ఆగష్టు 2019 అవార్డ్స్
Sakshi Education
ప్రొఫెసర్ భాగ్యలక్ష్మికి నేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు
ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గంజి భాగ్యలక్ష్మికి నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఢిల్లీలో ఆగస్టు 22న నిర్వహించిన జాతీయ విద్యా, వాణిజ్య సదస్సులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు వారి మానసిన సామర్థ్యం పెంపొందేలా కృషి చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : ప్రొఫెసర్ గంజి భాగ్యలక్ష్మి
ఇస్రో చైర్మన్ శివన్‌కు అబ్దుల్ కలాం అవార్డు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చెర్మన్ డాక్టర్ కై లాసవాడివో శివన్‌కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం అవార్డును ప్రధానం చేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని సచివాలయంలో ఆగస్టు 22న జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల మీదుగా.. శివన్ ఈ అవార్డును అందుకున్నారు. 8 గ్రాముల బంగారు పతకం, రూ.ఐదు లక్షల నగదుతోపాటు ప్రశంసాపత్రాన్ని శివన్‌కు అందించారు. శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికిగాను శివన్‌కు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇస్రో చెర్మన్ డాక్టర్ కై లాసవాడివో శివన్‌కు అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికిగానుత
ఏపీకి పోషణ్ అభియాన్ జాతీయ అవార్డులు
పోషణ్ అభియాన్ కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. అలాగే క్షేత్రస్థాయిలో పలు అవార్డులు దక్కాయి. ఢిల్లీలో ఆగస్టు 23న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డా.దమయంతి, ఆ శాఖ సంచాలకులు డా.కృతిక శుక్లాకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ అవార్డులను అందజే శారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి, శిశుమరణాలను నివారించేందుకుగాను కేంద్రప్రభుత్వం పోషణ్ అభియాన్‌ను అమల్లోకి తెచ్చింది.
అవార్డుల వివరాలు
స్మార్ట్ పోలీసింగ్‌లో తెలంగాణకి పురస్కారం
స్మార్ట్ పోలీసింగ్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగానికి ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఢిల్లీలో ఆగస్టు 23న జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ, పీఎంవో సహాయ మంత్రి జితేంద్రసింగ్ చేతుల మీదుగా అడిషనల్ డీజీ (టెక్నికల్ సర్వీసెస్) రవి ఈ అవార్డును అందుకున్నారు. డయల్ 100 ఫోన్‌కాల్స్ విభాగంలో అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించినందుకు గానూ తెలంగాణకి ఈ అవార్డు దక్కింది. దేశంలో స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రజల రక్షణ, భద్రతా విషయాల్లో మెరుగైన సేవలు అందించిన వారి కోసం ఫిక్కీ ఈ అవార్డును అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్మార్ట్ పోలీసింగ్‌లో ఫిక్కీ స్పెషల్ జ్యూరీ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం
ఎందుకు : డయల్ 100 ఫోన్‌కాల్స్ విభాగంలో అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించినందుకు
తెలంగాణకి పోషణ్ అభియాన్ అవార్డులు
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ అమల్లో తెలంగాణకు అవార్డులు లభించాయి. జిల్లా స్థాయిలో లీడర్‌షిప్, కన్వర్జెన్స్‌లో సంగారెడ్డి జిల్లా, బ్లాక్ లెవల్‌లో ఇబ్రహీంపట్నంకు అవార్డులు దక్కాయి. ఢిల్లీలో ఆగస్టు 23న జరిగిన కార్యక్రమంలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అవార్డు అందుకున్నారు. బ్లాక్ లెవల్ అవార్డులను ప్రాజెక్టు అధికారి శాంతిశ్రీ అందుకున్నారు. వ్యక్తిగత విభాగాల్లో అంకిరెడ్డిపల్లెకు చెందిన అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ ఎంలు, ఏడబ్ల్యూహెచ్‌లు అందుకున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించి మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్‌ను అమలుచేస్తోంది.
సైకాలజిస్ట్ లక్ష్మణ్‌కు ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు
ప్రముఖ మానసిక శిక్షణ నిపుణుడు డా.పి.లక్ష్మణ్‌కు ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు లభించింది. ఢిల్లీలో ఆగస్టు 24న జరిగిన ఎడ్యుకేషన్ ఐకాన్ సంస్థ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్జెంటీనా రాయబారి డెనియల్ చుబురు చేతుల మీదుగా లక్ష్మణ్ అవార్డు అందుకున్నారు. లక్ష్మణ్ సేవలకు గుర్తింపుగా సామాజిక సేవా విభాగంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఐకాన్ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది.
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల్ మండలం ఎన్‌సీ తాండకు చెందిన లక్ష్మణ్ గత కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సైకాలజీ కౌన్సెలింగ్, మానసిక శిక్షణలో అవగాహన కల్పిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏడుసార్లు ఉత్తమ సామాజిక సేవా విభాగంలో అవార్డులు ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఐకాన్- ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : డా.పి.లక్ష్మణ్
ఎందుకు : సామాజిక సేవకు గుర్తింపుగా
ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ జాయెద్ పురస్కారం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని యూఏఈ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’తో గౌరవించారు. యూఏఈ రాజధాని అబుధాబిలో ఆగస్టు 24న జరిగిన కార్యక్రమంలో మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూ లేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన మోదీని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యూఏఈ రాజు అల్ నహ్యాన్ 2019, ఏప్రిల్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, దేశాధినేతలు, రాజులకు ఈ అవార్డును బహుకరిస్తారు.
రూపే కార్డు ప్రారంభం : యూఏఈలో ప్రధాని మోదీ భారతీయ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం రూపే కార్డును ప్రారంభించారు. దీనివల్ల ఏటా యూఏ ఈ సందర్శించే 30 లక్షల మంది భారతీయులకు లాభం కలగనుంది.
అల్ నహ్యాన్‌తో చర్చలు : యూఏఈ యువరాజు అల్ నహ్యాన్‌తో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై మోదీ చర్చించారు. యూఏఈలో మోదీ పర్యటనను పురస్కరించుకుని ‘మరోసారి రెండో సొంతింటికి వస్తున్నందుకు నా సోదరుడికి కృతజ్ఞతలు’ అని నహ్యాన్ పేర్కొన్నారు.
