సంచలన నిర్ణయం: వీరు కచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందే..!
పలు ఐటీ దిగ్గజ కంపెనీలు వచ్చే ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో కనీసం 50 శాతం ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా హ్రైబ్రిడ్ మోడల్‌ను కూడా ప్రవేశ పెట్టాలని ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి.
వీరు కచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందే..!
వచ్చే ఏడాది నుంచి 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారు ఆఫీసులకు వారానికి రెండు లేదా మూడు రోజులు రావాలని ఐటీ కంపెనీలు ఉద్యోగులను అడుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జూలై వరకు 100 శాతం మేర ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలను ఐటీ కంపెనీలు ముమ్మరం చేస్తున్నాయి.
కొత్త వేరియంట్‌పై..
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రపంచదేశాలు భయపడిపోతున్నాయి. ఈ సమయంలో ఒమిక్రాన్ ఎఫెక్ట్‌పై ఐటీ కంపెనీలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్- 19 సెకండ్ వేవ్‌తో ఆఫీసులకు ఉద్యోగులను పిలవాలనే ఆలోచనను ఐటీ కంపెనీలు ఉపసంహరించుకోగా... తాజాగా వస్తోన్న కొత్త వేరియంట్‌పై కంపెనీలు అచితూచి వ్యవహరించాలని భావిస్తున్నాయి.
ఆఫీసులకు వస్తే..
టెక్ కంపెనీలకు ఆఫీసు స్థలాన్ని అందించే ప్రముఖ డెవలపర్లు, ప్రపంచ సంస్థలు , వారి క్లయింట్లు కార్యాలయాలను తెరిచేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్-సముచితమైన పద్ధతులను అనుమతించడంతోపాటుగా, ఆఫీసుల్లో పలు కీలక మార్పులను, కొత్త నిబంధనలకు తెచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కోవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలను తీసుకోవడానికి ఆయా కార్యాలయాల నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ ఉద్యోగుల మధ్య ఎక్కువ అంతరం ఉండేలా చూడనున్నాయి.
అంత ఎఫెక్ట్ అంతగా లేదు..!
ప్రాపర్టీ అమ్మకాల్లో ఒమిక్రాన్ ఎఫెక్ట్ అంతగా లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) పేర్కొంది. గత కొద్దిరోజుల నుంచి అమ్మకాలలో వృద్ధి ఊపందుకోవడం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే నెలల్లో కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతుంటే తప్ప, నిర్మాణ , డెలివరీ షెడ్యూల్‌ల వేగానికి ఎటువంటి అంతరాయం కలగదని ఓ పత్రిక నివేదించింది. భవిష్యత్తులో ప్రభుత్వాలు పూర్తిగా లాక్ డౌన్, కర్ఫూలను పెడితే ఆర్థిక పునరుద్దరణ దెబ్బ తినే అవకాశం ఉంది.