EESL: ప్రభుత్వరంగ సంస్థ 'ఈఈఎస్ఎల్'కు ప్రతిష్టాత్మక అవార్డు
Sakshi Education
కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ 'ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)'కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 2023-245 గాను ఈఈఎస్ఎల్‌కు 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం అందజేసింది. సీఐఐ 25వ రజతోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేసినట్లు ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు.
ఉజాలా పథకంతోపాటు దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో విజయవంతంగా ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేసినందుకు గాను ఈఈఎస్ఎల్‌ను ఈ ఆవార్డు వరించినట్లు ఆయన వెల్లడించారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సెక్రటరీ మిలింద్ దేవరా చేతుల మీదుగా ఈఈఎస్ఎల్ తరఫున ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ అనిమేష్ మిశ్రా, జనరల్ మేనేజర్ గిరిజా శంకర్ అవార్డును అందుకున్నారు.
National Energy Leader Award: విశాఖ స్టీల్ ప్లాంటు నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు
Published date : 16 Sep 2024 12:25PM
Tags
- Energy Efficiency Services Limited
- 25th anniversary of CII awards
- Bureau of Energy Efficiency
- CII Awards
- Confederation of Indian Industry
- 25th Silver Jubilee Anniversary
- Public Sector Undertakings
- Animesh Mishra
- Sakshi Education Updates
- CII Impact Player of the Year
- EESL award Hyderabad
- A. Chandrasekhara Reddy CII
- CII Silver Jubilee
- EESL Southern States Adviser
- CII 25th Anniversary
- EESL Recognition
- sakshieducationlatest news