భారతీయులతో సమావేశం : అబుధాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. రాజకీయ స్థిరత్వం, సానుకూల విధానాల కారణంగానే భారత్ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ఈ సందర్భంగా మోదీ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్డర్ ఆఫ్ జాయెద్ పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : యూఏఈ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
ఎక్కడ : అబుధాబి, యూఏఈ
ఎందుకు : రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి కృషి చేసినందుకు
మోదీకి బహ్రెయిన్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహ్రెయిన్ అత్యున్నత పురస్కారం ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్స్’ను బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రదానం చేశారు. బహ్రెయిన్ మనామాలో ఆగస్టు 25న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డుతో మోదీని సత్కరించారు. అనంతరం ద్వెపాక్షిక, ప్రాంతీయ, బహుముఖ అంశాలపై మోదీ, ఖలీఫా చర్చించారు. ఉగ్రవాదంపై నిఘా సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
బహ్రెయిన్ ప్రధానితో మోదీ భేటీ
బహ్రెయిన్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్‌తో ఆగస్టు 24న మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అంతరిక్ష విజ్ఞానం, సౌరశక్తి, సాంస్కృతిక రెండు దేశాలు పలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఇస్రోతో బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ పరస్పర సహకారం వీటిలో ఒకటి.
మోదీ బహ్రెయిన్ పర్యటన విశేషాలు
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీకి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్స్ ప్రదానం
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా
ఎక్కడ : మనామా, బహ్రెయిన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చెర్మన్ డాక్టర్ కై లాసవాడివో శివన్‌కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం అవార్డును ప్రకటించింది. శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికిగాను శివన్‌కు ఈ అవార్డు దక్కింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల మీదుగా.. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నవారికి అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం పేరిట అవార్డు (8 గ్రాముల బంగారు పతకం, రూ.ఐదు లక్షల నగదు)ను ఇస్రో చైర్మన్‌కు ప్రకటించారు. అయితే, ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో మరో రోజు అవార్డును ఆయనకు అందించాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇస్రో చెర్మన్ డాక్టర్ కై లాసవాడివో శివన్ అబ్దుల్ కలాం అవార్డు
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం
ఎందుకు : శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించినందుకు
ఏపీ పోలీసులకు సేవా పతకాలు
విధి నిర్వహణలో విశిష్ణ సేవలు, ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు సేవా పతకాలను ప్రదానం చేశారు. విజయవాడ ఐజీఎం స్టేడియంలో ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పతకాలను అందజేశారు. ఆయా విభాగాల్లో 2014, 2017, 2018, 2019కి సంబంధించి 87 మంది రాష్ట్ర పోలీసులకు కేంద్ర పరిధిలో ప్రకటించిన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్(పీపీఎం), ఇండియన్ పోలీస్ మెడల్(ఐపీఎం), పోలీస్ మెడల్ గ్యాలంటరీ(పీఎంజీ) పతకాలను వారందుకున్నారు.
విధి నిర్వహణలో మృతి చెందిన గ్రేహౌండ్‌స సీనియర్ కమాండెంట్ ఎండీ అబూబాకర్ తరఫున ఆయన తండ్రి ఎండీ మదీన పోలీస్ మెడల్ గ్యాలంటరీ పతకాన్ని అందుకున్నారు. జీవన్ రక్ష పతకాన్ని నిమ్మల వీరవెంకట రమణ అందుకున్నారు.
పతకాలు అందుకున్న ఐపీఎస్‌లు, ఇతర ప్రముఖుల వివరాలివే..
భాషా పండితులకు రాష్ట్రపతి పురస్కారాలు
సంస్కృతం, పర్షియన్, అరబిక్, పాళీ, ప్రాకృతం, క్లాసికల్ తెలుగు, క్లాసికల్ కన్నడ, క్లాసికల్ మలయాళం, క్లాసికల్ ఒడియా భాషల అభివృద్ధికి కృషిచేసిన ఆయా భాషా పండితులకు స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, మహర్షి భద్రాయన్ వ్యాస సమ్మాన్ పురస్కారాలను ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆగస్టు 15న వెల్లడించింది. 2019 సంవత్సరానికి గాను ఈ పురస్కరాలను ప్రకటించారు.
రాష్ట్రపతి పురస్కారాలు
శ్రీపాద సత్యనారాయణమూర్తి (సంస్కృతం)
ఆచార్య రవ్వా శ్రీహరి (క్లాసికల్ తెలుగు)
మహర్షి భద్రాయన్ వ్యాస సమ్మాన్ పురస్కారం
డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ (క్లాసికల్ తెలుగు)
డాక్టర్ వి.త్రివేణి (క్లాసికల్ తెలుగు)
డాక్టర్ కె.ప్రభాకర్ (క్లాసికల్ తెలుగు)
క్విక్ రివ్యూ:
ఏమిటి : భాషా పండితులకు రాష్ట్రపతి, మహర్షి భద్రాయన్ వ్యాస్ సమ్మాన్ పురస్కారాలు
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎందుకు : భాషల అభివృద్ధికి కృషి చేసినందుకు
మురళీకృష్ణకు విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్
భగవద్గీతపై ఆడియో ఆల్బం, పుస్తకం రూపొందించిన డా. దంతు మురళీకృష్ణకు విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్ అవార్డు-2019 లభించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఆగస్టు 16న జరిగిన కార్యక్రమంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌సిన్హా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. భగవద్గీతపై సంభవామి యుగే యుగే శీర్షికతో సంస్కతం-హిందీ, సంస్కృతం-తెలుగుల్లో ఆడియో ఆల్బంను, పుస్తకాన్ని మురళీకృష్ణ తీర్చిదిద్దారు. ఇలా చేసిన తొలి శాస్త్రవేత్తగా ఆయన నిలిచారు.
