Global Teacher prize 2021: ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజు పోటీలో నిలిచిన హైదరాబాదీ?
హైదరాబాద్‌కు చెందిన మేఘనా ముసునూరితో పాటు బిహార్‌కు చెందిన టీచర్ సత్యం మిశ్రా 2021 ఏడాది ప్రైజ్ రేసులో ఉన్నారు. ప్రైజు విలువ రూ.7.35 కోట్లు. యూనెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్ ఈ బహుమతిని అందిస్తుంది. ఫౌంటేన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఛైర్ పర్సన్‌గా మేఘన వ్యవహరిస్తున్నారు.
ఈ–శ్రమ్ పోర్టల్ ప్రారంభం
అసంఘటిత రంగ కార్మికులకు పలు ప్రయోజనాలు అందేంచేందుకు ఉద్దేశించింన ‘ఈ–శ్రమ్ పోర్టల్’ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. పోర్టల్‌లో అసంఘటిత రంగ కార్మికులు పేరు నమోదు చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని మంత్రి రామేశ్వర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే 27 లక్షల మంది అసంఘటితరంగ కార్మికులు పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజు పోటీలో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : మేఘనా ముసునూ, సత్యం మిశ్రా
ఎందుకు : విద్యా రంగంలో విశేష కృషి చేసినందుకు...