UN Military Gender Advocate of the Year Award

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకుగానూ భారత ఆర్మీ అధికారిణి మేజర్ రాధికా సేన్ 2023లో ప్రతిష్టాత్మకమైన "మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్" అవార్డును అందుకున్నారు. మహిళలు, బాలికల హక్కుల కోసం ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా ఆమె చేసిన అద్భుత కృషికి గాను ఈ అవార్డును అందించడం జరిగింది.

మే 29వ తేదీ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాధికా సేన్‌కు ఈ అవార్డును అందించడం జరిగింది. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణలు, లైంగిక హింసకు గురైన బాలికలను రక్షించడానికి ఆమె చేసిన కృషిని ఈ అవార్డు గుర్తించింది.

ఎవరీ రాధిక సేన్‌..?
★ హిమచల్‌ప్రదేశ్‌లో జన్మించిన రాధికా సేన్‌ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌లో వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. 
అలా సేన్‌ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆతర్వాత ఆమె ఏప్రిల్‌ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌తో ఎంగేజ్‌మెంట్ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేశారు.

Jyoti Ratre: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అత్యంత వృద్ధురాలిగా రికార్డు!!

★ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్ నిలిచారు. సేన్ కంటే ముందు, మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్‌లోని యుఎన్‌ మిషన్‌తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్‌ సుమన్‌కి ఈ అత్యున్నత గౌరవం లభించింది. 

★ యూఎన్‌ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మోహరించిన దాదాపు 6,603 మంది భారతీయ సిబ్బందిలో సేన్‌  యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తరుఫున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పనిచేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఆమె పని మహిళలు ఏకం చేసేలా.. సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం. 

★ యూఎన్‌ ప్రకారం.. సేన్‌ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో(డీఆర్‌సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె కమ్యూనిటీలకు సహాయం చేస్తూ.. కమ్యూనిటీ అలర్ట్‌ నెట్‌వర్క్‌లను కూడా స్థాపించారు.

Kaamya Karthikeyan: శెభాష్‌.. 16 ఏళ్లకే ఎవరెస్ట్‌ను అధిరోహించిన కామ్య కార్తికేయన్‌!

Published date : 30 May 2024 01:12PM

Photo Stories