వృత్తి రీత్యా సైంటిస్టు అయిన మురళీకృష్ణ లుపిన్ లిమిటెడ్‌లో సీనియర్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం రాజమండ్రి కాగా, భోపాల్‌లో నివాసం ఉంటున్నారు. భగవద్గీతపై విశేష కృషి చేసినందుకు గానూ రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్ ఆయనకు లక్ష రూపాయలు నగదుతో విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్‌ను అందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్ అవార్డు-2019
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : డా. దంతు మురళీకృష్ణ
ఎందుకు : భగవద్గీతపై ఆడియో ఆల్బం, పుస్తకం రూపొందించినందుకు
సుధీర్ జలగంకు హింద్ రతన్ అవార్డు
ప్రవాస భారతీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘హింద్ రతన్’ అవార్డును 2018 సంవత్సరానికి గాను సుధీర్ జలగంకు ఎన్‌ఆర్‌ఐ వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గతంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి సుధీర్ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో 2020 ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగే 39వ ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్‌లో సుధీర్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హింద్ రతన్ అవార్డు-2018
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : సుధీర్ జలగం
సీసీఎంబీ శాస్త్రవేత్తకు జేసీ బోస్ ఫెలోషిప్
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్‌కు ప్రతిష్టాత్మక జేసీ బోస్ ఫెలోషిప్ లభించింది. జనాభా, వైద్యపరమైన జన్యుశాస్త్ర రంగాల్లో చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా తంగరాజ్‌ను భారత ప్రభుత్వం ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగపు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు అందించే ఈ ఫెలోషిప్ కింద తమ తమ రంగాల్లో విస్తృత పరిశోధనలకు రూ.15 లక్షల గ్రాంట్ లభిస్తుంది. దీంతోపాటు ప్రోత్సాహకంగా నెల కు రూ.25 వేలు చొప్పున ఐదేళ్లపాటు అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్‌కు జేసీ బోస్ ఫెలోషిప్
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : జనాభా, వైద్యపరమైన జన్యుశాస్త్ర రంగాల్లో చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా
వడ్డెపల్లికి సరస్వతీ సమ్మాన్ పురస్కారం
సిరిసిల్లకు చెందిన సినీ పాటల రచయిత, దర్శకుడు డాక్టర్ వడ్డెపల్లి కృష్ణకు ప్రతిష్టాత్మకమైన సరస్వతీ సమ్మాన్ పురస్కారం లభించింది. ఈ మేరకు అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్ జాతీయ అధ్యక్షుడు సతీష్ చతుర్వేదిక్ ఆగస్టు 19న ప్రకటించారు. సాహిత్య రంగంలో అందిస్తున్న సేవలకుగాను వడ్డెపల్లికి ఈ అవార్డు దక్కింది. ఆగస్టు 25న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సరస్వతీ సమ్మాన్ పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : డాక్టర్ వడ్డెపల్లి కృష్ణ
ఎందుకు : సాహిత్య రంగంలో అందిస్తున్న సేవలకుగాను
అనంతపురం వైద్యశాలకు రాష్ట్రపతి పురస్కారం
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు 2017-18 విద్యా సంవత్సరానికి రాష్ట్రపతి సేవా పురస్కారం లభించింది. ఈ మేరకు ఆగస్టు 21న రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కార్యక్రమాల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకుగాను కళాశాలకు ఈ అవార్డు దక్కింది. 2019, సెప్టెంబరు 24న ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18 విద్యా సంవత్సరానికి రాష్ట్రపతి సేవా పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల
ఎందుకు : ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు
భారత రత్న పురస్కారాల ప్రదానం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ దివంగత నేత నానాజీ దేశ్‌ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు 2019, జనవరిలో ప్రకటించిన భారత రత్న పురస్కారాలను ఆగస్టు 8న ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ముఖర్జీకి, హజారికా కొడుకు తేజ్‌కు, నానాజీ సన్నిహిత బంధువు విక్రమజీత్ సింగ్‌కు అందజేశారు.
కాంగ్రెస్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన ప్రణబ్ భారత్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. భారత రత్న అందుకున్న ఐదో రాష్ట్రపతిగా ప్రణ్‌బ్ నిలిచారు. నానాజీ దేశ్‌ముఖ్‌కు 1928 నుంచి ఆయన చనిపోయే వరకు ఆరెస్సెస్‌తో సంబంధాలు ఉన్నాయి. భారతీయ జన సంఘ్ స్థాపకుల్లో నానాజీ ఒకరు. కాగా, అస్సాంకు చెందిన హజారికా నేపథ్య గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, చిత్ర నిర్మాత కూడా. నానాజీ, హజారికాలకు ఈ అవార్డును వారి మరణానంతరం ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ దివంగత నేత నానాజీ దేశ్‌ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు భారత రత్న పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్
నీటి సంరక్షణపై మున్సిపాల్టీలకు అవార్డులు
నీటి సంరక్షణ చర్యలు తీసుకునే మున్సిపాల్టీలకు అవార్డులు ప్రకటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 8న ఉత్తర్వలు జారీ చేసింది. ఈ అవార్డులకుగానూ దేశవ్యాప్తంగా 754 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలను ఎంపిక చేసిన ట్లు పేర్కొంది. జలశక్తి అభియాన్ పథకం కింద ఇంకుడుగుంతల ఏర్పాటు, పచ్చదనం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, హిందూపురం, పుట్టపర్తి, తాడిపత్రి, మడకశిర, కర్నూలు, వైఎస్సార్ కడప, రాజంపేట, మార్కాపురం, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, ఒంగోలు, గిద్దలూరు, మచిలీపట్నం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, శ్రీకాకుళం మున్సిపాల్టీలు అవార్డుకు ఎంపికయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీటి సంరక్షణపై మున్సిపాల్టీలకు అవార్డులు ప్రకటన
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
సిద్దిపేట కలెక్టర్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డికు జాతీయ స్థాయిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌లెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం పర్యవేక్షణలోని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఆధ్వర్యంలోని కమిటీ ఆగస్టు 10న ప్రకటించింది. ఢిల్లీలో ఆగస్టు 21న జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టులను, పథకాలను ప్రజలకు చేరవేస్తూ మంచి పాలనా ప్రక్రియకు నాంది పలికే కలెక్టర్లకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ అవార్డును అందజేస్తారు. దేశంలోని 688 జిల్లాల్లో కలెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని రెండేళ్లకోసారి అవార్డులను ప్రకటిస్తారు. ప్రధాని మోదీ కమిటీ చైర్మన్‌గా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ చైర్మన్ వివేక్ గోయెంక, రమానాథ్ గోయెంక సభ్యులుగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ కమిటీ అవార్డులను ప్రకటిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌లెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి
ఎందుకు : ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసినందుకు
