CUET UG 2024: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)యూజీ దరఖాస్తులో మార్పులకు అవకాశం.. ఎప్పటివరకంటే..
Sakshi Education

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)యూజీ 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ముగిసింది. దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు.. ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. నిన్న(ఏప్రిల్5)తో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువు ముగిసింది.
అయితే ఏవైనా మార్పులు చేయాలనుకుంటే అధికారిక వెబ్‌సైట్, exams.nta.ac.in/CUET-UG/లో ఏప్రిల్ 7వరకు మార్పులు చేసుకోవచ్చు. కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), మరికొన్నింటిలో పేపర్, పెన్ను విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు.గతంలో మాదిరిగా 10 సబ్జెక్టులు కాకుండా ఈ సారి ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పించారు.
CUET UG 2024 పరీక్ష వివరాలు
- కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో పరీక్ష(CBT)
- CUET స్కోర్‌ను సుమారు 250 యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఉపయోగించొచ్చు.
- పరీక్ష తేదీలు: మే 15-31
- పరీక్ష సమయం: 9-12.30, 4-5.30
Published date : 06 Apr 2024 03:12PM