Skip to main content

Dr.Guguloth Shankar Naik : ఒక మారుమూల తండా నుంచి రాష్ట్ర సమాచార కమిషనర్ వ‌ర‌కు... విజ‌య‌ ప్రస్థానం...

ఒక మారుమూల తండాలోని ప్రకృతి తల్లి ఒడిలో పుట్టిన శంకర్ నాయక్ తండా నుంచి.. ఓయూ డాక్టరేట్ గా.. తెలంగాణ ఉద్యమకారుడుగా, రాష్ట్ర సమాచార కమిషనర్ గా... అంచెలంచెలుగా ఎదిగిన నాయక్ విజ‌య‌ ప్రస్థానం మీకోసం...
Guguloth Shankar Naik with his parents
Guguloth Shankar Naik with his parents

చదువుతోనే ఙ్ఞానం...
ఙ్ఞానంతోనే ఆత్మగౌరవం...
ఆత్మగౌరవంతోనే ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని దృఢ సంకల్పంతో లక్ష్యంవైపు అడుగులు వేశారు...

కుటుంబ నేప‌థ్యం : 
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం,బావాజీ గూడం గ్రామం, భోజ్య తండా కు చెందిన భాగ్య నాయక్ సాలమ్మ దంపతులకు ఐదవ సంతానం  గుగులోతు శంకర్ నాయక్.

నిరుపేద కుటుంబం నుంచి..
రెక్కాడితే గాని డొక్కాడాని నిరుపేద కుటుంబం అని తెలుసుకొని చిన్నతనం నుంచే ఉన్నత శిఖరలకు ఎదుగలనే ఉద్దేశ్యంతో క్రమశిక్షణతో  గురువుల సమక్షంలో శ్రద్దగా  చదువుకున్నారు. ప్రభుత్వ పాఠశాల  అయినా  లక్ష్య సాధనతో  చదువు కొనసాగించారు. చిన్నప్పటి నుంచే వారిలో ఉండే సృజనాత్మకమైన శక్తితో 'NCC' లో చేరి మంచి క్రమశిక్షణ తో SUO సీనియర్ అండర్ ఆఫీసర్ గా గుర్తింపు పొందినాడు.

ఎడ్యుకేష‌న్ : 
ప్ర‌భుత్వం విద్యాసంస్థలలోనే శంకర్ నాయక్ చదువు మొత్తం కొన‌సాగింది.అదే గ్రామంలో  రెండో తరగతి వరకు విద్యనభ్యసించి మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు సీతారాంపురం పాఠ‌శాల‌లో, 8వ త‌ర‌గ‌తి నుంచి పదో తరగతి వరకు మరిపెడ హైస్కూల్ చ‌దివారు. అలాగే ఇంటర్మీడియట్ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల మరిపెడ లోనే చ‌దివారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని   ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ పూర్తి చేశారు. అలాగే మాస్టారు అఫ్ ఆర్ట్స్ (M.A) ను హైద‌రాబాద్‌ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలో  పూర్తి చేశాడు. ఎం పి ఎల్ పరిశోధన  సీటు సాధించుకున్న కొన్ని కార‌ణాల వ‌ల్ల  వదులుకున్నాను. అలాగే పాలమూరు విశ్వవిద్యాలయం లో బీ.ఈడీ పూర్తి చేశారు.  తెలుగు విశ్వవిద్యాలయంలో  ఏం ఫీల్ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్. డి పరిశోధన చేసి పూర్తి చేశారు.

విజయ రహాస్యం ఇదే..
పట్టుదల.. విధేయత.. విశ్వసనీయత ఆయన విజయ రహాస్యం. మారుమూల తండాలో.. నిరుపేద గిరిజన రైతుకుటుంబంలో పుట్టినా మొదటి నుంచి ఆయనలో ఏదో ప్రత్యేకత కనిపించేది.. పదిమందిలో ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే కోరిక కనిపించేది. ఇదే ఆయ‌న‌ను రాష్ట్ర సమాచార కమిషనర్ గా ప్రమాణస్వీకారం చేసే అత్యున్నత స్థాయికి చేర్చింది.

తెలుగ ప్రతికలకు ఈయ‌న రాసిన కొన్ని ముఖ్య‌మైన‌ వ్యాసాలు..గిరిజ‌ను కోసం ప్ర‌త్యేకం.. 
1)  బంజారా సంస్కృతి ప్రదర్శన కళలు
2) శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర 
3) తెలంగాణ గిరిజన ఉద్యమ చరిత్ర
4) గిరిజన ఉద్యమ చరిత్ర
 
భారతదేశ చరిత్రలోనే చిన్న వయస్సులోనే..

Dr. Guguloth Shankar Naik


మారుమూల తండా నుంచి అంచెలంచాలుగా ఎదుగుతూ..భారతదేశ చరిత్రలోనే చిన్న వయస్సులో (RTI) రాష్ట్ర సమాచార కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన  డా.గుగులోతు శంకర్ నాయక్ మొదటి వ్యక్తి.. చిన్నతనం నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని వాటిని ఇష్టంగా మలుచుకొని తన లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగారు..  ఒక చిన్న మారుమూల తండాలో పుట్టి RTI కమిషనర్ గా పదవిని అధిరోహించడం మాములు విషయం కాదు.

గిరిజ‌ను కోసం ప్ర‌త్యేకం..
గిరిజన సమస్యల పరిష్కారం కోసం "గిరిజన హక్కుల కై పోరాడుదాం-నిలబడుద్దాం" అనే నినాదంతో శంకర్ నాయక్ కీలక పాత్ర పోషించారు. గిరిజన కెరటం మాస పత్రిక ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు చాలా అద్వాన స్థితిలో ఉన్నారని గమనించి, వీరి కోసం ఏదో చేయాలనే తపనతో 2010 వ సంవత్సరంలో "గిరిజన కెరటం" తెలుగు మాస పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ద్వారా రాష్ట్రంలో మారుమూల తండాల్లో ఉన్న‌ గిరిజనులపై అనేక వ్యాసాలు రాసి, వారి పడుతున్న ఆర్థిక ఇబ్బందులను తన పత్రికలో రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  అంతేకాకుండా ప్రభుత్వానికి, గిరిజనుల మధ్య సమన్వయ కర్తగా శంకర్ నాయక్ పనిచేసారు..  తన కలంతో ఎన్నో గొప్ప గొప్ప వ్యాసాలు రాసినారు. అదే విధంగా సమాజంలో గిరిజనులు ఎదుర్కొంటున్న‌ సమస్యల్ని,  వారి సంస్కృతి సంప్రదాయలు,  పండుగలు గొప్పతనం గురించి రాసారు. మరుగున పడిన జీవన స్థితిగతులను బయట ప్రపంచానికి పరిచ‌యం చేశారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రకటనల ద్వారా వారికీ చేర్చారు.  అదే విదంగా ప్రతి సంవత్సరం తెలుగు క్యాలెండర్ ను సైతం విడుదల చేస్తున్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చిన పత్రికను  ఆపకుండా ప్రతి నెల కొన్ని వేల పుస్తకాలను ప్రచురణ చేస్తున్నారు..

నిజమైన జీవిత సత్యం..
జీవిత పయనంలో కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమెరుగదు, సహనంతో సాధ్యం కానిది లేదు.ఈ రెండు పాటించే వారి జీవితం ఎప్పటికి ఒడుదుడుకులు లేకుండా సాగుతుంది. ఇదే నిజమైన జీవిత సత్యం.
                               - డాక్ట‌ర్‌ గుగులోతు శంకర్ నాయక్, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్

Published date : 16 Nov 2021 03:55PM