బాంబే జయశ్రీకి మంగళంపల్లి పురస్కారం
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బాంబే జయశ్రీకి 2019 సంవత్సరానికిగాను పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 10న ఆమెను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం, రూ.పది లక్షలు, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజనాభ్యుదయ, పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాంస్కృతిక శాఖకు రూ.72 కోట్ల బడ్జెట్‌ను ఇచ్చి ఈ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాంబే జయశ్రీకి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కారం-2019 ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
సంగారెడ్డి కలెక్టర్‌కి పోషణ్ అభియాన్ అవార్డు
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావుకు ‘పోషణ్ అభియాన్ 2018-19’ అవార్డు లభించింది. దేశరాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 23న జరగనున్న కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు ప్రధానం చేయనున్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో పక్కాగా అమలు చేసి విజయవంతమైందుకుగాను హనుమంతరావుకు ఈ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పోషణ్ అభియాన్’కార్యక్రమంలో భాగంగా మాతా శిశు సంరక్షణ, గర్భిణుల ఆరోగ్యం, పిల్లల్లో పౌష్టికారం పెంపుదల విషయంపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడం, ఆచరించడంలో సంగారెడ్డి జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోషణ్ అభియాన్ 2018-19 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు
ఎందుకు : పోషణ్ అభియాన్ పక్కాగా అమలు చేసి విజయవంతమైందుకుగాను
సీబీఐ అధికారి పెద్దిరాజుకు హోం ఎక్సలెన్స్ అవార్డు
సీబీఐ ప్రధాన కార్యాలయం సైబర్ నేరాల దర్యాప్తు విభాగంలో డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బండి పెద్దిరాజుకు కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు లభించింది. కేసుల దర్యాప్తులో అత్యుత్తమంగా విధులు నిర్వర్తించినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని శృంగవృక్షం గ్రామానికి చెందిన పెద్దిరాజు 1993లో సీబీఐలో కానిస్టేబుల్‌గా చేరారు. ఇప్పటివరకు ఈయన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (2017), ఉత్తమ దర్యాప్తు అధికారి బంగారు పతకం (2008) , డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డు (2014), రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు (2014, 2018), 144 నగదు రివార్డులు, 8 ప్రశంసాపత్రాలు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : బండి పెద్దిరాజు
ఎందుకు : కేసుల దర్యాప్తులో అత్యుత్తమంగా విధులు నిర్వర్తించినందుకుగాను
జాతీయ యువజన అవార్డులు ప్రధానం
2016-17కు ప్రకటించిన జాతీయ యువజన అవార్డులను ఆగస్టు 12న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రధానం చేశారు. తెలంగాణ నుంచి ఒద్దిరాజు వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టెం వెంకటేష్, పృథ్వీ గొల్ల ఈ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. అవార్డు అందుకున్నవారికి రూ.50 వేల నగదు, పతకం, సర్టిఫికెట్ అందజేశారు. దేశవ్యాప్తంగా 20 మంది యువజన అవార్డులకు ఎంపికయ్యారు. వివిధ రంగాల అభివృద్ధి, సామాజిక సేవారంగంలో కృషికి గుర్తింపుగా కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఈ యువజన అవార్డులను ఇస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2016-17కు ప్రకటించిన జాతీయ యువజన అవార్డులు ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఎక్కడ : న్యూఢిల్లీ
గోపాలన్‌కు లివింగ్ లెజెండ్ అవార్డు
దేశ పౌష్టికాహార రంగం భీష్మ పితామహుడిగా పరిగణించే డాక్టర్ కొళత్తూర్ గోపాలన్‌ను ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ న్యూట్రిషన్ సొసైటీ.. ప్రతిష్టాత్మక ‘ఫాన్స్-లివింగ్ లెజెండ్’ అవార్డుకు ఎంపిక చేసింది. ఇండోనేసియాలోని బాలీలో జరిగిన 13వ ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ న్యూట్రిషన్ సదస్సులో ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు జాతీయ పోషకాహార సంస్థ ఆగస్టు 13న ఒక ప్రకటనలో తెలిపింది.
భారత వైద్య పరిశోధన సంస్థ, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థల మాజీ డెరైక్టర్ అయిన గోపాలన్.. 2018లో వందేళ్లు పూర్తి చేసుకున్నారు. 1970ల్లో మొదలైన ఐసీడీఎస్‌తోపాటు, బాలల్లో అంధత్వాన్ని నివారించేందుకు విటమిన్-ఏ టీకాలు వేయడం వరకూ అనేక పోషకాహార సంబంధిత కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. 1974-79 మధ్యకాలంలో తర్వాత న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఐసీఎంఆర్ డెరైక్టర్‌గా పనిచేసిన ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ న్యూట్రిషన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన గోపాలన్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో సత్కరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫాన్స్-లివింగ్ లెజెండ్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : డాక్టర్ కొళత్తూర్ గోపాలన్
ఏపీ పోలీసులకు హోం ఎక్సలెన్స్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్ జె.శివనారాయణ స్వామి, ఏఎస్‌ఐ ఎస్.స్వామిదాస్‌లకు కేంద్ర హోంశాఖ అందించే ‘ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్-2019’ అవార్డు లభించింది. నేరాల దర్యాప్తులో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకుగాను వీరికి ఈ అవార్డు దక్కింది. అదే విధంగా సీబీఐ విభాగం నుంచి తెలుగు అధికారి డీఎస్పీ బండి పెద్దిరాజు, తెలంగాణ పోలీసు విభాగం నుంచి ఏసీపీ ఏవీఆర్ నర్సింహారావు, ఏసీపీ ఎస్.మోహన్‌కుమార్‌లకూ ఈ అవార్డు లభించింది. 2018 నుంచి ఈ అవార్డు ఇస్తుండగా, 2019 ఏడాదికి మొత్తం 96 మంది ఎంపికయ్యారు.
జర్నలిస్ట్ రవీశ్‌కు మెగసెసె అవార్డు
ప్రముఖ పాత్రికేయుడు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్‌ను ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం-2019 వరించింది. ఈ మేరకు రామన్ మెగసెసె ఫౌండేషన్ ఆగస్టు 2న ప్రకటించింది. నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. ఎన్డీటీవీ హిందీ భాష ఛానల్‌లో ప్రసారమయ్యే ప్రైమ్ టైమ్ కార్యక్రమం ద్వారా అంతగా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేశారంది.
రవీష్‌తోపాటు మరో నలుగురు ఆసియా నుంచి మెగసెసె-2019 పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో కో స్వీ విన్(మయన్మార్), అంగ్‌ఖానా నిలపైజిత్(థాయిలాండ్), రేముండో పుజాంతే కాయాబ్యాబ్(ఫిలిప్పీన్స్), కిమ్ జాంగ్ కి(దక్షిణ కొరియా) ఉన్నారు. వీరందరికీ ఆగస్టు 31వ తేదీన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
రవీష్ ప్రస్థానం..
బిహార్‌లోని జిత్వార్‌పూర్ గ్రామంలో జన్మించిన రవీశ్ 1996లో ఎన్డీటీవీలో రిపోర్టర్‌గా పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఎన్డీటీవీ హిందీ భాషలో తొలిసారి 24 గంటల చానల్‌ను ప్రారంభించడంతో అందులో ఆయన ప్రైమ్ టైమ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అవార్డు గురించి..
ఆసియా నోబెల్‌గా పరిగణించే రామన్ మెగసెసె అవార్డును 1957లో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఆసియా అత్యున్నత పురస్కారంగా పిలిచే ఈ అవార్డును వ్యక్తులు లేదా సంస్థలకు రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా అందిస్తోంది. గతంలో భారత్ నుంచి ఆర్‌కే లక్ష్మణ్, పి.సాయినాథ్, అరుణ్ శౌరి, కిరణ్ బేడీ, అర్వింద్ కేజ్రీవాల్ ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామన్ మెగసెసె పురస్కారం-2019కు ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రవీశ్ కుమార్
ఎందుకు : జర్నలిజం ద్వారా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేసినందుకు
రాష్ట్రపతికి గునియా అత్యున్నత పురస్కారం
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను గునియా తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘నేషనల్ ఆర్టర్ ఆఫ్ మెరిట్’’ను ప్రదానం చేసింది. గునియా రాజధాని కొనాక్రైలో ఆగస్టు 3న జరిగిన కార్యక్రమంలో గునియా అధ్యక్షుడు అల్ఫా కొండే చేతుల మీదుగా రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత్-గునియా దేశాల మైత్రి బంధానికి, గునియా ప్రజల గౌరవానికి ప్రతీకగా అందజేసిన ఈ అవార్డును భారత ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు.
రాష్ట్రపతి గునియా పర్యటనలో భాగంగా మూడు ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. వైద్యం, హోమియోపతి, పునరుత్పతి ఇంధనం, ఇ-విద్యాభారతి, ఇ-ఆరోగ్య భారతి (ఈ-వీబీఏబీ) నెట్‌వర్క్ ప్రాజెక్టుల రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఈ ఒప్పందాలు జరిగాయి. బెనిన్, గాంబియా, గునియా దేశాల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరిగా గునియా దేశంలో రాష్ట్రపతి పర్యటించడం ద్వారా ఆయన పర్యటన పూర్తయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గునియా అత్యున్నత పురస్కారమైన నేషనల్ ఆర్టర్ ఆఫ్ మెరిట్ ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : కొనాక్రై, గునియా

- ఐసీడీఎస్ ప్రోగ్రాం అమల్లో ఏపీ జాతీయస్థాయిలో మొదటి స్థానం పొందింది. ఇందుకుగాను రూ.కోటి నగదు పురస్కారాన్ని దక్కించుకుంది.
- పోషకాహారం పంపిణీలో ఏపీ రెండో స్థానం పొందింది.
- నాయకత్వ విభాగంలో దక్కిన అవార్డును కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ప్రాజెక్టు స్థాయిలో అనంతపురం జిల్లా శింగనమల సీడీపీవో జి.వనజ అక్కమ్మ, క్షేత్రస్థాయిలో గుంటూరు జిల్లా తెనాలి, చిత్తూరు జిల్లా పుత్తూరు కార్యకర్తలు అవార్డులను అందుకున్నారు.

- రెండు రోజులపాటు (ఆగస్టు 24, 25 తేదీల్లో) మోదీ బహ్రెయిన్‌లో పర్యటించారు.
- ఈ పర్యటనతో బహ్రెయిన్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు.
- మోదీ పర్యటన సందర్భంగా 250 మంది భారతీయ ఖైదీలను ఆగస్టు 25న విడుదల చేసి బహ్రెయిన్ మానవత్వాన్ని చాటుకుంది.
- బహ్రెయిన్‌లో 200 ఏళ్ల పురాతనమైన శ్రీనాథ్‌జీ శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు రూ. 30 కోట్ల విలువైన పనులను మోదీ ఆగస్టు 25న ప్రారంభించారు. అలాగే రూపే కార్డును ప్రారంభించారు.
- బహ్రెయిన్‌లో పనిచేస్తున్న భారతీయులను ఉద్దేశించి మోదీ బహ్రెయిన్ జాతీయ స్టేడియంలో ఆగస్టు 25న ప్రసంగించారు.
- బహ్రెయిన్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు చేసిన కృషిపై అభినందనలను వింటే తన మనసు సంతోషంతో పొంగిపోతుందని మోదీ అన్నారు.
- బహ్రెయిన్ మొత్తం జనాభా దాదాపు 12 లక్షలు కాగా, అక్కడ పనిచేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్యే 3.5 లక్షలు.
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీకి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్స్ ప్రదానం
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా
ఎక్కడ : మనామా, బహ్రెయిన్
ఇస్రో చైర్మన్ శివన్‌కు అబ్దుల్ కలాం అవార్డు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చెర్మన్ డాక్టర్ కై లాసవాడివో శివన్‌కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం అవార్డును ప్రకటించింది. శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికిగాను శివన్‌కు ఈ అవార్డు దక్కింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల మీదుగా.. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నవారికి అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం పేరిట అవార్డు (8 గ్రాముల బంగారు పతకం, రూ.ఐదు లక్షల నగదు)ను ఇస్రో చైర్మన్‌కు ప్రకటించారు. అయితే, ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో మరో రోజు అవార్డును ఆయనకు అందించాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇస్రో చెర్మన్ డాక్టర్ కై లాసవాడివో శివన్ అబ్దుల్ కలాం అవార్డు
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం
ఎందుకు : శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించినందుకు
ఏపీ పోలీసులకు సేవా పతకాలు
విధి నిర్వహణలో విశిష్ణ సేవలు, ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు సేవా పతకాలను ప్రదానం చేశారు. విజయవాడ ఐజీఎం స్టేడియంలో ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పతకాలను అందజేశారు. ఆయా విభాగాల్లో 2014, 2017, 2018, 2019కి సంబంధించి 87 మంది రాష్ట్ర పోలీసులకు కేంద్ర పరిధిలో ప్రకటించిన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్(పీపీఎం), ఇండియన్ పోలీస్ మెడల్(ఐపీఎం), పోలీస్ మెడల్ గ్యాలంటరీ(పీఎంజీ) పతకాలను వారందుకున్నారు.
విధి నిర్వహణలో మృతి చెందిన గ్రేహౌండ్‌స సీనియర్ కమాండెంట్ ఎండీ అబూబాకర్ తరఫున ఆయన తండ్రి ఎండీ మదీన పోలీస్ మెడల్ గ్యాలంటరీ పతకాన్ని అందుకున్నారు. జీవన్ రక్ష పతకాన్ని నిమ్మల వీరవెంకట రమణ అందుకున్నారు.
పతకాలు అందుకున్న ఐపీఎస్‌లు, ఇతర ప్రముఖుల వివరాలివే..
పేరు | హోదా | పతకం |
హరీష్‌కుమార్ గుప్త | హోంగార్డ్స్ ఏడీజీ | పీపీఎం-2018 |
షేక్ మహ్మద్ ఇక్బాల్ | రిటైర్డ్ ఐపీఎస్ | పీపీఎం-2018 |
గోరంట్ల వెంకటగిరి అశోక్ | సీఐడీ ఎస్పీ | ఐపీఎం-2018 |
ఎం.రవిప్రకాష్ | ఎస్‌ఐబీ ఎస్పీ | ఐపీఎం-2018 |
రాహుల్‌దేవ్ శర్మ | గ్రేహౌండ్స్ | పీఎంజీ-2017 |
అట్టాడ బాపూజీ | విశాఖ రూరల్ ఎస్పీ | పీఎంజీ-2017 |
జంగారెడ్డి కోటేశ్వరరావు | 5వ బెటాలియన్ | పీపీఎం-2018 |
ఎ.వెంకటరత్నం | ఎస్‌ఐబీ ఎస్పీ | పీపీఎం-2019 |
కొవ్వూరి సూర్యభాస్కరరెడ్డి | తిరుపతి పీటీసీ ప్రిన్సిపాల్ | పీపీఎం-2018 |
బత్తుల శ్రీరామమూర్తి | 3వ బెటాలియన్ | ఐపీఎం-2018 |
పెంట వెంకట రవికుమార్ | ఏసీబీ అడిషనల్ డీసీపీ | ఐపీఎం-2018 |
పీవీ రామిరెడ్డి | ఏఎస్పీ | ఐపీఎం-2014 |
అధికారి మురళీ | అసెంబ్లీ చీఫ్ మార్షల్ | ఐపీఎం-2018 |
పప్పుల మురళీధర్ | ఇంటెలిజెన్స్ డీఎస్పీ | ఐపీఎం-2018 |
భాషా పండితులకు రాష్ట్రపతి పురస్కారాలు
సంస్కృతం, పర్షియన్, అరబిక్, పాళీ, ప్రాకృతం, క్లాసికల్ తెలుగు, క్లాసికల్ కన్నడ, క్లాసికల్ మలయాళం, క్లాసికల్ ఒడియా భాషల అభివృద్ధికి కృషిచేసిన ఆయా భాషా పండితులకు స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, మహర్షి భద్రాయన్ వ్యాస సమ్మాన్ పురస్కారాలను ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆగస్టు 15న వెల్లడించింది. 2019 సంవత్సరానికి గాను ఈ పురస్కరాలను ప్రకటించారు.
రాష్ట్రపతి పురస్కారాలు
శ్రీపాద సత్యనారాయణమూర్తి (సంస్కృతం)
ఆచార్య రవ్వా శ్రీహరి (క్లాసికల్ తెలుగు)
మహర్షి భద్రాయన్ వ్యాస సమ్మాన్ పురస్కారం
డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ (క్లాసికల్ తెలుగు)
డాక్టర్ వి.త్రివేణి (క్లాసికల్ తెలుగు)
డాక్టర్ కె.ప్రభాకర్ (క్లాసికల్ తెలుగు)
క్విక్ రివ్యూ:
ఏమిటి : భాషా పండితులకు రాష్ట్రపతి, మహర్షి భద్రాయన్ వ్యాస్ సమ్మాన్ పురస్కారాలు
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎందుకు : భాషల అభివృద్ధికి కృషి చేసినందుకు
మురళీకృష్ణకు విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్
భగవద్గీతపై ఆడియో ఆల్బం, పుస్తకం రూపొందించిన డా. దంతు మురళీకృష్ణకు విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్ అవార్డు-2019 లభించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఆగస్టు 16న జరిగిన కార్యక్రమంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌సిన్హా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. భగవద్గీతపై సంభవామి యుగే యుగే శీర్షికతో సంస్కతం-హిందీ, సంస్కృతం-తెలుగుల్లో ఆడియో ఆల్బంను, పుస్తకాన్ని మురళీకృష్ణ తీర్చిదిద్దారు. ఇలా చేసిన తొలి శాస్త్రవేత్తగా ఆయన నిలిచారు.
వృత్తి రీత్యా సైంటిస్టు అయిన మురళీకృష్ణ లుపిన్ లిమిటెడ్‌లో సీనియర్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం రాజమండ్రి కాగా, భోపాల్‌లో నివాసం ఉంటున్నారు. భగవద్గీతపై విశేష కృషి చేసినందుకు గానూ రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్ ఆయనకు లక్ష రూపాయలు నగదుతో విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్‌ను అందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్ అవార్డు-2019
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : డా. దంతు మురళీకృష్ణ
ఎందుకు : భగవద్గీతపై ఆడియో ఆల్బం, పుస్తకం రూపొందించినందుకు
సుధీర్ జలగంకు హింద్ రతన్ అవార్డు
ప్రవాస భారతీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘హింద్ రతన్’ అవార్డును 2018 సంవత్సరానికి గాను సుధీర్ జలగంకు ఎన్‌ఆర్‌ఐ వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గతంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి సుధీర్ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో 2020 ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగే 39వ ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్‌లో సుధీర్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హింద్ రతన్ అవార్డు-2018
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : సుధీర్ జలగం
సీసీఎంబీ శాస్త్రవేత్తకు జేసీ బోస్ ఫెలోషిప్
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్‌కు ప్రతిష్టాత్మక జేసీ బోస్ ఫెలోషిప్ లభించింది. జనాభా, వైద్యపరమైన జన్యుశాస్త్ర రంగాల్లో చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా తంగరాజ్‌ను భారత ప్రభుత్వం ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగపు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు అందించే ఈ ఫెలోషిప్ కింద తమ తమ రంగాల్లో విస్తృత పరిశోధనలకు రూ.15 లక్షల గ్రాంట్ లభిస్తుంది. దీంతోపాటు ప్రోత్సాహకంగా నెల కు రూ.25 వేలు చొప్పున ఐదేళ్లపాటు అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్‌కు జేసీ బోస్ ఫెలోషిప్
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : జనాభా, వైద్యపరమైన జన్యుశాస్త్ర రంగాల్లో చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా
వడ్డెపల్లికి సరస్వతీ సమ్మాన్ పురస్కారం
సిరిసిల్లకు చెందిన సినీ పాటల రచయిత, దర్శకుడు డాక్టర్ వడ్డెపల్లి కృష్ణకు ప్రతిష్టాత్మకమైన సరస్వతీ సమ్మాన్ పురస్కారం లభించింది. ఈ మేరకు అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్ జాతీయ అధ్యక్షుడు సతీష్ చతుర్వేదిక్ ఆగస్టు 19న ప్రకటించారు. సాహిత్య రంగంలో అందిస్తున్న సేవలకుగాను వడ్డెపల్లికి ఈ అవార్డు దక్కింది. ఆగస్టు 25న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సరస్వతీ సమ్మాన్ పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : డాక్టర్ వడ్డెపల్లి కృష్ణ
ఎందుకు : సాహిత్య రంగంలో అందిస్తున్న సేవలకుగాను
అనంతపురం వైద్యశాలకు రాష్ట్రపతి పురస్కారం
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు 2017-18 విద్యా సంవత్సరానికి రాష్ట్రపతి సేవా పురస్కారం లభించింది. ఈ మేరకు ఆగస్టు 21న రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కార్యక్రమాల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకుగాను కళాశాలకు ఈ అవార్డు దక్కింది. 2019, సెప్టెంబరు 24న ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18 విద్యా సంవత్సరానికి రాష్ట్రపతి సేవా పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల
ఎందుకు : ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు
భారత రత్న పురస్కారాల ప్రదానం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ దివంగత నేత నానాజీ దేశ్‌ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు 2019, జనవరిలో ప్రకటించిన భారత రత్న పురస్కారాలను ఆగస్టు 8న ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ముఖర్జీకి, హజారికా కొడుకు తేజ్‌కు, నానాజీ సన్నిహిత బంధువు విక్రమజీత్ సింగ్‌కు అందజేశారు.
కాంగ్రెస్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన ప్రణబ్ భారత్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. భారత రత్న అందుకున్న ఐదో రాష్ట్రపతిగా ప్రణ్‌బ్ నిలిచారు. నానాజీ దేశ్‌ముఖ్‌కు 1928 నుంచి ఆయన చనిపోయే వరకు ఆరెస్సెస్‌తో సంబంధాలు ఉన్నాయి. భారతీయ జన సంఘ్ స్థాపకుల్లో నానాజీ ఒకరు. కాగా, అస్సాంకు చెందిన హజారికా నేపథ్య గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, చిత్ర నిర్మాత కూడా. నానాజీ, హజారికాలకు ఈ అవార్డును వారి మరణానంతరం ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ దివంగత నేత నానాజీ దేశ్‌ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు భారత రత్న పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్
నీటి సంరక్షణపై మున్సిపాల్టీలకు అవార్డులు
నీటి సంరక్షణ చర్యలు తీసుకునే మున్సిపాల్టీలకు అవార్డులు ప్రకటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 8న ఉత్తర్వలు జారీ చేసింది. ఈ అవార్డులకుగానూ దేశవ్యాప్తంగా 754 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలను ఎంపిక చేసిన ట్లు పేర్కొంది. జలశక్తి అభియాన్ పథకం కింద ఇంకుడుగుంతల ఏర్పాటు, పచ్చదనం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, హిందూపురం, పుట్టపర్తి, తాడిపత్రి, మడకశిర, కర్నూలు, వైఎస్సార్ కడప, రాజంపేట, మార్కాపురం, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, ఒంగోలు, గిద్దలూరు, మచిలీపట్నం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, శ్రీకాకుళం మున్సిపాల్టీలు అవార్డుకు ఎంపికయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీటి సంరక్షణపై మున్సిపాల్టీలకు అవార్డులు ప్రకటన
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
సిద్దిపేట కలెక్టర్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డికు జాతీయ స్థాయిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌లెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం పర్యవేక్షణలోని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఆధ్వర్యంలోని కమిటీ ఆగస్టు 10న ప్రకటించింది. ఢిల్లీలో ఆగస్టు 21న జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టులను, పథకాలను ప్రజలకు చేరవేస్తూ మంచి పాలనా ప్రక్రియకు నాంది పలికే కలెక్టర్లకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ అవార్డును అందజేస్తారు. దేశంలోని 688 జిల్లాల్లో కలెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని రెండేళ్లకోసారి అవార్డులను ప్రకటిస్తారు. ప్రధాని మోదీ కమిటీ చైర్మన్‌గా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ చైర్మన్ వివేక్ గోయెంక, రమానాథ్ గోయెంక సభ్యులుగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ కమిటీ అవార్డులను ప్రకటిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌లెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి
ఎందుకు : ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసినందుకు
బాంబే జయశ్రీకి మంగళంపల్లి పురస్కారం
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బాంబే జయశ్రీకి 2019 సంవత్సరానికిగాను పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 10న ఆమెను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం, రూ.పది లక్షలు, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజనాభ్యుదయ, పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాంస్కృతిక శాఖకు రూ.72 కోట్ల బడ్జెట్‌ను ఇచ్చి ఈ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాంబే జయశ్రీకి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కారం-2019 ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
సంగారెడ్డి కలెక్టర్‌కి పోషణ్ అభియాన్ అవార్డు
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావుకు ‘పోషణ్ అభియాన్ 2018-19’ అవార్డు లభించింది. దేశరాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 23న జరగనున్న కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు ప్రధానం చేయనున్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో పక్కాగా అమలు చేసి విజయవంతమైందుకుగాను హనుమంతరావుకు ఈ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పోషణ్ అభియాన్’కార్యక్రమంలో భాగంగా మాతా శిశు సంరక్షణ, గర్భిణుల ఆరోగ్యం, పిల్లల్లో పౌష్టికారం పెంపుదల విషయంపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడం, ఆచరించడంలో సంగారెడ్డి జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోషణ్ అభియాన్ 2018-19 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు
ఎందుకు : పోషణ్ అభియాన్ పక్కాగా అమలు చేసి విజయవంతమైందుకుగాను
సీబీఐ అధికారి పెద్దిరాజుకు హోం ఎక్సలెన్స్ అవార్డు
సీబీఐ ప్రధాన కార్యాలయం సైబర్ నేరాల దర్యాప్తు విభాగంలో డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బండి పెద్దిరాజుకు కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు లభించింది. కేసుల దర్యాప్తులో అత్యుత్తమంగా విధులు నిర్వర్తించినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని శృంగవృక్షం గ్రామానికి చెందిన పెద్దిరాజు 1993లో సీబీఐలో కానిస్టేబుల్‌గా చేరారు. ఇప్పటివరకు ఈయన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (2017), ఉత్తమ దర్యాప్తు అధికారి బంగారు పతకం (2008) , డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డు (2014), రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు (2014, 2018), 144 నగదు రివార్డులు, 8 ప్రశంసాపత్రాలు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : బండి పెద్దిరాజు
ఎందుకు : కేసుల దర్యాప్తులో అత్యుత్తమంగా విధులు నిర్వర్తించినందుకుగాను
జాతీయ యువజన అవార్డులు ప్రధానం
2016-17కు ప్రకటించిన జాతీయ యువజన అవార్డులను ఆగస్టు 12న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రధానం చేశారు. తెలంగాణ నుంచి ఒద్దిరాజు వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టెం వెంకటేష్, పృథ్వీ గొల్ల ఈ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. అవార్డు అందుకున్నవారికి రూ.50 వేల నగదు, పతకం, సర్టిఫికెట్ అందజేశారు. దేశవ్యాప్తంగా 20 మంది యువజన అవార్డులకు ఎంపికయ్యారు. వివిధ రంగాల అభివృద్ధి, సామాజిక సేవారంగంలో కృషికి గుర్తింపుగా కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఈ యువజన అవార్డులను ఇస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2016-17కు ప్రకటించిన జాతీయ యువజన అవార్డులు ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఎక్కడ : న్యూఢిల్లీ
గోపాలన్‌కు లివింగ్ లెజెండ్ అవార్డు
దేశ పౌష్టికాహార రంగం భీష్మ పితామహుడిగా పరిగణించే డాక్టర్ కొళత్తూర్ గోపాలన్‌ను ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ న్యూట్రిషన్ సొసైటీ.. ప్రతిష్టాత్మక ‘ఫాన్స్-లివింగ్ లెజెండ్’ అవార్డుకు ఎంపిక చేసింది. ఇండోనేసియాలోని బాలీలో జరిగిన 13వ ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ న్యూట్రిషన్ సదస్సులో ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు జాతీయ పోషకాహార సంస్థ ఆగస్టు 13న ఒక ప్రకటనలో తెలిపింది.
భారత వైద్య పరిశోధన సంస్థ, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థల మాజీ డెరైక్టర్ అయిన గోపాలన్.. 2018లో వందేళ్లు పూర్తి చేసుకున్నారు. 1970ల్లో మొదలైన ఐసీడీఎస్‌తోపాటు, బాలల్లో అంధత్వాన్ని నివారించేందుకు విటమిన్-ఏ టీకాలు వేయడం వరకూ అనేక పోషకాహార సంబంధిత కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. 1974-79 మధ్యకాలంలో తర్వాత న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఐసీఎంఆర్ డెరైక్టర్‌గా పనిచేసిన ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ న్యూట్రిషన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన గోపాలన్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో సత్కరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫాన్స్-లివింగ్ లెజెండ్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : డాక్టర్ కొళత్తూర్ గోపాలన్
ఏపీ పోలీసులకు హోం ఎక్సలెన్స్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్ జె.శివనారాయణ స్వామి, ఏఎస్‌ఐ ఎస్.స్వామిదాస్‌లకు కేంద్ర హోంశాఖ అందించే ‘ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్-2019’ అవార్డు లభించింది. నేరాల దర్యాప్తులో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకుగాను వీరికి ఈ అవార్డు దక్కింది. అదే విధంగా సీబీఐ విభాగం నుంచి తెలుగు అధికారి డీఎస్పీ బండి పెద్దిరాజు, తెలంగాణ పోలీసు విభాగం నుంచి ఏసీపీ ఏవీఆర్ నర్సింహారావు, ఏసీపీ ఎస్.మోహన్‌కుమార్‌లకూ ఈ అవార్డు లభించింది. 2018 నుంచి ఈ అవార్డు ఇస్తుండగా, 2019 ఏడాదికి మొత్తం 96 మంది ఎంపికయ్యారు.
జర్నలిస్ట్ రవీశ్‌కు మెగసెసె అవార్డు
ప్రముఖ పాత్రికేయుడు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్‌ను ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం-2019 వరించింది. ఈ మేరకు రామన్ మెగసెసె ఫౌండేషన్ ఆగస్టు 2న ప్రకటించింది. నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. ఎన్డీటీవీ హిందీ భాష ఛానల్‌లో ప్రసారమయ్యే ప్రైమ్ టైమ్ కార్యక్రమం ద్వారా అంతగా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేశారంది.
రవీష్‌తోపాటు మరో నలుగురు ఆసియా నుంచి మెగసెసె-2019 పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో కో స్వీ విన్(మయన్మార్), అంగ్‌ఖానా నిలపైజిత్(థాయిలాండ్), రేముండో పుజాంతే కాయాబ్యాబ్(ఫిలిప్పీన్స్), కిమ్ జాంగ్ కి(దక్షిణ కొరియా) ఉన్నారు. వీరందరికీ ఆగస్టు 31వ తేదీన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
రవీష్ ప్రస్థానం..
బిహార్‌లోని జిత్వార్‌పూర్ గ్రామంలో జన్మించిన రవీశ్ 1996లో ఎన్డీటీవీలో రిపోర్టర్‌గా పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఎన్డీటీవీ హిందీ భాషలో తొలిసారి 24 గంటల చానల్‌ను ప్రారంభించడంతో అందులో ఆయన ప్రైమ్ టైమ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అవార్డు గురించి..
ఆసియా నోబెల్‌గా పరిగణించే రామన్ మెగసెసె అవార్డును 1957లో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఆసియా అత్యున్నత పురస్కారంగా పిలిచే ఈ అవార్డును వ్యక్తులు లేదా సంస్థలకు రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా అందిస్తోంది. గతంలో భారత్ నుంచి ఆర్‌కే లక్ష్మణ్, పి.సాయినాథ్, అరుణ్ శౌరి, కిరణ్ బేడీ, అర్వింద్ కేజ్రీవాల్ ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామన్ మెగసెసె పురస్కారం-2019కు ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రవీశ్ కుమార్
ఎందుకు : జర్నలిజం ద్వారా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేసినందుకు
రాష్ట్రపతికి గునియా అత్యున్నత పురస్కారం
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను గునియా తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘నేషనల్ ఆర్టర్ ఆఫ్ మెరిట్’’ను ప్రదానం చేసింది. గునియా రాజధాని కొనాక్రైలో ఆగస్టు 3న జరిగిన కార్యక్రమంలో గునియా అధ్యక్షుడు అల్ఫా కొండే చేతుల మీదుగా రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత్-గునియా దేశాల మైత్రి బంధానికి, గునియా ప్రజల గౌరవానికి ప్రతీకగా అందజేసిన ఈ అవార్డును భారత ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు.
రాష్ట్రపతి గునియా పర్యటనలో భాగంగా మూడు ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. వైద్యం, హోమియోపతి, పునరుత్పతి ఇంధనం, ఇ-విద్యాభారతి, ఇ-ఆరోగ్య భారతి (ఈ-వీబీఏబీ) నెట్‌వర్క్ ప్రాజెక్టుల రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఈ ఒప్పందాలు జరిగాయి. బెనిన్, గాంబియా, గునియా దేశాల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరిగా గునియా దేశంలో రాష్ట్రపతి పర్యటించడం ద్వారా ఆయన పర్యటన పూర్తయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గునియా అత్యున్నత పురస్కారమైన నేషనల్ ఆర్టర్ ఆఫ్ మెరిట్ ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : కొనాక్రై, గునియా
Published date : 23 Aug 2019 01:01PM